టీజర్‌లో కనిపించిన బ్లూ కలర్ వెర్షన్ "ఫ్లోటింగ్ మిరర్ డిజైన్"తో ఆకట్టుకుంటోంది. దీనిలో మ్యాట్ మెటల్ మధ్య ఫ్రేమ్, శాటిన్ AG గ్లాస్ వాడటం వల్ల ఫోన్‌కు ఒక ప్రీమియం మరియు మన్నికైన లుక్ వచ్చింది. కంపెనీ ప్రకారం, ఇందులో ప్రత్యేకమైన నియాన్ టెక్నాలజీను ఉపయోగించి కాంతి తాకినప్పుడు మెరిసే రంగులను సృష్టించే విధంగా డిజైన్ చేశారు.
Photo Credit: iQOO
પાવર મિટ્સ સ્ટાઇલ — iQOO Neo11 આકર્ષક, આધુનિક ડિઝાઇન સાથે આગલા સ્તરનું પ્રદર્શન આપે છે.
iQOO సంస్థ చివరకు తన కొత్త స్మార్ట్‌ఫోన్ Neo 11 విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. గత సంవత్సరం విడుదలైన Neo 10కు కంటిన్యూషన్ గా రాబోతున్న ఈ ఫోన్‌ను అక్టోబర్ 30న చైనాలో ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కనిపించింది. కంపెనీ ప్రకటించిన వివరాల ప్రకారం, ఇది మొబైల్ పరిశ్రమలో 2K స్క్రీన్ మరియు భారీ 7500mAh బ్యాటరీతో వచ్చే ఏకైక ఫ్లాగ్‌షిప్ ఫోన్ గా నిలవనుంది. టీజర్‌లో కనిపించిన బ్లూ కలర్ వెర్షన్ "ఫ్లోటింగ్ మిరర్ డిజైన్"తో ఆకట్టుకుంటోంది. దీనిలో మ్యాట్ మెటల్ మధ్య ఫ్రేమ్, శాటిన్ AG గ్లాస్ వాడటం వల్ల ఫోన్‌కు ఒక ప్రీమియం మరియు మన్నికైన లుక్ వచ్చింది. కంపెనీ ప్రకారం, ఇందులో ప్రత్యేకమైన నియాన్ టెక్నాలజీను ఉపయోగించి కాంతి తాకినప్పుడు మెరిసే రంగులను సృష్టించే విధంగా డిజైన్ చేశారు.
ఇది కేవలం బ్లూ కలర్‌లోనే కాకుండా, పిక్సెల్ స్క్వేర్ ఆరెంజ్, షాడో బ్లాక్, మరియు లైట్ వైట్ కలర్ ఆప్షన్లలో కూడా లభించనుంది. అందులో పిక్సెల్ స్క్వేర్ ఆరెంజ్ వెర్షన్ 78 చిన్న ఆరెంజ్ క్యూబ్‌లతో ప్రత్యేకంగా రూపొందించబడింది, కాంతి ప్రకారం అవి రంగు మారుస్తూ స్టైలిష్‌గా కనిపిస్తాయి.
ప్రముఖ లీకర్ డిజిటల్ చాట్ స్టేషన్ సమాచారం ప్రకారం, ఈ ఫోన్‌లో 2K+144Hz BOE Q10+ ఫ్లాట్ స్క్రీన్తో పాటు AR ఫిల్మ్, Snapdragon 8 Elite ప్రాసెసర్, 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, అలాగే IP68 మరియు IP69 రేటింగ్స్ కలిగిన డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లు ఉంటాయి. అదనంగా, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందించనున్నారు. దీంతో కొద్దిసేపు ఛార్జింగ్ చేసిన ఫోన్ నిరంతరయంగా వాడుకునే సౌకర్యం ఉంటుంది.
ఫోన్‌కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు మరియు ధర వివరాలు మాత్రం వచ్చే వారం అధికారికంగా తెలియనున్నాయి. iQOO అభిమానులు ఈ ఫ్లాగ్‌షిప్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. టీజర్ లో కెమెరా మార్డ్వేర్ కనిపించినప్పటికీ, ఎంత మెగా ఫిక్స్ లో ఈ కెమెరాని ప్రవేట్ చేస్తున్నారో మాత్రం వెల్లడించలేదు. అలాగే ఫోన్ బరువు, డైమెన్షన్స్ కూడా బయటికి రాలేదు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఈ ఫోన్ లాంచ్ అయ్యేవరకు వెయిట్ చేయాల్సిందే.
ప్రకటన
ప్రకటన
Microsoft Patches Windows 11 Bug After Update Disabled Mouse, Keyboard Input in Recovery Mode
Assassin's Creed Shadows Launches on Nintendo Switch 2 on December 2