బటన్ల విషయానికి వస్తే, వాల్యూమ్ అప్, డౌన్ బటన్ల కింద పవర్ / లాక్ కీ ఉంటుంది. వీటిని తప్ప మరే ఫిజికల్ బటన్లు ఫోన్‌లో లేవు. డిజైన్ పరంగా ఇది క్లీన్గా, సింపుల్‌గా కనిపిస్తుంది.
Samsung Galaxy A57 మరియు Galaxy A37 త్వరలో Galaxy A56 మరియు Galaxy A36 వారసులుగా లాంచ్ కావచ్చు.
సామ్‌సంగ్ మిడ్-రేంజ్ విభాగంలో త్వరలో విడుదల చేయబోయే అత్యంత ఆసక్తికరమైన స్మార్ట్‌ఫోన్‌లలో Samsung Galaxy A57 ఒకటి. ఇప్పటివరకు ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లు, లీకులు బయటకు వచ్చినప్పటికీ, అధికారిక రెండర్లు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఇవి ఫోన్ డిజైన్‌ను పూర్తిగా అర్థం చేసుకునేలా చేస్తున్నాయి. ముందుభాగం, వెనుకభాగం రెండింటినీ చూపించే ఈ రెండర్లు ప్రస్తుతం బ్లాక్ కలర్ వేరియంట్‌లో కనిపిస్తున్నాయి. Galaxy A57 ఫ్లాట్ డిస్ప్లేతో రానుంది. పైభాగంలో సెంటర్‌లో హోల్-పంచ్ కెమెరా ఉంటుంది. డిస్ప్లే చుట్టూ ఉన్న బెజెల్స్ చాలా పలుచగా ఉన్నాయి. కిందివైపు బెజెల్ మాత్రం స్వల్పంగా మందంగా కనిపిస్తుంది. ఫోన్ ఫ్రేమ్ పూర్తిగా ఫ్లాట్‌గా ఉండగా, కుడివైపు బటన్లు ఉన్న భాగం కొద్దిగా బయటకు వచ్చినట్టు ఉంటుంది. దీనినే సామ్‌సంగ్ ‘Key Island' అని పిలుస్తోంది. ఇటీవల విడుదలైన Galaxy A17లో దీనిని ‘Key Island 2.0'గా ప్రమోట్ చేశారు.
బటన్ల విషయానికి వస్తే, వాల్యూమ్ అప్, డౌన్ బటన్ల కింద పవర్ / లాక్ కీ ఉంటుంది. వీటిని తప్ప మరే ఫిజికల్ బటన్లు ఫోన్‌లో లేవు. డిజైన్ పరంగా ఇది క్లీన్గా, సింపుల్‌గా కనిపిస్తుంది. ఫోన్ వెనుకభాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఎడమవైపు పై మూలలో వర్టికల్‌గా అమర్చిన మూడు కెమెరాలు ఒకే కెమెరా ఐలాండ్‌లో ఉంటాయి. ఆ ఐలాండ్ కొద్దిగా బయటకు ఉబ్బినట్టుగా ఉంటుంది. దాని పక్కనే LED ఫ్లాష్ ఉంటుంది. వెనుక కవర్ పూర్తిగా ఫ్లాట్‌గా ఉండగా, కిందివైపు సామ్‌సంగ్ లోగో కనిపిస్తుంది. దిగువ భాగంలో USB Type-C పోర్ట్, స్పీకర్, మైక్రోఫోన్‌లు ఉండనున్నాయి.
స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే, Galaxy A57లో 6.6 ఇంచుల Full HD+ (2340 x 1080) AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఫోన్‌లో ట్రై-క్లస్టర్ CPUతో కూడిన ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉండనుంది. క్లాక్ స్పీడ్స్ 2.9GHz, 2.6GHz, 1.95GHzగా ఉండగా, ఇందులో Exynos 1680 చిప్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఫోన్ 8GB, 12GB RAM వేరియంట్లలో రావచ్చు. స్టోరేజ్ విషయంలో కనీసం ఒక వేరియంట్‌లో 256GB అందుబాటులో ఉంటుంది. పవర్ కోసం 5,000mAh బ్యాటరీ ఇవ్వనుండగా, 45W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. వైర్లెస్ ఛార్జింగ్ మాత్రం ఉండదు. సాఫ్ట్‌వేర్ పరంగా Android 16 ఆధారిత One UI 8.0 లేదా 8.5 ముందే ఇన్‌స్టాల్ చేసి వస్తుంది. కెమెరాల విషయానికి వస్తే, వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరా, 12MP సెకండరీ కెమెరా, 5MP మూడో కెమెరా ఉంటాయి. ముందు భాగంలో 12MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. అదనంగా, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా అందించనున్నారు. Galaxy A57 పరిమాణాలు 161.5 x 76.8 x 6.9mm కాగా, బరువు 182 గ్రాములు. గత మోడల్ మార్చి 2, 2025న విడుదల కావడంతో, ఈ కొత్త ఫోన్ ఫిబ్రవరి మొదటి లేదా రెండో వారంలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అప్పటివరకు వేచి చూడాల్సిందే.
ప్రకటన
ప్రకటన
Redmi Turbo 5 Chipset, Display and Other Key Features Confirmed Ahead of January 29 Launch