OnePlus నుండి విడుదలైన OnePlus Nord 4 మరియు OnePlus Nord CE 4 Lite 5G స్మార్ట్ ఫోన్‌లు ఆగస్ట్ 10న కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్‌లను పొందాయి. కంపెనీ ప్రకటించిన దాని ప్రకారం మూడు AI కొత్త ఫీచర్స్ టూల్‌కిట్ ద్వారా అనుసంధానం పొందనున్నట్లు వెల్లడించింది. అలాగే, ఈ టూల్‌కిట్ మొబైల్‌లోని సైడ్‌బార్‌లో ఉంటుంది. కానీ వాటిని ఉపయోగించాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే ఇవి వినియోగంలోకి వస్తాయి. ఉదాహరణకు, AI స్పీక్ ఫీచర్ పెద్ద మొత్తంలో టెక్స్ట్ ఉన్న వెబ్‌పేజీలో ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తుంది.
నిజానికి, ఈ AI ఫీచర్లు జూలైలోనే OnePlus Nord 4తో వస్తాయని అంతా భావించారు. అయితే, అయితే, AI ఫీచర్లు ఆలస్యం అయ్యాయి. చివరకు కంపెనీ తజాగా ఆగస్టులో ఈ ఫీచర్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు అదనంగా OnePlus Nord CE4 Lite 5G కూడా ఈ ఫీచర్స్‌ను జోడించింది. అంతేకాదు, ఈ ఫీచర్స్ కేవలం భారతదేశంలో మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. అది కూడా Nord CE 4 Lite మోడల్‌ను వినియోగిస్తున్న భారతీయలు AI ఫీచర్‌ను యాక్సెస్ చేయగలరు. అలాగే, యూరప్, ఇండియా, ఆసియా-పసిఫిక్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, సౌత్ ఆసియా, రష్యా మరియు లాటిన్ అమెరికాలలోని Nord 4 మోడల్ వినియోగదారులు కూడా దీనిని ఉపయోగించగలరని ఈ ఫీచర్స్‌కు సంబంధించిన సమాచారాని కంపెనీ ఒక కమ్యూనిటీ పోస్ట్ ద్వారా వెల్లడించింది.
వాయిస్‌లను ఎంపిక చేసుకునే అవకాశం..
ఇక ఈ AI ఫీచర్ల విషయానికి వస్తే.. మొదటిది AI స్పీక్. ఇది టెక్స్ట్-టు-స్పీచ్ (TTS) ఫీచర్. ఇందులో నిర్దిష్ట మరిమాణంలో పేరాగ్రాఫ్‌తో ఉన్న ఏదైనా పేజీని బయటకు చదవగలదు. ఇది బ్రౌజర్‌లతోపాటు ఎక్కువ టెక్స్ట్ వాల్యూమ్ ఉన్న నిర్దిష్ట యాప్‌లలో పని చేస్తుంది. అయితే ఇది కొన్ని సోషల్ మీడియా యాప్‌లలో ఈ ఫీచర్ పని చేయకపోవచ్చు. వినియోగదారులు మగ, ఆడ వాయిస్‌లను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే, పేరాగ్రాఫ్‌లో కొంత భాగాన్ని రీప్లే చేసుకోవడంతోపాటు వాక్యాలను దాటవేసే వెసులుబాటు ఉంటుంది. స్క్రీన్‌పై కనిపించే డౌన్ షీట్ ద్వారా ప్లేబ్యాక్ వేగాన్ని కూడా నియంత్రించుకోవచ్చు. రీడబుల్ టెక్స్ట్ కూడా అదే ఇంటర్‌ఫేస్‌లో విడిగా కనిపిస్తుంది.
ఫైల్ డాక్‌లో కూడా నిల్వ చేసుకోవచ్చు..
అలాగే, ఇందులోని రెండవ AI ఫీచర్ విషయానికి వస్తే.. మనం Google లేదా Samsungలో చూసినట్లుగా.. ఫీచర్ యోక్క సారాంశం తప్పనిసరిగా పెద్ద పాసేజ్ లేదా వెబ్‌పేజీ యొక్క టెక్స్ట్ సారాంశాన్ని పూర్తిగా రూపొందిస్తుంది. దీంతోపాటు రూపొందించిన సారాంశం మొత్తన్ని యాప్‌కి కాపీ చేయడానికి, షేర్ చేయడానికి లేదా సేవ్ చేయడానికి OnePlus వినియోగదారులను మాత్రం అనుమతిస్తుంది. ఇది ఫైల్ డాక్‌లో కూడా నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఆన్-స్క్రీన్ చిత్రాల ఆధారంగా వచనాన్ని..
ఇక చివరి AI ఫీచర్ AI రైటర్. ఇది పేరుకు తగ్గట్టుగానే వ్యాసాలు, ఇమెయిల్‌లు, వచన సందేశాలు, సమీక్షలు, కథనాలను కూడా సొంతంగా రాయగల AI-శక్తితో కూడిన టెక్స్ట్- ప్రొడ్యూసుడ్ మెకానిజం. ఇది ఫీచర్ టెక్స్ట్ ఫీల్డ్‌లో యాక్టివేట్ చేయబడుతుంది. దీని ద్వారా రూపొందించబడిన వచనం యొక్క టోనాలిటీని నియంత్రించడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. అంతేకాదు, వినియోగదారులు ఆన్-స్క్రీన్ చిత్రాల ఆధారంగా వచనాన్ని రూపొందించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఫీచర్‌లను ఉపయోగించడానిక వినియోగదారులు ముందుగా స్క్రీన్ రికగ్నిషన్‌ను చేయాల్సి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లో సెట్టింగ్‌లు > యాక్సెసిబిలిటీ & కన్వీనియన్స్‌కి వెళ్లడం ద్వారా దీన్ని దీనిని ప్రారంభించవచ్చు. మొదటి సారి ఫీచర్‌ని ఉపయోగిస్తున్నప్పుడు స్క్రీన్ రికగ్నిషన్‌ని ప్రారంభించడానికి సమ్మతి కోసం అడుగుతున్న ప్రాంప్ట్‌ను స్పష్టంగా చూపిస్తుంది.