ఐఫోన్ 17e వచ్చేసింది.. మ్యాగ్‌సేఫ్ ఛార్జింగ్, డబుల్ స్టోరేజ్.. పింక్ కలర్‌లో కేక..!

యాపిల్ ఐఫోన్ 17eని లాంచ్ చేసింది. మార్చి 4వ తేదీ బుధవారం ఉదయం నుండే ప్రీ-ఆర్డర్లు మొదలవుతాయి.మార్చి 11వ తేదీ నుండి ఫోన్ డెలివరీ అవుతుంది.

ఐఫోన్ 17e వచ్చేసింది.. మ్యాగ్‌సేఫ్ ఛార్జింగ్, డబుల్ స్టోరేజ్.. పింక్ కలర్‌లో కేక..!
ముఖ్యాంశాలు
  • మ్యాగ్‌సేఫ్ సపోర్ట్‌తో ఐఫోన్ 17e రిలీజ్
  • మ్యాగ్‌సేఫ్ సపోర్ట్‌తో ఐఫోన్ 17e రిలీజ్
  • మ్యాగ్‌సేఫ్ సపోర్ట్‌తో ఐఫోన్ 17e రిలీజ్
ప్రకటన

బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్స్ కోరుకునే వారికి యాపిల్ ఒక అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. గతేడాది వచ్చిన ఐఫోన్ 16e సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు, అయితే సరిగ్గా ఏడాది తిరగకముందే మరింత పవర్‌ఫుల్ అప్‌డేట్స్‌తో 'ఐఫోన్ 17e'ని రంగంలోకి దించింది. గతంలో ఐఫోన్ SE మోడల్స్ కోసం ఏళ్ల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు యాపిల్ తన స్ట్రాటజీని మార్చి ప్రతి సంవత్సరం కొత్త 'e' సిరీస్ మోడల్‌ను లాంచ్ చేస్తూ టెక్ ప్రియులను ఖుషీ చేస్తోంది. ఈసారి కేవలం పెర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, యూజర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్టోరేజ్,  ఛార్జింగ్ టెక్నాలజీలో కూడా భారీ మార్పులు చేసింది.

ఈ కొత్త ఐఫోన్ 17eలో హైలైట్ ఏంటంటే, ఇందులో మెగ్‌సేఫ్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను తీసుకురావడం. 16e మోడల్‌లో కేవలం బేసిక్ వైర్‌లెస్ ఛార్జింగ్ మాత్రమే ఉండేది, దీనివల్ల మ్యాగ్నెటిక్ యాక్సెసరీస్ వాడటం కుదిరేది కాదు. ఇప్పుడు మెగ్‌సేఫ్ రాకతో వాలెట్స్, స్టాండ్స్, బ్యాటరీ ప్యాక్స్‌ను ఫోన్ వెనుక సింపుల్‌గా స్నాప్ చేసుకోవచ్చు. వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా గతంలో కంటే వేగంగా, కచ్చితత్వంతో జరుగుతుంది. డిజైన్ పరంగా క్లాసిక్ బ్లాక్,  వైట్ కలర్స్‌తో పాటు, ఈసారి యువతను ఆకట్టుకునేలా ఒక సరికొత్త 'సాఫ్ట్ పింక్' కలర్‌ను యాపిల్ ఇంట్రడ్యూస్ చేసింది.

ఫోన్ లోపలి విషయానికి వస్తే, ఐఫోన్ 17 బేస్ మోడల్‌లో వాడే పవర్‌ఫుల్ A19 చిప్‌నే ఇందులో కూడా అమర్చారు. అంటే తక్కువ ధరలో ఫ్లాగ్‌షిప్ లెవల్ స్పీడ్‌ను మీరు ఎంజాయ్ చేయొచ్చు. దీనికి తోడు ఆపిల్ సొంతంగా తయారు చేసిన C1X సెల్యులార్ మోడెమ్‌ను ఇందులో జోడించారు. ఇది గతంలోని C1 మోడెమ్ కంటే దాదాపు రెండు రెట్లు వేగవంతమైన డేటా స్పీడ్‌ను అందిస్తుంది. కెమెరా సెక్షన్ కూడా అదరగొట్టేలా ఉంది, ఇందులో 48MP ఫ్యూజన్ కెమెరాను ఇచ్చారు. ఇది 4K డాల్బీ విజన్ వీడియోలతో పాటు, ఆప్టికల్ క్వాలిటీతో కూడిన 2x టెలిఫోటో జూమ్ సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది.

