13 భారతీయ భాషల మద్దతుతో పాటు, కింగ్ వాయిస్ అనే ప్రత్యేక ఫీచర్ కూడా ఇందులో ఉంది. వెనుకవైపు ఒక సాధారణ QVGA కెమెరా ఉంది. ఇదే శ్రేణిలోని స్టాండర్డ్ వెర్షన్ అయిన ఇటెల్ సూపర్ గురు 4జీ ఫోన్ 2024 ఏప్రిల్‌లో మార్కెట్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే.
Photo Credit: Lava
ఐటెల్ సూపర్ గురు 4G మ్యాక్స్ డ్యూయల్ సిమ్ కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది
ఇటెల్ మొబైల్స్ కొత్తగా మార్కెట్‌లోకి తీసుకొచ్చిన ఫీచర్ ఫోన్ సూపర్ గురు 4జీ మ్యాక్స్ ఇప్పుడు టెక్ ప్రియులు దృష్టిని ఆకర్షిస్తోంది. స్మార్ట్‌ఫోన్ ఫీచర్లను కలిగి ఉండే ఈ ఫీచర్ ఫోన్, తక్కువ ధరలో మంచి ఫీచర్స్ అందిస్తుంది. ఈ ఫోన్ బుధవారం భారత మార్కెట్‌లో విడుదలైన ఈ ఫోన్, పెద్ద డిస్ప్లే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అసిస్టెంట్, 13 భాషల మద్దతు, డ్యూయల్ సిమ్, మరియుType-C పోర్ట్ లాంటి ప్రత్యేకతలు ఈ ఫోన్లో ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.ఈ ఫోన్ ధర రూ. 2,099 మాత్రమే అని కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం ఇది దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ మరియు ఆఫ్లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, చాంపైన్ గోల్డ్ వంటి మూడు కలర్ ఆప్షన్‌లలో లభిస్తోంది
ఈ ఫోన్‌లో 3 అంగుళాల స్క్వేర్ డిస్‌ప్లే ఉంది. ఫీచర్ ఫోన్ కేటగిరీలో చూస్తే ఈ ఫోన్లో పెద్ద డిస్‌ప్లే ఉన్నట్టే. మొబైల్ సైజ్ చిన్నగా ఉండి, డిస్‌ప్లే కంఫర్ట్‌గా ఉండాలని కోరుకునే వారికి ఇది బాగా నచ్చుతుంది.
ఈ కీప్యాడ్ ఫోన్లో కెమెరా ఫెసిలిటీ కూడా ఉంది. వెనుక భాగంలో సాధారణ QVGA కెమెరా ఉంటుంది. ఇది నార్మల్ గా ఫోటోలు తీసుకునేందుకు బాగా హెల్ప్ అవుతుంది. ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే ఈ ఫోన్లో 2,000mAh బ్యాటరీ ఉంది. ఒకసారి ఫుల్ గా ఛార్జింగ్ పెడితే 22 గంటల వరకూ కాల్ టైం ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది ఎక్కువగా మాట్లాడే వారికి మరియు పవర్ ఫెసిలిటీస్ లేని చోటకి ఎక్కువగా ట్రావెల్ చేసే వారికి బాగా హెల్ప్ అవుతుంది.
ఈ ఫోన్‌లో బిల్ట్-ఇన్ AI అసిస్టెంట్ ఉంది. దీని ద్వారా వినియోగదారులు వాయిస్ కమాండ్ ఇచ్చి కాల్స్ చేయడం, అలారంలు సెటప్ చేయడం, మెసేజ్ చదవడం, పాటలు ప్లే చేయడం వంటి పనులను చేయవచ్చు. –ఈ ఫీచర్ పెద్దవాళ్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫోన్ 13 భారతీయ భాషలకు మద్దతు అందిస్తుంది. వాటిలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఉర్దూ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, ఒడియా, పంజాబీ, అస్సామీ, ఇంగ్లీష్ భాషలు ఉన్నాయి. టెక్స్ట్-టు-స్పీచ్ టూల్ కూడా ఇందులో ఉండటం విశేషం. ఇది హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో టెక్స్ట్‌ను ఆడియో రూపంలో చదవగలదు.
ఇందులో ఉన్న ఇతర ఫీచర్లోను పరిశీలిస్తే.. ఈ ఫోన్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది. USB Type-C పోర్ట్, FM రేడియో, వాయిస్ ఆధారిత మల్టీమీడియా కంట్రోల్, వీడియో, ఆడియో ప్లేయర్, కాల్ రికార్డింగ్ సపోర్ట్, 64GB వరకు ఎక్స్‌పాండబుల్ మెమొరీ, 2,000 కాంటాక్ట్స్ స్టోరేజ్ స్పెషల్ ఫీచర్స్ అన్ని ఇందులో ఇంక్లూడ్ చేశారు. ఇది స్మార్ట్ ఫోన్ కు ఏ మాత్రం తీసుకుని విధంగా అన్ని రకాల ఆప్షన్స్ కలిగి ఉంది. ఈ ఫోన్ ప్రధానంగా పెద్దవాళ్లకు, ఇంటి వాడకానికి, లేదా బ్యాక్‌అప్ ఫోన్గా వాడాలనుకునే వారికి సరిగ్గా సరిపోతుంది. స్మార్ట్‌ఫోన్ కు దూరంగా ఉండాలనుకునే వారికి లేదా ఫీచర్లు అవసరం లేనివారికి ఇది మంచి ఆప్షన్.
ప్రకటన
ప్రకటన