Photo Credit: OnePlus
గత ఏడాది విడుదలైన OnePlus 12కి కొనసాగింపుగా OnePlus 13 ఈ నెలాఖరులో చైనాలో లాంచ్ అవుతున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో కొన్ని నెలలుగా నెట్టింట చక్కర్లు కొడుతోన్న వార్తలకు తెరపడింది. ఈ కంపెనీ ఈ హ్యాండ్‌సెట్ లాంచ్ తేదీతోపాటు డిజైన్, కలర్‌లను వెల్లడించింది. చైనాలో లాంచ్‌కు ముందు జరిగిన ఓ ఈ-స్పోర్ట్స్ ఈవెంట్‌లో OnePlus 13 మోడల్ సందడి చేసింది. ఈ హ్యాండ్‌సెట్ BOE X2 డిస్‌ప్లేతో లోకర్ రిఫ్రెష్ రేట్ ఫీచర్‌ను కలిగి ఉంటుందని నిర్ధారించబడింది. ఈ మోడల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
OnePlus తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో అక్టోబర్ 31న స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు లాంచ్ చేయబడుతుందని స్పష్టం చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌ను అప్‌గ్రేడ్ చేసిన సిస్టమ్ ఎక్స్‌పీరియన్స్, గేమ్ పర్ఫామెన్స్, స్క్రీన్ డిస్‌ప్లే, ఐ ప్రొటెక్షన్, బ్యాటరీ లైఫ్, ఛార్జింగ్, ఇమేజింగ్ సామర్థ్యాలతో రూపొందించారు. ఇది నీలం, నలుపు, తెలుపు మూడు రంగులలో వస్తుందని స్పష్టమైంది. వీటిలో వైట్ డాన్ వెర్షన్ సిల్క్ గ్లాస్ టెక్నాలజీతో రూపొందించారు. అలాగే, బ్లూ మూమెంట్ అనేది బేబీ స్కిన్ రూరంలో రావడంతోపాటు ఎంతో స్మూత్‌గా ఉంటుంది. అబ్సిడియన్ సీక్రెట్ ఎబోనీ వుడ్ గ్రెయిన్ గ్లాస్ ఫినిషింగ్‌తో ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
ఈ సరికొత్త OnePlus 13 కెమెరా మాడ్యూల్ కొద్దిగా ట్వీక్ చేయడం ద్వారా మిగిలిన ఫ్రేమ్ నుండి వేరు చేయబడినట్లు కనిపిస్తుంది. Hasselblad బ్రాండింగ్ కెమెరా యూనిట్ కూడా ఆకర్షణీయమైన డిజైన్‌లో కనిపిస్తోంది. ఇది మెటల్ స్ట్రిప్ పైన కుడివైపున అమర్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. మిగిలిన డిజైన్ మొత్తం గతంలో విడుదలైన వాటి మాదిరిగానే కనిపిస్తుంది. చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Weiboలోని చాలా పోస్ట్‌లలో.. అక్టోబర్ 31న అధికారికంగా అరంగేట్రం చేయడానికి ముందు చైనాలో జరిగిన పీస్‌కీపర్ ఎలైట్ 2024 ఈవెంట్‌లో ఈ-స్పోర్ట్స్ ప్లేయర్‌ల చేతిలో OnePlus 13ని గుర్తించినట్లు వినియోగదారులు చెబుతున్నారు.
OnePlus 13 ఫోన్ 6.82-అంగుళాల 2K 10-బిట్ LTPO BOE X2 మైక్రో క్వాడ్ కర్వ్డ్ OLED స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. అలాగే, ఇది న్యూ లోకల్ రిఫ్రెష్ రేట్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ఇది గరిష్టంగా 24GB RAM, 1TB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో అటాచ్ చేయబడింది. ఐఫోన్ 16 ప్రో A18 ప్రో ప్రాసెసర్ కంటే ఈ ప్రాసెసర్ మరింత మెరుగ్గా పనిచేస్తుందని కొన్ని బెంచ్‌మార్క్ సర్టిఫికేట్స్ దృవీకరిస్తున్నాయి. ఇక కెమెరా విషయానికి వస్తే.. ఇది 50-మెగాపిక్సెల్ Sony LYT-808 ప్రైమరీ సెన్సార్, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ యూనిట్, 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రకటన
ప్రకటన