Photo Credit: x/@evleaks
మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల pOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని అంచనా.
తాజాగా, Motorola Edge 60 Stylus మోడల్‌ను భారత్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, లెనోవా యాజమాన్యంలోని ఈ బ్రాండ్ రాబోయే మోడల్ గురించి ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ, ఫోన్ లాంఛ్ తేదీతోపాటు కీలక స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. అధికారికంగా Motorola Edge 60 Stylus వచ్చే వారం మన దేశంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. దీని పేరులో సూచించినట్లు, ఫోన్‌లో ఇన్-బిల్ట్ స్టైలస్ ఉండొచ్చని అంచనా. అలాగే, ఇది స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్‌తో రన్ అవుతుందని, 5,000mAh బ్యాటరీతో వస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ స్టైలస్ వేరియంట్ మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్, ఎడ్జ్ 60 ప్రో, ఎడ్జ్ 60 జాబితాలో చేసే అవకాశం ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ ఏప్రిల్ 17న ఇండియాలో లాంఛ్ అవుతుందని, అభిషేక్ యాదవ్ (@yabhishekhd) అనే టిప్‌స్టర్ X వేదికగా వెల్లడించారు. అలాగే, ఈ Edge 60 Stylus ఆండ్రాయిడ్ 15 పై రన్ అవుతుందని, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల pOLED డిస్‌ప్లేను కలిగి ఉండొచ్చని అంచనా. అంతే కాదు, స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్‌తో ఈ మోడల్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా భావిస్తున్నారు.
రాబోయే స్మార్ట్ పోన్ కెమెరా విషయానికి వస్తే, 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 13-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ Edge 60 Stylus లో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అలాగే, దీనికి 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ Motorola ఫోన్‌లో 68W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని అందించవచ్చని భావిస్తున్నారు.
కొత్త Edge 60 Stylus స్మార్ట్ ఫోన్ మిడ్ - రేంజ్ హ్యాండ్‌సెట్‌గా రానున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే, గతంలో వచ్చిన లీక్‌లను బట్టీ చూస్తే.. దీని ధర EUR 500 (దాదాపు రూ. 43,600)గా ఉంటుందని అంచనా. అలాగే, లీక్ అయిన ఫోన్ రెండర్ ప్రకారం, దీని దిగువ కుడి మూలలో ఒక బంప్ కనిపిస్తుంది. ఇది ఇన్‌బిల్ట్ స్టైలస్‌ను సూచిస్తోందని చెబుతున్నారు. కంపెనీ నుంచి మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.
మన దేశంలో కంపెనీ ఇటీవల Motorola Edge 60 Fusion ను ప్రకటించింది. ఈ మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌తో వస్తోంది. అలాగే, 8GB RAM + 256GB స్టోరేజ్ ఆప్షన్ ధర రూ. 22,999గా ఉంది. అంతే కాదు, మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్, ఎడ్జ్ 60 ప్రో, మోటరోలా ఎడ్జ్ 60 మోడల్స్‌కు చెందిన అధికారిక లాంఛ్ తేదీని కంపెనీ త్వరలో ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రకటన
ప్రకటన