ఆపిల్ E-సిరీస్‌కు సంబంధించిన రూమర్లు గత కొన్ని నెలలుగా వినిపిస్తున్నాయి.

అయితే iPhone 17e ఆపిల్ ప్రధాన ఫ్లాగ్‌షిప్ మోడల్ కాకపోవడంతో, దీనికోసం ప్రత్యేక ఈవెంట్ నిర్వహించే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తోంది. గతంలో iPhone 16e లాగే, ఈసారి కూడా ఆపిల్ ఒక సింపుల్ ప్రెస్ రిలీజ్ ద్వారా కొత్త ఫోన్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశమే ఎక్కువగా ఉంది.

ఆపిల్ E-సిరీస్‌కు సంబంధించిన రూమర్లు గత కొన్ని నెలలుగా వినిపిస్తున్నాయి.

ఐఫోన్ 16e (చిత్రంలో) ఆపిల్ లైనప్‌లో అత్యంత సరసమైన నాన్-ఫ్లాగ్‌షిప్ ఐఫోన్.

ముఖ్యాంశాలు
  • iPhone 16e లో లేని MagSafe ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ iPhone 17eలో అందుబా
  • ప్రత్యేక ఈవెంట్ లేకుండా ప్రెస్ రిలీజ్ ద్వారానే ఆవిష్కరణ జరిగే అవకాశం
  • నాచ్ డిజైన్, సింగిల్ రియర్ కెమెరాతోనే బడ్జెట్ E-సిరీస్ కొనసాగింపు
ప్రకటన

ఆపిల్ ఫిబ్రవరి 2025లో iPhone 16eను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సిరీస్‌లో వచ్చే తదుపరి మోడల్ iPhone 17e విడుదల తేదీపై టెక్ ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, iPhone 17eను 2026 ఫిబ్రవరి 19న విడుదల చేసే అవకాశం ఉంది. ఇది గత ఏడాది iPhone 16e విడుదలైన తేదీకి కచ్చితంగా ఒక సంవత్సరం తర్వాత రావడం గమనార్హం. ఆ రోజు గురువారం కావడం ఆసక్తికర అంశం, ఎందుకంటే సాధారణంగా ఆపిల్ తన కొత్త ఉత్పత్తులను సోమవారం లేదా మంగళవారం రోజుల్లోనే ప్రకటిస్తుంది. అయితే iPhone 17e ఆపిల్ ప్రధాన ఫ్లాగ్‌షిప్ మోడల్ కాకపోవడంతో, దీనికోసం ప్రత్యేక ఈవెంట్ నిర్వహించే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తోంది. గతంలో iPhone 16e లాగే, ఈసారి కూడా ఆపిల్ ఒక సింపుల్ ప్రెస్ రిలీజ్ ద్వారా కొత్త ఫోన్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశమే ఎక్కువగా ఉంది.

ఇండస్ట్రీలోని మా వర్గాల ప్రకారం, iPhone 17eలో iPhone 16eపై వచ్చిన ప్రధాన విమర్శలలో ఒకదాన్ని ఆపిల్ పరిష్కరించనుంది. కొత్త మోడల్‌లో MagSafe సపోర్ట్ ఇవ్వనున్నారు. ఇది గరిష్టంగా 25 వాట్ల వరకు ఫాస్ట్ వైర్‌లెస్ చార్జింగ్‌ను అందిస్తుంది. iPhone 16eలో మాత్రం పాత Qi 1 స్టాండర్డ్ మాత్రమే ఉండటంతో, చార్జింగ్ స్పీడ్ 7.5 వాట్లకే పరిమితమైంది.

డిజైన్ విషయానికి వస్తే, iPhone 17eలో కూడా వెనుక భాగంలో ఒక్క కెమెరానే ఉండే అవకాశం ఉంది. అలాగే నాచ్ డిజైన్ కొనసాగనుంది. చాలా మంది ఎదురుచూస్తున్న Dynamic Island ఈ మోడల్‌కు వచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.