ధర విషయంలో యాపిల్ ఈసారి చాలా ఉదారంగా వ్యవహరించింది. ఐఫోన్ 16e లాగానే దీని ప్రారంభ ధర కూడా $599 వద్దే ఉంది, కానీ ఇక్కడే ఒక మలుపు ఉంది. గతంలో $599కి 128GB స్టోరేజ్ వచ్చేది, కానీ ఇప్పుడు అదే ధరకు ఏకంగా 256GB స్టోరేజ్‌ను యాపిల్ అందిస్తోంది. అంటే మీరు చెల్లించే ప్రతి రూపాయికి రెట్టింపు స్టోరేజ్ లభిస్తోంది. ఇక ఎక్కువ స్పేస్ కావాలనుకునే వారి కోసం 512GB వేరియంట్‌ను $799 కే అందుబాటులోకి తెచ్చారు. ఇది పాత మోడల్ ధర కంటే $100 తక్కువ కావడం విశేషం, దీనివల్ల కస్టమర్లకు ఇది ఒక క్రేజీ డీల్‌గా మారనుంది.

భారతీయ కరెన్సీ లెక్కల్లో చూసుకుంటే, ప్రస్తుతం డాలర్ రేటు ప్రకారం దీని ధరలు సుమారుగా ఇలా ఉండే అవకాశం ఉంది. 256GB బేస్ మోడల్ ధర దాదాపు రూ.49,990 నుండి మొదలయ్యే అవకాశం ఉండగా, 512GB హై-ఎండ్ వేరియంట్ ధర సుమారుగా రూ.66,500 వరకు ఉండొచ్చు. అయితే టాక్సులు, ఇంపోర్ట్ డ్యూటీల వల్ల ఇండియాలో ఈ ధరలు కొంచెం అటు ఇటుగా మారే ఛాన్స్ ఉంది. బడ్జెట్ సెగ్మెంట్లో ఐఫోన్ వాడాలనుకునే వారికి ఈ ధరలు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డబుల్ స్టోరేజ్ ఇవ్వడం అనేది ఇండియా లాంటి మార్కెట్‌లో పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది.

మీరు కూడా ఈ కొత్త ఐఫోన్‌ను సొంతం చేసుకోవాలనుకుంటే, మార్చి 4వ తేదీ బుధవారం ఉదయం నుండే ప్రీ-ఆర్డర్లు మొదలవుతాయి. ఆర్డర్ చేసుకున్న వారికి మార్చి 11వ తేదీ నుండి ఫోన్ డెలివరీ అవుతుంది. అదే రోజు నుండి స్టోర్లలో కూడా లభిస్తుంది. ఏటా కొత్త మోడల్‌ను రిలీజ్ చేస్తూ, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లను బడ్జెట్ ధరలో అందిస్తున్న యాపిల్ నిర్ణయం చూస్తుంటే, ఇతర స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లకు గట్టి పోటీ తప్పేలా లేదు. హై-స్పీడ్ ఇంటర్నెట్, అదిరిపోయే కెమెరా, మెగ్‌సేఫ్ టెక్నాలజీతో ఐఫోన్ 17e నిజంగానే ఈ జనరేషన్ గ్యాడ్జెట్ లవర్స్‌కి పర్ఫెక్ట్ ఛాయిస్.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. M4 చిప్‌తో దూసుకొచ్చిన కొత్త ఐప్యాడ్ ఎయిర్.. ఫీచర్లు అదరహో..!
  2. బెజెల్స్ మాయం.. కెమెరా అమోఘం.. వన్ ప్లస్ 15T ఫీచర్స్ ఇవే..!
  3. ఐఫోన్ 17e వచ్చేసింది.. మ్యాగ్‌సేఫ్ ఛార్జింగ్, డబుల్ స్టోరేజ్.. పింక్ కలర్‌లో కేక..!
  4. ఐఫోన్ 17e అదిరిపోయే ఎంట్రీ: రూ. 64,900కే 256GB స్టోరేజ్.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
  5. స్నాప్‌డ్రాగన్ వేర్ ఎలైట్.. వేరబుల్ టెక్నాలజీలో సరికొత్త AI విప్లవం..!
  6. నథింగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త లుక్‌లో ‘నథింగ్ ఫోన్ 4a’.. ధర, స్పెసిఫికేషన్ల లీక్!
  7. తక్కువ ధరలో 'ప్రీమియం' లుక్.. టెక్నో పాప్ X లాంచ్ డేట్ ఫిక్స్..!
  8. టాటా గ్రూపుతో ఓపెన్ ఏఐ.. ముంబై, బెంగళూరులో డేటా సెంటర్లు
  9. దీని ద్వారా విద్యార్థులు పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను సాధించే అవకాశం పొందుతారు.
  10. Group Message History ఫీచర్ గ్లోబల్ స్థాయిలో విడుదల ప్రక్రియ ప్రారంభమైంది.
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »