ఇతర హార్డ్‌వేర్ వివరాల విషయానికి వస్తే, Xiaomi 17 Max లో సుమారు 6.8 అంగుళాల పెద్ద డిస్‌ప్లే, అలాగే Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్ ఉండే అవకాశం ఉందని గత నివేదికలు సూచిస్తున్నాయి.
Photo Credit: Xiaomi
Xiaomi 17 లో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది.
షియోమీ కంపెనీ తమ ప్రస్తుత ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో కొత్తగా తీసుకురాబోతున్న మోడల్ Xiaomi 17 Max. ఇప్పటికే లీక్‌లలో కనిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్ భారీ బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్‌తో పాటు మరింత మెరుగైన కెమెరా సెటప్‌తో రానుంది. ఇప్పటివరకు వినిపించిన వివరాల కంటే తాజాగా వచ్చిన లీక్‌లు, Xiaomi 17 Max కెమెరా విభాగంలో గణనీయమైన అప్‌గ్రేడ్ ఉండబోతుందని సూచిస్తున్నాయి. చైనాకు చెందిన ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ (Digital Chat Station) తన Weibo ఖాతా ద్వారా వెల్లడించిన సమాచారం ప్రకారం, Xiaomi 17 Max లో 200MP Samsung ISOCELL HPE మెయిన్ సెన్సర్ ఉండనుంది. ఈ సెన్సర్ సైజ్ 1/1.4 అంగుళాలు ఉండటం గమనార్హం. ఇది తక్కువ వెలుతురు పరిస్థితుల్లో కూడా అధిక నాణ్యత గల ఫోటోలు తీయడానికి ఉపయోగపడుతుందని అంచనా. మెయిన్ కెమెరాతో పాటు, ఈ ఫోన్‌లో 50MP Sony IMX8 సిరీస్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా (1/1.953 అంగుళాల సెన్సర్) ఉండే అవకాశం ఉంది.
దీని ద్వారా మెరుగైన ఆప్టికల్ జూమ్, స్పష్టమైన డీటెయిల్స్ లభించనున్నాయి. అదనంగా, 50MP అల్ట్రావైడ్ లెన్స్ కూడా ఈ కెమెరా సెటప్‌లో భాగంగా ఉంటుందని సమాచారం. సాధారణ Xiaomi 17 మోడల్‌లో మెయిన్, టెలిఫోటో, అల్ట్రావైడ్ మొత్తం మూడు 50MP కెమెరాలే ఉన్నాయి. అయితే 17 Max మోడల్‌లో 200MP మెయిన్ సెన్సర్ ఉండటం వల్ల ఫోటోగ్రఫీ పరంగా ఇది స్పష్టంగా ముందంజలో నిలుస్తుంది. అలాగే, షియోమీ తమ ప్రఖ్యాత Leica భాగస్వామ్యాన్ని ఈ ఫోన్‌లో కూడా కొనసాగించనున్నట్లు లీక్‌లో పేర్కొన్నారు, అంటే కలర్ ట్యూనింగ్, ఇమేజ్ ప్రాసెసింగ్ విషయంలో ప్రీమియం అనుభూతి ఉండనుంది.
ఇతర హార్డ్‌వేర్ వివరాల విషయానికి వస్తే, Xiaomi 17 Max లో సుమారు 6.8 అంగుళాల పెద్ద డిస్‌ప్లే, అలాగే Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్ ఉండే అవకాశం ఉందని గత నివేదికలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఫోన్‌లో 8,000mAh భారీ బ్యాటరీ ఉండటం ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఇది 100W వైర్డ్ చార్జింగ్, 50W వైర్‌లెస్ చార్జింగ్కు మద్దతు ఇవ్వనుంది.
ఇది నాన్-ప్రో మోడల్ కావడంతో, Xiaomi 17 Pro మరియు 17 Pro Max లలో ఉన్నట్లుగా వెనుకవైపు సెకండరీ డిస్‌ప్లే ఇందులో ఉండకపోవచ్చు. బదులుగా, దీని రియర్ డిజైన్ సాధారణ Xiaomi 17 కు దగ్గరగా ఉండే అవకాశం ఉంది.
చివరగా, ఈ ఫోన్ 2026 రెండో త్రైమాసికంలో (Q2 2026) చైనాలో లాంచ్ అవుతుందని డిజిటల్ చాట్ స్టేషన్ పేర్కొన్నారు. అయితే గ్లోబల్ మార్కెట్ విషయానికి వస్తే, Xiaomi అంతర్జాతీయంగా Xiaomi 17 మరియు Xiaomi 17 Ultra మోడళ్లను మాత్రమే విడుదల చేసే అవకాశం ఎక్కువగా ఉందని సమాచారం. అందువల్ల Xiaomi 17 Max గ్లోబల్ యూజర్లకు అందుబాటులోకి రావడం కాస్త కష్టమే అని చెప్పాలి.
ప్రకటన
ప్రకటన
Redmi Turbo 5 Chipset, Display and Other Key Features Confirmed Ahead of January 29 Launch