iQOO Neo 11 2K రిజల్యూషన్ ఉన్న హై-క్వాలిటీ డిస్‌ప్లేతో రాబోతుందని టిప్‌స్టర్లు వెల్లడించారు. ఈ ఫోన్‌లో గత సంవత్సరం క్వాల్కమ్ విడుదల చేసిన స్నాప్ డ్రాగన్ 8 Elite చిప్‌సెట్ ఉండవచ్చని సమాచారం.
Photo Credit: iQOO
iQOO Neo 10 భారతదేశంలో స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 SoC తో ప్రారంభించబడింది
Vivo సబ్-బ్రాండ్ అయిన iQOO తన కొత్త స్మార్ట్‌ఫోన్ iQOO Neo 11 సిరీస్ విడుదలకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఫోన్ తొలుత చైనాలో విడుదలై, తరువాత గ్లోబల్ మార్కెట్లలోకి రావచ్చని సమాచారం. కంపెనీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయకపోయినా, లీకైన వివరాలు చూస్తే ఇది గత సంవత్సరం విడుదలైన iQOO Neo 10 కంటే పెద్ద అప్‌గ్రేడ్‌గా కనిపిస్తోంది.iQOO Neo 11 2K రిజల్యూషన్ ఉన్న హై-క్వాలిటీ డిస్‌ప్లేతో రాబోతుందని టిప్‌స్టర్లు వెల్లడించారు. ఈ ఫోన్‌లో గత సంవత్సరం క్వాల్కమ్ విడుదల చేసిన స్నాప్ డ్రాగన్ 8 Elite చిప్‌సెట్ ఉండవచ్చని సమాచారం. ఈ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 8 Elite Gen 5 కు పూర్వ మోడల్ అయినప్పటికీ, గేమింగ్ మరియు మల్టీటాస్కింగ్‌లో అద్భుతమైన పనితీరు ఇస్తుందని చెప్పబడుతోంది.
చైనీస్ టిప్‌స్టర్ Smart Pikachu ప్రకారం, ఈ కొత్త మోడల్‌లో ప్రీమియం బిల్డ్ క్వాలిటీతో పాటు అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, మెరుగైన రిఫ్రెష్ రేట్ మరియు గేమింగ్ పనితీరును పెంచే మాన్స్టర్ సూపర్ కోర్ ఇంజన్ కూడా ఉండవచ్చని లీక్‌ల్లో వెల్లడించారు. ఈ ఫోన్‌లో 7,500mAh బ్యాటరీని చేర్చే అవకాశం ఉంది. దీని వల్ల దీర్ఘకాలం గేమింగ్ లేదా స్ట్రీమింగ్ చేసినా కూడా బ్యాటరీ లైఫ్ సమస్య ఉండదని అంచనా.
లీక్‌ల ప్రకారం, iQOO Neo 11 మరియు iQOO Neo 11 Pro మోడళ్లు ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో చైనాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రెండు మోడళ్లూ 6.8 ఇంచులకంటే పెద్ద డిస్‌ప్లే, మెటల్ ఫ్రేమ్ డిజైన్, మరియు 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లతో రాబోతున్నాయి. Pro వేరియంట్లో మీడియా టెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్ వాడే అవకాశం ఉందని సమాచారం. రెండు ఫోన్లూ ఆండ్రాయిడ్16 బేస్డ్ OriginOS 6 యూజర్ ఇంటర్‌ఫేస్‌తో రాబోతున్నాయి.
గత ఏడాది విడుదలైన iQOO Neo 10లో 6.78-అంగుళాల AMOLED కర్వ్‌డ్ డిస్‌ప్లే, 50MP డ్యూయల్ రియర్ కెమెరాలు, 16MP సెల్ఫీ కెమెరా, మరియు 6,100mAh బ్యాటరీతో 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభించాయి. ఇది చైనాలో స్నాప్ డ్రాగన్ 8 Gen 3 చిప్‌తో విడుదలై, గేమింగ్ కోసం కంపెనీ స్వయంగా అభివృద్ధి చేసిన Q2 చిప్‌తో వచ్చింది. భారత్‌లో ఈ మోడల్ రూ. 31,999 ప్రారంభ ధరతో విడుదలై, 8GB + 128GB వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చింది. భారత వేరియంట్‌లో స్నాప్ డ్రాగన్ 8s Gen 4 చిప్‌సెట్, 32MP ఫ్రంట్ కెమెరా, మరియు 7,000mAh బ్యాటరీ ఉన్నాయి. ఈ వివరాలన్నింటినీ బట్టి చూస్తే, రాబోయే iQOO Neo 11 సిరీస్ గేమింగ్ ప్రేమికులు మరియు పవర్ యూజర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన హై-పర్ఫార్మెన్స్ స్మార్ట్‌ఫోన్‌గా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
ప్రకటన
ప్రకటన