Photo Credit: iQOO
iQOO నియో 10 ప్రో+ షి గువాంగ్ వైట్, షాడో బ్లాక్ మరియు సూపర్ పిక్సెల్ షేడ్స్‌లో వస్తుంది
స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఐకూ కంపెనీ.. చైనా మార్కెట్లోకి సరికొత్త ఫోన్‌ను లాంచ్ చేయనుంది. iQOO Neo 10 Pro+ పేరుతో మే 20న మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ స్మార్ట్ ఫోన్‌తో పాటు iQOO ప్యాడ్ 5 సిరీస్, iQOO వాచ్ 5, iQOO TWS ఎయిర్ 3 గ్యాడ్జెట్స్ కూడా లాంచ్ కానున్నాయి. ఇది గతేడాది నవంబర్‌లో ఆవిష్కరించబడిన iQOO Neo 10 మరియు Neo 10 Pro వేరియంట్‌లకు అప్‌గ్రేడ్ వెర్షన్. ఐకూ నియో 10 Pro+ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ SoC చిప్‌సెట్‌తో పాటు 2K డిస్‌ప్లే అమర్చబడి ఉంటుంది. మరి ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ర్యామ్, డిజైన్ వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.iQOO నియో 10 ప్రో+ స్పెసిఫికేషన్స్
ఐకూ నియో 10 ప్రో+ ప్లస్ స్మార్ట్ ఫోన్‌లో ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ఉపయోగించారు. చిప్‌సెట్ బ్లూ క్రిస్టల్ టెక్నాలజీతో ఆప్టిమైజ్ చేయబడిందని కంపెనీ వెల్లడించింది. ఈ హ్యాండ్‌సెట్ LPDDR5x అల్ట్రా RAM మరియు UFS 4.1 స్టోరేజ్‌కు సపోర్ట్ చేస్తుంది. AnTuTu బెంచ్‌మార్క్ పరీక్షలో ఈ గ్యాడ్జెట్ 3,311,557 స్కోర్ సాధించింంది.
ఐకూ నియో 10 Pro+ లో.. 7K "ఐస్ వాల్ట్" వేపర్ కూలింగ్ ఛాంబర్‌ను ఉపయోగించినట్లు కంపెని పేర్కొంది. ఇది ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా పెద్దదిగా ఉండి, థర్మల్ మేనేజ్‌మెంట్, హీట్ డిసిపేషన్ కోసం రూపొందించబడిందని తెలిపింది. ఇది కూలింగ్ సామర్థ్యాన్ని 15 శాతం పెంచుతుందని వివరించింది.
ఐకూ నియో 10 ప్రో+ స్మార్ట్ ఫోన్ స్లిమ్ డిజైన్‌లో రానున్నట్లు తెలిసింది. 1.5mm సైడ్ బెజెల్స్, గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌తో 2K డిస్‌ప్లేను కలిగి ఉంటుందని iQOO వెల్లడించింది. BMW M మోటార్‌స్పోర్ట్‌తో సహకారంతో ఈ స్మార్ట్ ఫోన్‌ను "ప్రిజం పిక్సెల్ డిజైన్‌గా" అభివృద్ధి చేయబడింది.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్ విషయానికొస్తే... ఇందులో 6.82-అంగుళాల ఫ్లాట్ OLED డిస్‌ప్లేను అందించారు. వెనుకవైపు 50 మెగాపిక్సెల్ డ్యుయల్ కెమెరాలను అమర్చినట్లు సమాచారం. ఇది 120W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని టాక్. ఈ హ్యాండ్‌సెట్ 16GB RAMను కలిగి ఉండి, ఆండ్రాయిడ్ 15 ఆధారిత OriginOS 5పై పనిచేస్తుంది.
ప్రకటన
ప్రకటన