Photo Credit: iQOO
ఇండియన్ మొబైల్ మార్కెట్‌లోకి iQOO 13 హ్యాండ్‌సెట్ డిసెంబర్ 3న లాంచ్ కానుంది. అయితే, దీని అధికారిక లాంచ్‌కు ముందే ఓ టిప్‌స్టర్ మన దేశంలో ఈ ఫోన్ ధరను వెల్లడించారు. నిజానికి, అక్టోబర్‌లోనే చైనాలో iQOO 13 స్మార్ట్ ఫోన్ విడుదలైంది. అండర్ ది హుండ్ Qualcomm అత్యాధునిక స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను కలిగి ఉన్న మొదటి హ్యాండ్‌సెట్‌లలో ఇదొకటి. iQOO 13 Android 15లో రన్ అవుతోంది. అలాగే, 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. ఇది దుమ్ము, నీటిని నియంత్రించేందుకు IP68, IP69 రేటింగ్‌లను కలిగి ఉంది. ఈ మోడల్‌కు సంబంధించిన కీలక విషయాలను చూసేద్దాం.
టిప్‌స్టర్ Mukul Sharma (@stufflistings) Xలో వెల్లడించిన వివరాల ప్రకారం.. భారత్‌లో ఈ iQOO 13 స్మార్ట్ ఫోన్ బేస్ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 55,000 లోపు ఉంటుందని తెలిపారు. అయితే, ఈ ధర గతంలో అదే RAM, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌తో విడుదలైన iQOO 12 ఫోన్ ప్రారంభ ధర రూ. 52,999 కంటే ఎక్కువ. అలాగే, రాబోయే ఈ iQOO 13 ఫోన్ కోసం బ్యాంక్, లాంచ్ ఆఫర్‌లను ప్రకటించనున్నట్లు భావిస్తున్నారు. చైనాలో ఈ iQOO 13 ధర 12GB RAM + 256GB వేరియంట్ CNY 3,999 (దాదాపు రూ. 47,200) నుండి ప్రారంభమవుతుంది. అలాగే, 16GB + 1TB RAM, స్టోరేజ్ కోసం CNY 5,199 (సుమారు రూ. 61,400) వరకు చెల్లించాల్సి ఉంటుంది.
భారతదేశంలో iQOO 13 స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 3న ప్రారంభించబడుతుంది. ఈ Vivo సబ్-బ్రాండ్ దాని స్పెసిఫికేషన్‌లను ఒక్కొక్కటిగా రివిల్ చేస్తోంది. ఇది iQOO ఈ-స్టోర్‌తోపాటు అమెజాన్ ద్వారా అమ్మకానికి సిద్ధమవుతోంది. భారతదేశంలో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో పనిచేసే మొదటి ఫోన్‌లలో ఈ హ్యాండ్‌సెట్ ఒకటి. ఇది కంపెనీ Q2 చిప్‌ను కలిగి ఉండడంతోపాటు 2K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో Q10 LTPO AMOLED డిస్‌ప్లేతో వస్తోంది. అంతేకాదు, దుమ్ము, నీటి నియంత్రణ కోసం IP68, IP69 రేటింగ్‌లతో వస్తోంది.
నాలుగు మెయిన్ ఆండ్రాయిడ్ వెర్షన్ అప్‌గ్రేడ్‌లు, ఐదు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను మన దేశంలో iQOO 13 స్మార్ట్ ఫోన్ పొందుతుందని స్పష్టమైంది. ఈ హ్యాండ్‌సెట్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. ఇందులో సోనీ IMX 921 సెన్సార్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ సోనీ పోర్ట్రెయిట్ సెన్సార్, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాను అందించారు. ఇందులో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ ఉంది. అలాగే, ఇండియన్ వేరియంట్ హ్యాండ్‌సెట్‌ను 120W ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh భారీ బ్యాటరీతో రూపొందించారు. దీని ధరపై పూర్తి వివరాలు తెలియాంటే మాత్రం లాంచ్ వరకూ ఆగాల్సిందే.
ప్రకటన
ప్రకటన