Photo Credit: Nubia
ZTE అనుబంధ సంస్థ నుండి వచ్చిన V-సిరీస్ స్మార్ట్ ఫోన్‌లను మరింతగా వినియోగదారులకు చేరువ చేసేందుకు సన్నద్ధమైంది. ఈ క్రమంలో Nubia V70 డిజైన్ మోడల్‌ను V-సిరీస్ నుంచి పరిచయం చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ 6.7-అంగుళాల LCD స్క్రీన్‌తో సరికొత్తగా అందుబాటులోకి రానుంది. అలాగే, Apple డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌ను పోలి ఉండే లైవ్ ఐలాండ్ 2.0 ఫీచర్‌ను దీనిలో అందించారు. Nubia V70 డిజైన్ 4GB RAM, 256GB స్టోరేజీతో రూపొందించారు. ఈ ఫోన్ 22.5W వద్ద ఛార్జ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అమర్చారు. అలాగే, కంపెనీ వెల్లడించినదాని ప్రకారం.. MyOS 14 స్కిన్‌తో ఆండ్రాయిడ్ 14లో ఇది రన్ అవుతుంది.
ఫిలిప్పీన్స్‌లో మొబైల్ మార్కెట్‌లో Nubia V70 డిజైన్ ధర PHP 5,299 (దాదాపు రూ. 7,600)గా నిర్ణయించారు. ఈ స్మార్ట్ ఫోన్ సిట్రస్ ఆరెంజ్, జాడే గ్రీన్, రోజ్ పింక్, స్టోన్ గ్రే కలర్ ఆప్షన్‌లలో ప్రీ-ఆర్డర్ చేసేందుకు కంపెనీ అందుబాటులో ఉంచింది. అలాగే, ఇది నవంబర్ 28న లజాడా, షాపీతోపాటు ఇతర రిటైల్ ఛానెల్‌ల ద్వారా ఫిలిప్పీన్స్‌లో అమ్మకాలకు అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. అంతేకాదు, ఈ హ్యాండ్‌సెట్ గ్లోబల్ మార్కెట్ లాంచ్‌కు సంబంధించిన ఎలాంటి వివరాలను ఇంకా బహిర్గతం చేయలేదు. త్వరలోనే ఈ మోడల్‌ను గ్లోబల్ మార్కెట్‌కు పరిచయం చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Nubia V70 డిజైన్ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ నానో-సిమ్‌తో Android 14-ఆధారిత MyOS 14పై రన్ అవుతుంది. అలాగే, 6.7-అంగుళాల IPS LCD స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తోంది. అలాగే, ఈ ఫోన్ 12nm ఆక్టా కోర్ Unisoc T606 ప్రాసెసర్‌తో పాటు 4GB RAMను అటాచ్ చేయబడి ఉంది. అంతేకాదు, Nubia V70 డిజైన్‌లో 256GB ఇన్‌బిల్ట్ స్టోరేజీ ఫీచర్‌ను పొందవచ్చు. కనెక్టివిటీ విషయంలో ఈ మోడల్ మంచి ఆప్షన్స్‌ను అందించింది. ఇందులో 4G, Wi-Fi, బ్లూటూత్, GPS, USB టైప్-C పోర్ట్ వంటివి ఉన్నాయి. ఈ బడ్జెట్‌లో లాంచ్ అవుతున్న మోడల్స్‌కు Nubia V70 హ్యాండ్‌సెట్ మంచి పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక కెమెరా విషయానికి వస్తే.. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను అమర్చారు. అయితే, ఇందులో రెండవ, మూడవ కెమెరాలకు సంబంధించిన ఎటువంటి సమాచారాన్ని కూడా కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అలాగే, ఫోన్ ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ప్రత్యేకంగా 16-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 22.5W వద్ద ఛార్జ్ చేయగల 5,000mAh బ్యాటరీని అందించారు. నోటిఫికేషన్‌ల కోసం లైవ్ ఐలాండ్ 2.0 ఫీచర్‌ను కూడా పరిచయం చేశారు. ఇన్ని సరికొత్త ఫీచర్స్ ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ తొందరలోనే ఇండియన్ మార్కెట్‌లోకి రావాలని కోరుకుందాం
ప్రకటన
ప్రకటన