Photo Credit: Lava
The Lava Agni 3 will feature a 1.74-inch secondary display
Lava కంపెనీ నుండి వస్తోన్న Agni సిరీస్ సరసమైన ధరలతో అత్యుత్తమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లను అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ మంచి పనితీరు, సెగ్మెంట్-లీడింగ్ ఫీచర్‌లను అందించడం ద్వారా టెక్ ఔత్సాహికులతోపాటు మొబైల్ ప్రియులను ఆకర్షిస్తోంది. ఈ సిరీస్ కొనసాగింపుగా Lava Agni 3 స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ మార్కెట్‌లోకి అక్టోబర్ 04న తీసుకువచ్చేందుకు కంపెనీ సన్నద్ధమైంది. Lava ఇంటర్నేషనల్ ప్రొడక్ట్ హెడ్ సుమిత్ సింగ్.. గాడ్జెట్స్ 360తో ప్రత్యేకమైన ఇంటరాక్షన్ సందర్భంగా Lava Agni 3 అధికారిక లాంచ్‌కు ముందు కొన్ని కీలక ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లను వెల్లడించారు.
త్వరలో రాబోయే Lava Agni 3 ధర దేశీయ మార్కెట్‌లో రూ. 30,000లోపు ఉంటుందని సింగ్ స్పష్టం చేశారు. అలాగే, ఈ హ్యాండ్‌సెట్ మిడ్-రేంజ్ సెగ్మెంట్‌ను అందజేస్తుందని అన్నారు. దీనిలో రెండు డిస్‌ప్లేలు ఉంటాయని సింగ్ దృవీకరించారు. ప్రైమరీ డిస్‌ప్లేతో ప్రారంభించి, హ్యాండ్‌సెట్ 1.5K కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో లోడ్ అవుతుంది. ఇది 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ప్రత్యేకించి, హ్యాండ్‌సెట్ వెనుక కెమెరా మాడ్యూల్ పక్కన ప్యానెల్‌లో సెకండరీ డిస్‌ప్లే ఉంటుందని అతను ధృవీకరించారు. ఈ సెకండరీ డిస్‌ప్లే 1.74-అంగుళాల AMOLED స్క్రీన్‌తో అనేక అప్లికేషన్‌లను అందిస్తుంది.
ఈ కొత్త డిస్‌ప్లేతో అనేక ఉపయోగాలు ఉన్నట్లు తెలిపారు. ఉదాహరణకు, ప్రైమరీ కెమెరా సెటప్ నుండి క్వాలిటీ సెల్ఫీలను క్లిక్ చేయడానికి సెకండరీ డిస్‌ప్లేను వ్యూఫైండర్‌గా ఉపయోగించవచ్చు. అలాగే, డ్యూయల్ డిస్‌ప్లేతో ప్రధాన కెమెరా సెన్సార్‌ను సెల్ఫీ కెమెరాగా ఉపయోగించవచ్చని తెలిపారు. సెకండరీ డిస్‌ప్లే కేవలం కెమెరా ఫీచర్‌కే పరిమితం కాకుండా కాల్‌లకు సమాధానం ఇవ్వడానికి, నోటిఫికేషన్‌లను వీక్షించడానికి, మ్యూజిక్ ప్లేబ్యాక్‌ని నియంత్రించడానికి ఇలా అనేక విధులను నిర్వహించేందుకు సహాయపడుతుంది.
Lava Agni 3కి యాక్షన్ బటన్‌ను అందించారు. వెనుక ప్యానెల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉందని ఆయన వెల్లడించారు. హ్యాండ్‌సెట్ 50-మెగాపిక్సెల్ AI కెమెరాను అందిస్తున్నట్లు ఇప్పటికే టీజర్ ధృవీకరించింది. ఈ స్మార్ట్‌ఫోన్ టెలిఫోటో లెన్స్‌తో కూడా లోడ్ చేయబడుతుందని సింగ్ తెలిపారు. సరికొత్త MediaTek డైమెన్సిటీ 7300X ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుందని నిర్ధారించడం ద్వారా ఈ సెగ్మెంట్-ఫస్ట్ అవుతుంది. మనదేశంలో Motorola Razr 50తో సరికొత్త చిప్‌సెట్ ఇటీవల ప్రకటించబడింది.
ఇప్పటికే Lava తన Agni సిరీస్‌తో దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మంచి స్థానాన్ని సంపాదించగలిగింది. "Agni సిరీస్ అనేది భారతీయ బ్రాండ్ యొక్క సామర్థ్యానికి నిదర్శనం" అని సింగ్ అన్నారు. Lava Agni 1, Lava తన Agni 2లకు వినియోగదారులను నుంచి మంచి స్పందన వచ్చింది. Agni 2 అధికారికంగా లాంచ్ అయిన వెంటనే అత్యధికంగా విక్రయించబడిన స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. Lava Agni 3కి కూడా అదే తరహా స్పందన వస్తుందని కంపెనీ ఆశిస్తోంది. లాంచ్ Lava Agni 3కి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం!
ప్రకటన
ప్రకటన