ఈ మధ్య కాలంలో ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ Honor మనదేశంలో Honor Magic 6 Pro 5Gని పరిచయం చేసిన విషమం తెలిసిందే. ఈ హ్యాండ్‌సెట్ చైనాలో ఈ ఏడాది జనవరిలో బేస్ Honor Magic 6తో పాటుగా ఆవిష్కరించబడింది. ఇప్పుడు తాజాగా Honor Magic 7 సిరీస్‌ను మార్కెట్‌కు పరిచయం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సిరీస్ ఇప్పటికే ఉన్న సిరీస్ మాదిరిగానే బేస్ మరియు ప్రో వేరియంట్‌ను కలిగి ఉండనుంది. ఒక టిప్ స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఆధారంగా.. Honor Magic 7 Pro హ్యాండ్‌సెట్ రెండర్‌ను షేర్ చేశారు. లీక్ అయిన అంశాలను బట్టీ కొత్త సిరీస్ డిజైన్‌తోపాటు వెనుక కెమెరా మాడ్యూల్ వివరాలను అంచనా వేయవచ్చు.
లీక్ అయిన విషయాలను ఆధారంగా చేసుకుని Honor Magic 7 Pro యొక్క డిజైన్‌తోపాటు పలు ఫీచర్స్‌ను కూడా టిప్‌స్టర్ టెమ్ (@RODENT950) ద్వారా Xలో షేర్ చేశారు. ఆ ఫోటోలను బట్టీ పాలరాయిలా మెరుస్తున్న వెనుక ప్యానల్‌తో ఎంతో ఆకర్షణీయంగా ఫోన్ కనిపిస్తోంది. అలాగే, ప్యానల్ పైభాగంలో వెనుక కెమెరా మాడ్యూల్ LED ఫ్లాష్ యూనిట్‌తో పాటు మూడు సెన్సార్‌లతో అధిరిపోయేలా కనిపిస్తోంది. అంతేకాదు, వెనుక 180 లేదా 200 మెగాపిక్సెల్ శాంసంగ్ హెచ్‌పీ3 పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను ఈ Honor Magic 7 Proకు అనుసంధానం చేసినట్లు భావించవచ్చు. దీని ఆధారంగా ఈ కెమెరా సూపర్ జూమ్ క్వాలిటీతో రాబోతోందని అర్థమైపోతుంది.
అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా..
అలాగే, ఫోన్ ఎగువన ఎడమ భాగంలో కంపెనీ లిడార్ సెన్సార్, కలర్ టెంపరేచర్ సెన్సార్, ఎల్ఈడి ఫ్లాష్‌లను అమర్చినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా ఫోన్ ఆటోఫోకస్ నాణ్యతను మరింతగా మెరుగుపరిచే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ 1.5కే రిజల్యూషన్ డిస్‌ప్లేతో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉండనుంది. వీటితోపాటు ఈ Honor Magic 7 Pro ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ఓమ్నివిజన్ ఓవీ50కే మెయిన్ కెమెరాను జోడించడంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాను అందించడం అదనపు ఆకర్షణగా చెప్పొచ్చు.
Magic 6 Pro 5Gలో కెమెరా ఫీచర్స్ చూస్తే..
నిజానికి గతంలో విడుదలైన Honor Magic 6 Pro 5G ఫీచర్స్‌లలో కెమెరా విభాగం ప్రత్యేకమైనదని చెప్పాలి. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన 50 ఎంపీ కెమెరా, 50 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ సెన్సర్‌ను అందించారు. అంతేకాదు, 180 ఎంపీ పెరీస్కోపిక్ కెమెరా అమర్చడం ద్వారా ఇది 2.5 ఎక్స్ ఆప్టికల్ జూమ్, 100 ఎక్స్ డిజిటల్ జూమ్‌కు అవకాశం కల్పిస్తోంది. అలాగే, సెల్ఫీల కోసం ముందు వైపు 50 ఎంపీ కెమెరా అందించారు. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు, 66W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు Honor Magic 6 Pro మద్దతిస్తుంది. వీటితోపాటు వైఫై 7, 6, 5; బ్లూటూత్ 5.3, ఎన్‌ఎఫ్‌సీ వంటి అదనపు సదుపాయాలతో ఈ ఫోన్ 229 గ్రాముల బరువు ఉంటుంది.
టాండమ్ OLED డిస్‌ప్లేలను..
ఈ ఏడాది నవంబర్‌లో Honor Magic 7 సిరీస్ విడుదల కానుందని సమాచారం. ఈ హ్యాండ్‌సెట్‌లు Qualcomm యొక్క స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 చిప్‌సెట్ ప్రాసెసర్ ద్వారా పనిచేస్తాయి. అలాగే, 6,000mAh+ బ్యారటరీ సామర్థ్యంతో రూపొందించబడుతున్నాయి. ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్లతో పాటు టాండమ్ OLED డిస్‌ప్లేలను కూడా కలిగి ఉండవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. Honor Magic 7 సిరీస్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం నవంబర్ వరకూ వేచి చూడాల్సిందే!