OnePlus Ace 5 లాంచ్ టైమ్‌లైన్ ఇదే.. 6.78-అంగుళాల డిస్‌ప్లేతోపాటు మ‌రెన్నో ఫీచ‌ర్స్‌..

Snapdragon 8 Gen 3 ప్రాసెస‌ర్‌ చిప్‌సెట్‌లో OnePlus Ace 5 ర‌న్ అవుతంద‌ని చెబుతున్నారు. అలాగే, చైనా వెలుపల మార్కెట్‌లోకి ఈ స్మార్ట్ ఫోన్ OnePlus 13R మోనికర్‌తో వస్తుందని భావిస్తున్నారు.

OnePlus Ace 5 లాంచ్ టైమ్‌లైన్ ఇదే.. 6.78-అంగుళాల డిస్‌ప్లేతోపాటు మ‌రెన్నో ఫీచ‌ర్స్‌..

Photo Credit: OnePlus

OnePlus Ace 3 (చిత్రపటం) Snapdragon 8 Gen 2 SoCపై నడుస్తుంది

ముఖ్యాంశాలు
  • OnePlus Ace 5 స్మార్ట్ ఫోన్‌ 1.5K రిజల్యూషన్ డిస్‌ప్లేతో వ‌స్తుంద‌ని అంచ‌
  • OnePlus Ace 5 స్మార్ట్ ఫోన్‌ 1.5K రిజల్యూషన్ డిస్‌ప్లేతో వ‌స్తుంద‌ని అంచ‌
  • మైక్రో కర్వడ్ ఎడ్జెస్‌తో ఫ్లాట్ ఎప్పీరియన్స్‌తో రానుంద‌ని భావిస్తున్నారు
ప్రకటన

గ‌త కొంత‌కాలంగా OnePlus Ace 5, OnePlus Ace 5 Pro హ్యాండ్‌సెట్‌ల గురించిన ప‌లు రూమ‌ర్లు ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లుకొడుతున్నాయి. కానీ, ఈ లైన‌ప్‌పై అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న విడుద‌ల‌కాలేదు. అయితే, తాజాగా vanilla మోడల్ చైనాలో వచ్చే నెల లాంచ్‌ అవుతుందనే వార్త వైర‌ల్‌గా మారింది. OnePlus Ace 5 స్మార్ట్ ఫోన్‌ 1.5K రిజల్యూషన్ డిస్‌ప్లేను క‌లిగి ఉంటుంద‌నే లీక్ బ‌హిర్గ‌త‌మైంది. ఇది Snapdragon 8 Gen 3 ప్రాసెస‌ర్‌ చిప్‌సెట్‌లో ర‌న్ అవుతంద‌ని చెబుతున్నారు. అలాగే, చైనా వెలుపలి మార్కెట్‌లోకి OnePlus 13R మోనికర్‌తో OnePlus Ace 5 స్మార్ట్ ఫోన్ వస్తుందని భావిస్తున్నారు. మ‌రెందుకు ఆల‌స్యం ఈ మోడ‌ల్స్‌కు సంబంధించిన కీల‌క‌మైన విష‌యాల‌ను ఇక్క‌డ తెలుసుకుందాం.

రీబ్రాండెడ్ వెర్షన్‌గా గ్లోబ‌ల్ మార్కెట్‌లోకి..

OnePlus Ace 5 డిసెంబర్‌లో చైనాలో లాంచ్ అవుతుంద‌ని డిజిటల్ చాట్ స్టేషన్ Weibo పోస్ట్‌లో వెల్ల‌డించింది. OnePlus 13R రాబోయే జనవరిలో OnePlus Ace 5 రీబ్రాండెడ్ వెర్షన్‌గా భార‌త్‌తో సహా గ్లోబల్ మొబైల్‌ మార్కెట్‌లో విడుదల కానున్న‌ట్లు పేర్కొంది. నిజానికి, OnePlus Ace 3 జనవరిలో చైనాలో ఆవిష్కరించగా, గ్లోబ‌ల్ మార్కెట్‌లోకి ఈ హ్యాండ్‌సెట్ OnePlus 12R గా అందుబాటులో ఉంది. అలాగే, ఇది మైక్రో కర్వడ్ ఎడ్జెస్‌తో ఫ్లాట్ ఎప్పీరియన్స్‌తో కొనుగోలుకు అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. ఈ కార‌ణంగా హ్యాండ్‌సెట్ మార్కెట్‌లో మంచి అమ్మ‌కాలు జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ట్లు మార్కెట్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో..

