Photo Credit: OnePlus
ఈ ఏడాది అక్టోబర్‌లో OnePlus 13 ఫోన్ చైనాలో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, హాసెల్‌బ్లాడ్-బ్యాక్డ్ 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌తో పరిచయం అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ హ్యాండ్‌సెట్ 2025 జనవరిలో భారత్‌తో సహా చైనా వెలుపలి గ్లోబల్ మొబైల్ మార్కెట్లలో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. అయితే, ఖచ్చితమైన లాంచ్ తేదీని ఇంకా వెల్లడించలేదు. ఇండియాతోపాటు గ్లోబల్‌గా లాంచ్ కాబోతున్న ఈ స్మార్ట్ ఫోన్ వేరియంట్‌లు చైనీస్ కౌంటర్‌పార్ట్‌ను పోలి ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
OnePlus 13 స్మార్ట్‌ఫోన్ భారత్‌లో OnePlus ఇండియా వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్ ద్వారా కొనుగోలు చేసుకునేందుకు అందుబాటులో ఉంచనున్నట్లు స్పెషల్ మైక్రోసైట్‌లోని ఈ-కామర్స్ సైట్ స్పష్టం చేసింది. అలాగే, ఆండ్రాయిడ్ 15-ఆధారిత ఆక్సిజన్‌ఓఎస్ 15తో రన్ అవుతుందని మైక్రోసైట్ తెలిపింది. ఈ హ్యాండ్‌సెట్‌లో AI-బ్యాక్డ్ ఇమేజింగ్, నోట్-టేకింగ్ ఫీచర్లను అందించారు. తద్వారా ఇండియన్ వేరియంట్ మొబైల్ చైనీస్ వెర్షన్‌ను పోలి ఉండే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే చైనా మార్కెట్లో మంచి సేల్ టాక్ వచ్చినట్లు తెలుస్తోంది.
అక్టోబర్‌లో చైనాలో విడుదలైన OnePlus 13 ఫోన్ 6.82-అంగుళాల Quad-HD+ LTPO AMOLED స్క్రీన్‌తో 120Hz వరకు రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ సపోర్ట్‌తో పరిచయం అయింది. ఇది 24GB వరకు LPDDR5X RAM, 1TB వరకు UFS 4.0 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో అటాచ్ చేసిన Snapdragon 8 Elite ప్రాసెసర్‌తో వచ్చింది. అలాగే, Android 15-ఆధారిత ColorOS 15పై రన్ అవుతోంది. ఇది దుమ్ము, నీటి నియంత్రణ కోసం IP68+69-రేటెడ్ బిల్డ్‌తో వస్తోంది. ఈ అంశాలు అధికారికంగా వెల్లడి కావడంతో OnePlus 13 ఫోన్ మొబైల్ మార్కెట్‌లో ఇతర మోడల్స్‌కు మంచి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
OnePlus 13 కెమెరా విషయానికి వస్తే.. OISతో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, అల్ట్రావైడ్ లెన్స్‌తో 50-మెగాపిక్సెల్ సెన్సార్, వెనుకవైపు 3x ఆప్టికల్ జూమ్‌తో 50-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో షూటర్‌ను అందించారు. ఈ ఫోన్ 32-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌తో వస్తుంది. అలాగే, 100W వైర్డ్, 50W వైర్‌లెస్, 5W రివర్స్ వైర్డ్, 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 6000mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీని అందిస్తున్నారు. అలాగే, సెక్యూరిటీ కోసం ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అమర్చారు.
ప్రకటన
ప్రకటన