Photo Credit: iQOO
దేశంలోని మొబైల్ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్. తాజా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024లో iQOO స్మార్ట్‌ఫోన్‌లు ఆకర్షణీయమైన తగ్గింపు ధరలకు లభించనున్నాయి. ఈ సెప్టెంబర్ 27న భారతదేశంలో ఈ సేల్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. Amazon Prime వినియోగదారులు సెప్టెంబర్ 26 నుండి ముందస్తు యాక్సెస్‌ను పొందుతారు. ఈ సేల్‌లో iQOO Z9x 5G, Z9 Lite 5G, Z9s Pro 5G, Neo 9 Pro, iQOO 12 5Gతో సహా iQOO స్మార్ట్‌ఫోన్‌లతోపాటు iQOO TWS 1e ఇయర్‌బడ్‌లు కూడా చాలా తక్కువ ధరలకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ తక్కువ ధరలతోపాటు బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. ఉదాహరణకు SBI క్రెడిట్, డెబిట్ కార్డ్ వినియోగదారులు 10 శాతం డిస్కౌంట్ ఆఫర్‌కు అర్హులు.
4GB + 128GB వేరియంట్‌లో రూ. 10,499 ధరతో లాంచ్ అయిన iQOO Z9 Lite మొబైల్‌ను అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్ సందర్భంగా రూ. 9,499లకు సొంతం చేసుకోవచ్చు. అలాగే, iQOO Z9xని అతి తక్కువ ధరలో రూ. 10,749 కొనుగోలు చేయవచ్చు. దీని లాంచ్ ధర 4GB + 128GB వేరియంట్ కోసం రూ. 12,999గా ఉంది. వీటితోపాటు iQOO Z9s 5G, Z9s Pro 5G రాబోయే అమెజాన్ సేల్‌లో ఆరు నెలల వరకు నో-కాస్ట్ EMI ప్రయోజనాలు పొందొచ్చు.
బేస్ మోడల్ iQOO Z9s అసలు ధర 8GB + 128GB వేరియంట్ కోసం రూ. 19,999కాగా, దీనిని సేల్‌లో రూ. 17,499కి సొంతం చేసుకోవచ్చు. అలాగే, iQOO Z9s Proని తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. 8GB + 128GB వేరియంట్ రూ. 21,999కాగా, రూ. 3,000 వరకూ డిస్కౌంట్ పొందవచ్చు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024 సమయంలో iQOO Neo 9 Pro ఆరు నెలల వరకు నో కాస్ట్ EMI ఆఫర్‌లతో కూడా అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 8GB + 128GB వేరియంట్ కంపెనీ ధర రూ. 35,999గా ఉంది. ఈ సేల్ సమయంలో దీని ధర రూ. 31,999గా ప్రకటించారు. అంతేకాదు, వినియోగదారులు అదనంగా రూ. 2,000 ఎక్స్‌చేంజ్ ఆఫర్లును పొందవచ్చు.
గతేడాది డిసెంబర్‌లో లాంచయిన iQOO 12 5G రాబోయే అమెజాన్ సేల్‌లో తక్కువ ధరకు లభించనుంది. 12GB + 256GB వేరియంట్ కోసం రూ. 47,999 ఖర్చు చేస్తే సరిపోతుంది. ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్ అసలు ధర రూ. రూ. 52,999. తగ్గింపు ధరపై కొనుగోలుదారులు తొమ్మిది నెలల వరకు నో-కాస్ట్ EMI ప్రయోజనాలను పొందడంతోపాటు రూ. 2,000 ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా ఉంది. iQOO TWS 1e ఇయర్‌బడ్స్ అసలు ధర రూ. 1,899 ఉండగా.. రూ. 1,599 లభిస్తున్నాయి.
ప్రకటన
ప్రకటన