టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ ఇచ్చిన సమాచారం ప్రకారం, Lava Agni 4 ధర భారత మార్కెట్లో రూ. 30,000 కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇందులో అల్యూమినియం ఫ్రేమ్, పిల్-షేప్ కెమెరా డిజైన్, AMOLED డిస్‌ప్లే ఉండొచ్చని తెలుస్తోంది.
Photo Credit: Lava
Lava Agni 4 will be sold in Lunar Mist and Phantom Black colour options
భారతదేశంలో నవంబర్ 20న లాంచ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న Lava Agni 4, గతంలో వచ్చిన Lava Agni 3 5G మోడల్‌కు తరువాతి వేరియంట్‌గా రానుంది. ఈసారి కంపెనీ ఫోన్ నిర్మాణంలో మార్పులు చేసింది, సాధారణంగా ఉపయోగించే ప్లాస్టిక్ బాడీకి బదులుగా అల్యూమినియం ఫ్రేమ్‌ను ఉపయోగిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది. అలాగే ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని, అలాగే కొత్తగా ఒక సైడ్ బటన్‌ను కూడా జోడించారని టీజర్ వీడియోల్లో కనిపిస్తోంది. ఆ బటన్ ఆపిల్ ఫోన్లలో ఉన్న కెమెరా కంట్రోల్ బటన్‌లాగా పనిచేయవచ్చని అంచనా. ఫోన్‌లో MediaTek చిప్‌సెట్ వాడబోతున్నట్లు ఇప్పటికే కంపెనీ సూచించింది. ఇప్పుడు కలర్ ఆప్షన్లు, అంచనా ధర, మరియు ప్రధాన ఫీచర్లు సంబంధించి కూడా కొత్త వివరాలు బయటపడ్డాయి. Xలో కంపెనీ షేర్ చేసిన పోస్ట్ ప్రకారం, Lava Agni 4 లూనార్ మిస్ట్, ఫాంటమ్ బ్లాక్ వంటి రెండు రంగుల్లో అందుబాటులోకి రానుంది. అలాగే అల్యూమినియం ఫ్రేమ్‌ను ఉపయోగిస్తున్నట్లు కూడా మరల ధృవీకరించారు. ఇందులో MediaTek Dimensity సిరీస్ ప్రాసెసర్ వచ్చే అవకాశం ఉంది. విడుదల చేసిన టీజర్‌లలో పవర్ బటన్, వాల్యూమ్ బటన్‌లు కుడి వైపు కనిపిస్తాయి. అలాగే మధ్య ఫ్రేమ్ దిగువ వైపున ఒక అదనపు బటన్ కూడా కనిపిస్తోంది, ఇది కెమెరా క్యాప్చర్ కోసం ఇచ్చిన ప్రత్యేక బటన్ కావచ్చని భావిస్తున్నారు.
టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ ఇచ్చిన సమాచారం ప్రకారం, Lava Agni 4 ధర భారత మార్కెట్లో రూ. 30,000 కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇందులో అల్యూమినియం ఫ్రేమ్, పిల్-షేప్ కెమెరా డిజైన్, AMOLED డిస్‌ప్లే ఉండొచ్చని తెలుస్తోంది. అదనంగా USB 3.1 స్టోరేజ్ సపోర్ట్, LPDDR5X RAM, మరియు AI ఆధారిత ఫీచర్లు కూడా ఉండవచ్చని లీక్‌లలో వెల్లడైంది. ఈ ఫోన్ “Zero Bloatware OS” అనుభవంతో వచ్చే అవకాశం ఉంది, అంటే ఎటువంటి అన్‌వాంటెడ్ యాప్స్ లేకుండా క్లీన‍్ సాఫ్ట్‌వేర్ అందించబడుతుంది. దీనికి అదనంగా ఫ్రీ హోం రీప్లేస్మెంట్ సర్వీస్ కూడా అందిస్తామని కంపెనీ హామీ ఇస్తోంది.
తాజా రిపోర్ట్లు తెలిపిన ప్రకారం, ఈ ఫోన్‌లో MediaTek Dimensity 8350 చిప్‌సెట్, 7,000mAh సామర్థ్యం గల బ్యాటరీ, మరియు 6.78 అంగుళాల Full HD+ 120Hz AMOLED డిస్‌ప్లే ఉండొచ్చని సమాచారం వస్తోంది.
ప్రకటన
ప్రకటన