Photo Credit: Reliance Jio
భారత్‌లో JioTag Go పేరుతో స్మార్ట్ డివైజ్‌ను రిలయన్స్ సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది Google Find My Device నెట్‌వర్క్‌కు సపోర్ట్‌తో మన దేశపు మొట్టమొదటి Android ట్రాకర్‌గా గుర్తింపు పొందింది. వినియోగదారులు ట్రాకర్‌ను Google Find My Device యాప్‌తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఆండ్రాయిడ్ ఫోన్‌ల నెట్‌వర్క్‌ను ఉపయోగించి గుర్తించగలరు. ఈ Bluetooth-enabled ట్రాకర్ ఒక సంవత్సరం వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. ఈ ఏడాది జూలైలో రిలయన్స్ JioTag ఎయిర్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇది Apple Find My నెట్‌వర్క్‌కు అనుకూలంగా ఉంటుంది.
JioTag Go ధర మన దేశీయ మార్కెట్‌లో రూ. 1,499గా కంపెనీ నిర్ణయించింది. అలాగే, ఇది దేశంలో అమెజాన్, జియోమార్ట్ ఈ-స్టోర్‌తోపాటు రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్‌ల ద్వారా కూడా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ఈ ట్రాకర్ నలుపు, నారింజ, తెలుపు, పసుపు రంగుల ఎంపికలలో లభిస్తుంది. దీని డిజైన్ వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Google Find My Device ఫీచర్‌కు సపోర్ట్ చేసే ఓ బ్లూటూత్ ట్రాకర్ ఈ JioTag Go. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలోని ఫైండ్ మై డివైస్ అప్లికేషన్‌తో ట్రాకర్ కనెక్ట్ అవుతుంది. దీనిని వినియోగదారులు ప్లే స్టోర్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ వస్తువులను ట్రాక్ చేయడానికి దీన్ని వినియోగించుకోవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. దీని సహాయంలో వస్తువులను సులువుగా గుర్తించవచ్చు.
ఇది తాళం చెవులు, పర్సులు, గాడ్జెట్‌లు, బైక్‌లు వంటివివాటికి అటాచ్ చేయడం ద్వారా అవి పోయినట్లయితే వాటిని గుర్తించేందుకు ఉపయోగించవచ్చు. బ్లూటూత్ పరిధిలో ఉన్నప్పుడు వినియోగదారులు Find My Device యాప్‌లో ‘ప్లే సౌండ్'ఆప్షన్‌ను యాక్టివేట్ చేసుకోవడం వల్ల సంబంధిత JioTag Go బీప్ శబ్దం చేస్తుంది. ఇది పోగొట్టుకున్న వస్తువును సులభంగా గుర్తించడంలో సహాయపడుతుంది. Google Find My Device నెట్‌వర్క్ ద్వారా బ్లూటూత్ పరిధి వెలుపల ట్రాకర్ చివరి స్థానాన్ని గుర్తించవచ్చు.
Reliance Jio నుండి ఈ తాజా ట్రాకర్ Android 9, అంతకంటే ఎక్కువ వెర్షన్ స్మార్ట్‌ఫోన్‌లకు అనుకూలంగా ఉంటుంది. అయితే, ఇది ఐఫోన్‌లకు కనెక్ట్ చేయబడదు. JioTag Air iOS 14 లేదా ఆ తర్వాత వెర్షన్‌లో నడుస్తున్న iPhone మోడల్‌లతో పాటు Android 9, ఆ తర్వాతి వెర్షన్‌లలోని Android స్మార్ట్ ఫోన్‌లకు అనుకూలంగా ఉంటుంది. JioTag Go పని చేసేందుకు ఎలాంటి SIM కార్డ్ అవసరం లేదు. బ్లూటూత్ 5.3 కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. CR2032 బ్యాటరీతో వస్తుంది. ట్రాకర్ 38.2 x 38.2 x 7.2 మిమీ పరిమాణంతో 9 గ్రాముల బరువు ఉంటుందని అమెజాన్ లిస్ట్‌లో వెల్లడైంది.
ప్రకటన
ప్రకటన