OnePlus Ace 5 స్మార్ట్‌ఫోన్‌ 1.5K రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల BOE X2 8T LTPO డిస్‌ప్లేతో వస్తుందని గ‌తంలో వ‌చ్చిన లీక్‌ల ఆధారంగా ప్ర‌చారంలో ఉంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌తో రూపొందించిన‌ట్లు చెబుతున్నారు. అలాగే, ఈ హ్యాండ్‌సెట్‌కు 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించనున్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. OnePlus Ace 5 16-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌తో ఉండొచ్చు. ఇది అలర్ట్ స్లైడర్‌తో పాటు, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,300mAh భారీ బ్యాటరీతో వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. అంతే కాదు, ఈ బ్యాట‌రీ సామ‌ర్థ్యం గ‌తంలో వ‌చ్చిన మోడ‌ల్స్‌తో పోల్చితే ఎక్కువ‌నే చెప్పాలి.

6,500mAh భారీ బ్యాటరీతో..

దీంతోపాటు న్యూ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెస‌ర్‌తో OnePlus Ace 5 Pro ర‌న్ అవుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అలాగే, రైట్ యాంగిల్ మెటల్ మిడిల్ ఫ్రేమ్‌తో కూడిన‌ గాజు-సిరామిక్ బాడీని కలిగి ఉండవచ్చని గ‌తంలో వ‌చ్చ‌ని లీక్‌ల ఆధారంగా చెబుతున్నారు. ఈ మోడ‌ల్‌ 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,500mAh భారీ బ్యాటరీని అందిచ‌నున్న‌ట్లు మార్కెట్ వ‌ర్గాల‌లో ప్ర‌చారంలో ఉంది. అలాగే, ప్రో హ్యాండ్‌సెట్ మిడ్-రేంజ్ నుండి హై-ఎండ్ మోడల్‌గా అందుబాటులోకి రానున్న‌ట్లు కూడా భావిస్తున్నారు. ఈ మోడ‌ల్స్‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం కోసం మ‌రి కొన్ని రోజులు వేచి చూడాల్సిందేన‌ని మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Comments
Facebookలో షేర్‌ Gadgets360 Twitter Shareట్వీట్ షేర్ Snapchat రెడ్డిట్ వ్యాఖ్యానించండి

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. ఈ ఫోన్‌లో ప్రత్యేకించి ప్రో విజువల్ ఇంజిన్ ఉంటుంది, దీని ద్వారా పలు ఏఐ ఆధారిత ఎడిటింగ్ టూల్స్ అందుబాటులో ఉంటాయి
  2. ఈ ఫోన్‌ 4400mAh బ్యాటరీతో 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 30 నిమిషాల్లో 50% ఛార్జ్
  3. ChatGPT said: ఆఫర్లు బ్యాంక్, కూపన్ డిస్కౌంట్లు, నో కాస్ట్ EMIతో ఎఫెక్టివ్ ధరలకు అందుబాటులో ఉన్నాయి
  4. ఈ ఆఫర్లు బ్యాంక్ ఆఫర్లు, కూపన్‌లతో లభ్యమవుతూ నో కాస్ట్ EMI ఫైనాన్స్ ఎంపికలు అందుబాటులో
  5. జూలై 14న ఇండియ‌న్ మార్కెట్‌లోకి Vivo X Fold 5, Vivo X200 FE
  6. స‌రికొత్త బ్యాట‌రీ అప్‌గ్రేడ్‌తో మార్కెట్‌లోకి iPhone 17 Pro Max
  7. ఇది మిడ్ రేంజ్‌ సెగ్మెంట్లో గట్టి పోటీగా జూలై 12 నుంచి అమెజాన్‌లో లభ్యం
  8. ప్రైమ్ డే 2025: ఎకో, ఫైర్ టీవీ, కిండిల్‌లపై గరిష్ఠంగా 50% డిస్కౌంట్
  9. నథింగ్ హెడ్‌ఫోన్ 1లో 1040mAh బ్యాటరీ ఉంది, 120 నిమిషాల్లో Type-C ద్వారా ఛార్జ్ అవుతుంది
  10. నథింగ్ ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్ Android 15 ఆధారంగా రూపొందించిన నథింగ్ OS 3.5 పై రన్ అవుతుంది
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »