Photo Credit: Lava
అక్టోబర్ మొదటి వారంలో దేశీయ మార్కెట్‌లోకి Lava Agni 3 5G అడుగుపెట్టనున్నట్లు X (గతంలో ట్విట్టర్) వేదికగా కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే ఈ 5G ఫోన్‌కు సంబంధించిన డిజైన్, కెమెరా వివరాలను అధికారిక టీజర్లు వెల్లడిస్తున్నాయి. గత సంవత్సరం విడుదలైన Lava Agni 2 5G మాదిరిగానే ఈ కొత్త మోడల్ కూడా ఫీచర్స్‌ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. Lava నుంచి రాబోయే Agni 3 స్మార్ట్‌ఫోన్ 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరా సెటప్‌తో ఆకర్షణీయమైన రెండు రంగులలో రానుంది. ఇది అమెజాన్ ద్వారా విక్రయించబడుతుందని కంపెనీ ధృవీకరించింది. అలాగే, Lava Agni 3 5G MediaTek డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌పై రన్ అవుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Lava Agni 3 దేశీయ మార్కెట్‌లో అక్టోబర్ 4న మధ్యాహ్నం 12:00 గంటలకు లాంచ్ అవుతుంది. ఈ లాంచ్ ఈవెంట్ యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఇప్పటికే షేర్ చేసిన టీజర్ వీడియోలో ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్‌లలో కనువిందు చేస్తోంది. ఇది వెనుక ప్యానెల్‌పైన మంచి ఆకృతిలో కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం ఈ హ్యాండ్‌సెట్ ధర రూ. 25,000 వరకూ ఉండవచ్చు.
Lava Agni 3 5G కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌కు సపోర్ట్‌తో ప్రైమరీ సెన్సార్‌ని సూచించేలా 50MP OIS అనే టెక్స్ట్ చెక్కబడి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల ఫుల్-HD డిస్‌ప్లేతో వస్తుందని ఊహాగానాలు చక్కర్లు కొడుడుతున్నాయి. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5ని అందించారు. అలాగే, ఇది వెనుక ప్యానెల్‌లో సెకండరీ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని, MediaTek డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో రన్ అవుతుందని భావిస్తున్నారు. ఇది నాలుగు నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్‌పై తయారు చేయబడింది. ప్రత్యేకించి 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా, సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరాను అందించారు.
గత ఏడాది మేలో విడుదలైన Lava Agni 2 5G కంటే Lava Agni 3 5G మంచి అప్‌గ్రేడ్‌లను అందించే అవకాశం ఉంది. దీనిAgni 2 ధర 8GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్‌లో రూ. 21,999. ఇది 6.78-అంగుళాల ఫుల్-HD (2220x1080 పిక్సెల్‌లు) కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది MediaTek Dimensity 7050 ప్రాసెసర్, 6GB వరకు RAMతో రన్ అవుతుంది. ఈ హ్యాండ్‌సెట్ 50-మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. అలాగే, 66W ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,700mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. కొత్త లాంచ్ కాబోతోనన Lava Agni 3 5G స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం అక్టోబర్ 4 వరకూ వేచి చూడాల్సిందే మరి!
ప్రకటన
ప్రకటన