గతంలో విడుదలైన వన్‌ప్లస్ 13 చైనా మార్కెట్‌లో బ్లూ, ఆబ్సిడియన్, వైట్ రంగుల్లో అందుబాటులో ఉండగా.
Photo Credit: Apple
వన్‌ప్లస్ 15లో సెంటర్ హోల్‌పంచ్ కెమెరాతో వంకర OLED డిస్‌ప్లే ఉంది
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 15 ను అక్టోబర్ 27న ఆవిష్కరించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గత ఏడాది విడుదలైన వన్‌ప్లస్ 13 కు ఇది కంటిన్యూషన్గా రానుంది. కంపెనీ ఇప్పటికే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పలు టీజర్లు విడుదల చేస్తూ అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని కలిగించింది. తాజా పోస్టర్లలో ఫోన్‌కి సంబంధించిన రంగుల ఎంపికలను కూడా వెల్లడించింది. ఈ ఫోన్ మూడు అబ్సల్యూట్ బ్లాక్ , మిస్ట్ పర్పుల్ మరియు ఒరిజినల్ సాండ్ డ్యూన్ వంటి మూడు అందమైన షేడ్స్‌లో అందుబాటులోకి రానుంది.
గతంలో విడుదలైన వన్‌ప్లస్ 13 చైనా మార్కెట్‌లో బ్లూ, ఆబ్సిడియన్, వైట్ రంగుల్లో అందుబాటులో ఉండగా, భారతీయ మార్కెట్‌లో ఆర్కిటిక్ డాన్, బ్లాక్ ఎక్లిప్స్, మిడ్‌నైట్ ఓషన్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. కొత్త వన్‌ప్లస్ 15 మాత్రం మరింత నాజూకు ఫినిష్‌తో, ఆధునిక డిజైన్ భాషలో రూపుదిద్దుకుంది.
అధికారిక చిత్రాల ప్రకారం, వన్‌ప్లస్ 15 లో సెంటర్‌లో హోల్ పంచ్ కెమెరా కట్‌అవుట్ మరియు స్వల్పంగా వంకరలైన ఎడ్జ్‌లతో కూడిన OLED డిస్‌ప్లే కనిపిస్తోంది. వెనుక భాగంలో చతురస్రాకార కెమెరా మాడ్యూల్ ఉండగా, దానికి రౌండెడ్ కార్నర్లు ఇవ్వడం ద్వారా ప్రీమియం లుక్ అందించారు. ఈ ఫోన్ వన్‌ప్లస్ ఏస్ 6 తో కలిసి అక్టోబర్ 27న చైనాలో సాయంత్రం 7 గంటలకు అధికారికంగా ఆవిష్కరించబడనుంది. ప్రస్తుతం ఈ మోడల్ వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్, JD.com, మరియు ఇతర ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రీ-రిజర్వేషన్‌కి అందుబాటులో ఉంది.
వన్‌ప్లస్ 15లో 165Hz రిఫ్రెష్ రేట్ మరియు 1.5K రిజల్యూషన్ గల OLED డిస్‌ప్లే ఉండనుంది. ఇది మూడవ తరం BOE ఓరియెంటల్ స్క్రీన్ను ఉపయోగించబోతోంది. దీని బెజెల్స్ కేవలం 1.15 మిల్లీమీటర్ల మందం మాత్రమే. సాఫ్ట్‌వేర్ పరంగా, ఈ ఫోన్ Android 16 బేస్డ్ ColorOS 16 పై రన్ అవుతుంది, అంతర్జాతీయ వెర్షన్‌లో మాత్రం OxygenOS 16 అందించబడుతుంది.
పర్ఫార్మెన్స్ దృష్ట్యా, వన్‌ప్లస్ 15లో తాజా Qualcomm Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్ను ఉపయోగించారు. ఇది ప్రాసెసింగ్ వేగం మరియు ఎనర్జీ ఎఫిషియెన్సీ పరంగా గణనీయమైన మెరుగుదల కలిగి ఉంది.
కెమెరా సెగ్మెంట్‌లో, ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 50 మెగాపిక్సెల్ సెకండరీ లెన్స్, అలాగే 3x ఆప్టికల్ జూమ్ సామర్థ్యంతో కూడిన 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉండనున్నట్లు లీక్‌లు సూచిస్తున్నాయి. ఫోటోగ్రఫీ మరియు వీడియో రికార్డింగ్ పరంగా ఇది ప్రీమియం యూజర్లను ఆకట్టుకునే అవకాశం ఉంది.
బ్యాటరీ విభాగంలో, వన్‌ప్లస్ 15లో 7,300mAh బ్యాటరీ, 120W వైర్డ్ ఛార్జింగ్, మరియు 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అందించబడనుంది. అదనంగా, ఇది IP68 రేటింగ్తో వస్తుందని, అంటే ధూళి మరియు నీటి నిరోధకత కలిగి ఉంటుందని సమాచారం. మొత్తం మీద, వన్‌ప్లస్ 15 ఫోన్ డిజైన్, పనితీరు, కెమెరా సామర్థ్యం, బ్యాటరీ బ్యాకప్ మరియు సాఫ్ట్‌వేర్ అనుభవం అన్ని కలిపి ఫ్లాగ్‌షిప్ స్థాయిలో కొత్త ప్రమాణాలను నెలకొల్పబోతోందని చెప్పొచ్చు.
ప్రకటన
ప్రకటన