Photo Credit: Moto
గత కొన్ని వారాలుగా Moto G15 హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన పలు రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే, Motorola కంపెనీ ఈ కొత్త Moto G సిరీస్ ఫోన్‌కు చెందిన ఎలాంటి ఆప్‌డేట్ ఇవ్వనప్పటికీ, దీని పూర్తి స్పెసిఫికేషన్స్ ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. రానున్న Moto G15 స్మార్ట్ ఫోన్ 6.72-అంగుళాల డిస్‌ప్లేని కలిగి ఉంటోంది. అలాగే, ఇది MediaTek Helio G81 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్‌తో రన్నవుతోంది. ఈ ఫోన్ డ్యూయల్ వెనుక కెమెరాల, 5,200mAh బ్యాటరీ సామర్థ్యంతో వచ్చే అవకాశం ఉందిని అంచనా. అంతేకాదు, గత సంవత్సరం పరిచయమైన Moto G14 ఫోన్‌కి Moto G15 హ్యాండ్‌సెట్ కొనసాగింపుగా రానుంది.
ప్రముఖ టిప్‌స్టర్ సుధాన్షు ఆంబోర్ (@Sudhanshu1414)తోపాటు పలువురు వెల్లడించిన వివరాలను బట్టీ, రాబోయే Moto G15 హ్యాండ్‌సెట్‌కు చెందిన స్పెసిఫికేషన్‌లు బహిర్గతమయ్యాయి. ఈ ఫోన్ 60Hz రిఫ్రెష్ రేట్, 391ppi పిక్సెల్ డిస్నిటీ, 86.71 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో వస్తోంది. అలాగే, 20:9 స్క్రీన్‌తో 6.72-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,400 పిక్సెల్‌లు) IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉన్నట్లు వెల్లడించారు. ఈ స్క్రీన్ HDR10కి సపోర్ట్ ఇవ్వడంతోపాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటక్షన్‌తో వస్తుంది.
సరికొత్త Moto G15 స్మార్ట్ ఫోన్ Mali-G52 MC2 GPUతో వస్తూ.. MediaTek Helio G81 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్‌తో రన్ అవుతుందని వెల్లడైంది. అలాగే, ప్రాసెసర్‌ను 8GB LPDDR4x RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజీతో అటాచ్ చేసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది డ్యూయల్ సిమ్ ఫోన్ కాగా, ఆండ్రాయిడ్ 15తో రన్ చేయబడుతుందని భావిస్తున్నారు.
ఇక కెమెరా విషయానికి వస్తే.. Moto G15 ఫోన్ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో f/1.8 ఎపర్చరు, 5-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌తో f/2.4 ఎపర్చరుతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో రూపొందించారు. అలాగే, ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ కెమెరా ఉండే అవకాశం ఉంది. ఈ Moto G15 ఫోన్‌లో డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.4, USB టైప్-C పోర్ట్, 3.5mm ఆడియో జాక్, NFC వంటివి ఉండే అవకాశం ఉంది. అంతేకాదు, ఇందులో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్‌లు ఉన్నాయి.
అలాగే, Moto G15 స్మార్ట్ ఫోన్ సెక్యూరిటీ కోసం ఇన్‌సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో స్టీరియో స్పీకర్‌లను అందిస్తున్నారు. స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం IP54 రేటింగ్‌ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,200mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇది 165.7x 76x8.17mm పరిమాణంతో 190 గ్రాముల బరువు ఉంటుంది. అయితే, ఈ మోడల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రకటన
ప్రకటన