ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.77 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది

కొత్త Redmi Note 15 5Gలో Qualcomm Snapdragon 6 Gen 3 ప్రాసెసర్ను ఉపయోగించారు. గత తరం ఫోన్‌తో పోలిస్తే మల్టీటాస్కింగ్ పనితీరు 30 శాతం కంటే ఎక్కువగా మెరుగుపడినట్లు కంపెనీ చెబుతోంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.77 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది

Photo Credit: Redmi

Redmi Note 15 5G దుమ్ము మరియు నీటి నిరోధకత కోసం IP65-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంది.

ముఖ్యాంశాలు
  • 120Hz AMOLED డిస్‌ప్లే, 3,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌
  • Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో వేగవంతమైన పనితీరు
  • IP66, IP68, IP69 రేటింగ్‌లు
ప్రకటన

షియోమీ బ్రాండ్ Redmi తాజాగా భారత్‌లో తన కొత్త మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ Redmi Note 15 5Gను అధికారికంగా విడుదల చేసింది. కంపెనీ ఈ ఫోన్‌ను 108 MasterPixel Editionగా పిలుస్తోంది. గతేడాది డిసెంబర్‌లో లాంచ్ అయిన Redmi Note 14 5Gకి ఇది కంటిన్యూషన్ మోడల్ గా వస్తోంది. కొత్త Redmi Note 15 5Gలో Qualcomm Snapdragon 6 Gen 3 ప్రాసెసర్ను ఉపయోగించారు. గత తరం ఫోన్‌తో పోలిస్తే మల్టీటాస్కింగ్ పనితీరు 30 శాతం కంటే ఎక్కువగా మెరుగుపడినట్లు కంపెనీ చెబుతోంది. అంతేకాదు, 108 మెగాపిక్సెల్ కెమెరా, భారీ 5,520mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. భారత్‌లో Redmi Note 15 5G ప్రారంభ ధర రూ. 19,999గా నిర్ణయించారు. ఈ ధర 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌కు వర్తిస్తుంది. మరోవైపు, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 21,999గా ఉంది. ఈ ధరల్లో ఇప్పటికే రూ. 3,000 బ్యాంక్ డిస్కౌంట్ను కలిపి చూపించారు. Axis Bank, ICICI Bank, SBI కార్డులతో కొనుగోలు చేసే వినియోగదారులకు గరిష్టంగా రూ. 3,000 వరకు బ్యాంక్ ఆఫర్ లభిస్తుంది. అదనంగా, రెడ్మీ ప్రత్యేక బోనస్‌గా2 నెలల YouTube Premium, 3 నెలల Spotify Premium Standard, 6 నెలల Google One సబ్‌స్క్రిప్షన్ను ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అందిస్తోంది.

Redmi Note 15 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు విషయానికి వస్తే... డ్యూయల్ సిమ్ (నానో + నానో) సపోర్ట్‌తో వచ్చే Redmi Note 15 5G, Android 15 బేస్డ్ HyperOS 2పై పనిచేస్తుంది. ఈ ఫోన్‌కు 4 సంవత్సరాల OS అప్‌డేట్లు, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లు అందిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. అలాగే, త్వరలోనే Android 16 ఆధారిత HyperOS 3 OTA అప్‌డేట్ కూడా అందుబాటులోకి రానుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.77 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. ఫుల్ HD+ రిజల్యూషన్‌తో పాటు, 120Hz రిఫ్రెష్ రేట్, 3,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉండటం వల్ల అవుట్‌డోర్‌లో కూడా క్లియర్ విజిబిలిటీ లభిస్తుంది. స్క్రీన్‌పై Corning Gorilla Glass 7i ప్రొటెక్షన్ కూడా ఉంది.

పర్ఫార్మెన్స్ పరంగా Redmi Note 15 5Gలో Snapdragon 6 Gen 3 చిప్‌సెట్, 8GB LPDDR4X RAM, 256GB వరకు UFS 2.2 స్టోరేజ్ అందించారు. అవసరమైతే MicroSD కార్డ్ ద్వారా స్టోరేజ్ పెంచుకునే అవకాశం కూడా ఉంది.

ఫోటోగ్రఫీకి ఈ ఫోన్ మంచి ఎంపిక. వెనుక భాగంలో 108MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. వీటితో 4K @30fps వీడియో రికార్డింగ్ చేయవచ్చు. ముందు భాగంలో 20MP సెల్ఫీ కెమెరా ఉంది, ఇది 1080p @30fps వీడియోకు సపోర్ట్ చేస్తుంది.

Redmi Note 15 5Gకు IP65 రేటింగ్ ఉంది. భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్, AI ఫేస్ అన్‌లాక్ అందించారు. ఫోన్ పరిమాణం 164 x 75.42 x 7.35mm, బరువు 178 గ్రాములు. కనెక్టివిటీకి 5G, 4G LTE, Wi-Fi, Bluetooth 5.1, USB Type-C, GPS, NFC సపోర్ట్ ఉన్నాయి. Dolby Atmosతో స్టీరియో స్పీకర్లు, 5,520mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్, 18W రివర్స్ ఛార్జింగ్ ఫీచర్లు ఉన్నాయి

ces_story_below_text

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. లెనోవా లెజియన్ గో ధర ఎంతంటే?.. కళ్లు చెదిరే ఫీచర్స్ ఇవే
  2. ఈ పెద్ద స్క్రీన్ మల్టీటాస్కింగ్, కంటెంట్ క్రియేషన్, డాక్యుమెంట్ వర్క్ వంటి పనులకు అనువుగా ఉంటుంది.
  3. Samsung Galaxy Z Flip 6 భారత్‌లో రూ.1,09,999 ధరతో విడుదలైంది.
  4. ఐకూ 15ఆర్ కాస్తా ఐకూ జెడ్11 టర్బోగా వస్తుందా?.. కీ ఫీచర్స్ ఇవే
  5. ఈ డిస్‌ప్లే విషయానికి వస్తే, 6.55 అంగుళాల LTPO AMOLED స్క్రీన్ను అందించారు.
  6. ధరల విషయానికి వస్తే, Realme 16 Pro 5G రూ.31,999 నుంచి ప్రారంభమవుతుంది.
  7. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.77 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది
  8. మార్కెట్లోకి హయర్ ఫ్రోస్ట్ ఫ్రీ 5252.. కీ ఫీచర్స్, ధర ఇతర వివరాలివే
  9. ఇంత భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ బరువు కేవలం 216 గ్రాములే ఉండటం విశేషం.
  10. ఇండియాలోకి సీఎంఎఫ్ హెడ్ ఫోన్ ప్రో, వాచ్ 3 ప్రో.. కీ ఫీచర్స్ ఇవే
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »