5,000mAh బ్యాటరీతో లాంచ్ అవుతోన్న Infinix Hot 50i ధరతోపాటు స్పెసిఫికేష‌న్స్‌

Infinix Hot 50i స్మార్ట్‌ఫోన్‌ 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో హోల్ పంచ్ డిస్‌ప్లేని క‌లిగి ఉంటుంది. 5,000mAh బ్యాటరీ సామ‌ర్థ్యంతో 48-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ క‌లిగిన‌ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో వ‌స్తోంది

5,000mAh బ్యాటరీతో లాంచ్ అవుతోన్న Infinix Hot 50i ధరతోపాటు స్పెసిఫికేష‌న్స్‌

Photo Credit: Infinix

Infinix Hot 50i runs on Android 14-based XOS 14.5

ముఖ్యాంశాలు
  • Infinix Hot 50i సేజ్ గ్రీన్, స్లీక్ బ్లాక్, టైటానియం గ్రే షేడ్స్‌లో లభిస్
  • Infinix Hot 50i డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది
  • ఈ హ్యాండ్‌సెట్‌ IP54-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంది
ప్రకటన

గ్లోబ‌ల్ మార్కెట్‌లో ఎంపిక చేసిన కొన్ని చోట్ల‌ Infinix Hot 40iకి కొన‌సాగింపుగా వ‌స్తున్న Infinix Hot 50i లాంచ్ కాబోతోంది. చైనా ట్రాన్స్‌షన్ హోల్డింగ్స్ యాజమాన్యంలోని బ్రాండ్ ద్వారా కొత్త Hot సిరీస్ ఫోన్‌లో MediaTek Helio G81 ప్రాసెస‌ర్‌తోపాటు గరిష్టంగా 6GB RAM ఉంటుంది. Infinix Hot 50i స్మార్ట్‌ఫోన్‌ 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో హోల్ పంచ్ డిస్‌ప్లేని క‌లిగి ఉంటుంది. 5,000mAh బ్యాటరీ సామ‌ర్థ్యంతో 48-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ క‌లిగిన‌ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో అందుబాటులోకి రానుంది. నీరు, ధూళిని నిరోధించేందుకు IP54 రేటింగ్‌ను కలిగి ఉంటుంది.

ఆన్ సపోర్ట్, డైనమిక్ బార్ ఫీచర్‌..

ప్రస్తుతం నైజీరియాలోని ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో Infinix Hot 50i హ్యాండ్‌సెట్‌ 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ కోసం KES 14,000 (దాదాపు రూ. 9,000) ధరతో అందుబాటులో ఉంది. ఇది సేజ్ గ్రీన్, స్లీక్ బ్లాక్, టైటానియం గ్రే క‌ల‌ర్ ఆప్ష‌న్స్‌తో ల‌భిస్తోంది. ఈ మోడ‌ల్‌ డ్యూయల్ సిమ్ (నానో)తో Android 14-ఆధారిత XOS 14.5పై ర‌న్ అవుతోంది. 6.7-అంగుళాల HD+ (720x1,600 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను గరిష్టంగా 120Hz రిఫ్రెష్ రేట్, 500 nits గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లేలో సెల్ఫీ షూటర్ కోసం హోల్ పంచ్ కటౌట్‌ను అందించారు. ఎల్లప్పుడూ ఆన్ సపోర్ట్, డైనమిక్ బార్ ఫీచర్‌ని కలిగి ఉంటుంది.

ఆన్‌బోర్డ్ స్టోరేజీని 2TB వరకు..

Infinix Hot 50i మోడ‌ల్‌ MediaTek Helio G81 ప్రాసెస‌ర్‌ను కలిగి ఉంది. దీంతోపాట 6GB LPDDR4X RAM, 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజీని అందించారు. అంతేకాదు, Infinix Memfusion RAM ఫీచర్‌తో, అదనపు ఉపయోగించని స్టోరేజీ కోసం ఆన్‌బోర్డ్ మెమరీని 16GB వరకు పెంచుకునే అవ‌కాశాన్ని క‌ల్పించారు. అలాగే, మైక్రో SD కార్డ్‌ని ఉపయోగించి ఆన్‌బోర్డ్ స్టోరేజీని 2TB వరకు విస్తరించుకోవ‌చ్చు.

ఆక‌ట్టుకునేలా క‌నెక్టివిటీ ఫీచ‌ర్స్‌..

ఇక కెమెరా విష‌యాని వ‌స్తే.. Infinix Hot 50i డ్యూయల్ ఫ్లాష్‌తో కూడిన 48-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో ప‌నిచేసే డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను క‌లిగి ఉంటుంది. అలాగే, సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. Infinix Hot 50iలో కనెక్టివిటీ ఫీచ‌ర్స్ కూడా ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. బ్లూటూత్, FM రేడియో, 3.5mm ఆడియో జాక్, OTG, USB టైప్-C పోర్ట్, Wi-Fi 802.11 a/b/g/n/ac ఉన్నాయి.

18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు స‌పోర్ట్ ..

ఇది ఈ-కంపాస్, జి-సెన్సార్, గైరోస్కోప్, లైట్ సెన్సార్ వంటి ఫీచ‌ర్స్‌తో వ‌స్తోంది. భ‌ద్ర‌త కోసం ప్ర‌త్యేకంగా.. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇది దుమ్ము, నీటిని నిరోధక‌రించేందుకు IP54-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంది. Infinix 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు స‌పోర్ట్ చేస్తుంది. 5,000mAh బ్యాటరీ సామ‌ర్థ్యంతో అందుబాటులోకి వ‌స్తోంది. ఇది డ్యూయల్ స్పీకర్లతో 165.7x77.1x8.1mm ప‌రిమాణం, 184 గ్రాముల బరువు ఉంటుంది.

Comments

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. సరికొత్త Apple స్మార్ట్ వాచ్‌లు వచ్చేశాయ్, ఆరోగ్య లక్షణాలు చెప్పే సెన్సార్లు, 19 నుంచి సేల్స్ ప్రారంభం
  2. కళ్లు చెదిరే మోడల్స్, ధరతో ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్
  3. iPhone Air పూర్తిగా eSIM-only మోడల్‌గా వస్తుంది
  4. iPhone 17 లో డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది
  5. నేపథ్యంలో రాబోయే iPhone 17 సిరీస్పై వరుసగా లీకులు వెలుగులోకి వస్తున్నాయి
  6. iPhone 17 Pro మోడళ్ల రూపకల్పనలో కూడా కీలక మార్పులు జరగనున్నాయి
  7. ఈ ఈవెంట్‌లో ఐఫోన్ 17 లైనప్‌లో నాలుగు కొత్త మోడల్స్ ప్రకటించబడతాయని అంచనా
  8. మార్కెట్‌లోకి సరికొత్త Apple స్మార్ట్ వాచ్‌లు, కళ్లు చెదిరే ఫీచర్లు
  9. ఐఫోన్ 17 సిరీస్ రెడీ టు లాంఛ్.. ఏ ఏ మోడల్స్ వస్తున్నాయంటే?
  10. దయచేసి మీ ఫోన్లను రీస్టార్ట్‌ చేయండి అని ఎయిర్‌టెల్ వినియోగదారులకు సూచించింది
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »