డ్యూయల్ రియర్ కెమెరాతో రాబోయే Lava Blaze Dragon మోడల్‌కు సంబంధించిన డిజైన్‌తోపాటు కీలక స్పెసిఫకేషన్స్ తాజాగా లీక్ అయ్యాయి.
Photo Credit: Lava
లావా బ్లేజ్ డ్రాగన్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది
Lava Blaze Dragon పేరుతో ప్రముఖ భారతీయ స్మార్ట్ ఫోన్‌ల తయారీ సంస్థ Lava సరికొత్త 5G సూపర్ ఫీచర్స్‌తో యూజర్స్‌కు పరిచయం చేయనుంది. ఈ హ్యాండ్‌సెట్ జూలైన 25న మన దేశంలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తొంది. దీంతోపాటు Blaze AMOLED 2 మోడల్‌ను కూడా విడుదల చేయబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. డ్యూయల్ రియర్ కెమెరాతో రాబోయే Lava Blaze Dragon మోడల్‌కు సంబంధించిన డిజైన్‌తోపాటు కీలక స్పెసిఫకేషన్స్ తాజాగా లీక్ అయ్యాయి. వాటి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.AI సపోర్టెడ్ ప్రైమరీ రియర్ కెమెరా,కొత్త Blaze Dragon గోల్డెన్ కలర్ ఆప్షన్‌లో జూలై 25న మధ్యాహ్నం మన దేశీయ మార్కెట్‌లో రిలీజ్ చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ విషయాన్ని అమెజాన్ లైవ్‌లోని ఓ మైక్రోసైట్ ద్వారా స్పష్టం అయ్యింది. అలాగే, ఈ హ్యాండ్‌సెట్ అమెజాన్ ఈ కామర్స్ సైట్‌లో అమ్మకాలకు అందుబాటులో ఉంటుందిని కంపెనీ తెలిపింది. డ్యూయల్ కెమెరాతో కూడిన కర్వ్ షేప్‌లో కెమెరా మాడ్యూల్‌తో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అంతే కాదు, ఈ స్మార్ట్ ఫోన్‌కు 50 మెగాపిక్సెల్ AI సపోర్టెడ్ ప్రైమరీ రియర్ కెమెరాను అందించారు.
తాజాగా, ముఖుల్ శర్మ అనే ఓ టిప్‌స్టర్ Blaze Dragon కు సంబంధించిన పలు ఫీచర్స్ ఇమేజ్‌లను లీక్ చేశారు. టిప్‌స్టర్ టీక్ చేసిన ఫోటోల్లో బ్లాక్, రెయిన్ బో కలర్స్ రియర్ కెమెరా మడ్యూల్‌ను చూడొచ్చు. అలాగే, ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఇది 128GB UFS 3.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌కు మద్దతును అందిస్తుందని కూడా స్పష్టం చేశారు. దీంతోపాటు ఇది stock Android 15 తో రన్ అవుతుందని టిప్‌స్టర్ వెల్లడించారు.
అభిషేక్ యాదవ్ అనే మరో టిప్‌స్టర్ సోషల్ మీడియాలో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ Blaze Dragon స్మార్ట్ ఫోన్ 4GB+ 128GB, 6GB+ 128GB స్టోరేజ్ సామర్థ్యం కలిగిన రెండు కాన్ఫిగరేషన్‌లలో పరిచయం కానున్నట్లు వెల్లడించారు. అలాగే, సెల్ఫీల కోసం ప్రత్యేకంగా ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. ఈ విషయం అధికారికంగా ధృవీకరించబడలేదు.
రాబోయే Lava Blaze Dragon స్మార్ట్ ఫోన్ 5000mAh బ్యాటరీ సామర్థ్యంతో 18W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని మార్కెట్ వర్గాలు సైతం భావిస్తున్నాయి. అలాగే, దీని ధర రూ. 10000 కంటే తక్కువ ఉండే అవకాశాలు ఉన్నట్లు కూడా అంచనా వేస్తున్నారు. ఇదే నిజమైతే, ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న బడ్జెట్ ఫోన్‌లకు Blaze Dragon మోడల్ హ్యాండ్‌సెట్ గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాంటే మాత్రం జూలై 25 వరకూ వేచి చూడాల్సిందే.
ప్రకటన
ప్రకటన