ఆపిల్ E-సిరీస్‌కు సంబంధించిన రూమర్లు గత కొన్ని నెలలుగా వినిపిస్తున్నాయి. ఇటీవల “The Information” వెబ్‌సైట్ iPhone 17eకు MagSafe సపోర్ట్ ఉంటుందని పేర్కొంది. ఇప్పుడు ఆ సమాచారం నిజమేనని ఇండస్ట్రీ వర్గాలు సూచిస్తున్నాయి. అయితే కొన్ని ఫీచర్ల విషయంలో ఆపిల్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. iPhone 16eలో Ultra Wideband (UWB) చిప్ లేకపోవడం, అలాగే టెథరింగ్ సపోర్ట్ లేకపోవడం చాలామందిని నిరాశపరిచాయి. ఈ ఫీచర్లను iPhone 17eలో జోడిస్తుందా లేదా అన్నదానిపై ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం లేదు.

iPhone 16e మరియు రాబోయే iPhone 17eతో, ఆపిల్ కొత్తగా ఒక అర్ధ వార్షిక విడుదల విధానాన్ని అమలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇక భవిష్యత్తులో ఈ వ్యూహాన్ని మరింత విస్తరించాలని కంపెనీ భావిస్తున్నట్టు రూమర్లు చెబుతున్నాయి.
ముఖ్యంగా iPhone 18 సిరీస్‌తో, వసంత కాలంలోనే మరిన్ని iPhonesను ప్రకటించే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉదాహరణకు, ఇప్పటివరకు సెప్టెంబర్‌లో విడుదలయ్యే ఎంట్రీ-లెవల్ iPhone 18, ఇకపై 2027 వసంత కాలంలోనే విడుదల కావచ్చని సమాచారం.

మొత్తానికి, iPhone 17e ఆపిల్ బడ్జెట్ సెగ్మెంట్‌లో కీలకమైన మోడల్‌గా నిలవనుంది. వినియోగదారుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటూ, చిన్నచిన్న మార్పులతో అయినా అనుభవాన్ని మెరుగుపరచే దిశగా ఆపిల్ అడుగులు వేస్తోందన్నది స్పష్టంగా కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Redmi Note 17 Launching on August 6th 2026: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రెడ్‌మి సరికొత్త సంచలనం.. భారత్‌లో ఆగస్టు 6న రెడ్‌మి నోట్ 17 లాంచ్!
  2. Full Page Screenshot in iPhones: ఐఫోన్ యూజర్లకు అదిరిపోయే ట్రిక్.. ఒకే ఫైల్‌లో మొత్తం వెబ్‌పేజీని భద్రపరుచుకునే స్మార్ట్ ఫీచర్
  3. OnePlus Exit Rumors form India: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వన్‌ప్లస్ సంచలనం.. భారత్‌లో వ్యాపారం బంద్ కానుందా?
  4. Social Media Curfew in United Kingdom: టీనేజర్ల రక్షణ కోసం బ్రిటన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సోషల్ మీడియాపై రాత్రి వేళల్లో కర్ఫ్యూ
  5. Belkin 10K Power Bank: ఒకేసారి రెండు డివైజ్‌లు చార్జ్ చేసుకునే సదుపాయం.. బడ్జెట్ ధరలోనే అదిరిపోయే పవర్‌బ్యాంక్!
  6. Google Pixel 11 Launching on August 12: స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఆగస్టు 12న గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ గ్రాండ్ లాంచ్
  7. iQOO Z11 Lite launching: కాలేజ్ స్టూడెంట్స్ కోసం ఐకూ బంపర్ ఆఫర్.. జూలై 24న మార్కెట్లోకి సరికొత్త iQOO Z11 Lite
  8. ISRO Scientist Mass Resignations: ఇస్రో శాస్త్రవేత్తల వరుస రాజీనామాలు.. రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం, కొత్త రూల్స్ జారీ!
  9. Xiaomi Smart Camera C401 launched: చిన్న మూలపైనా డేగ కన్ను వేస్తుంది.. మోడరన్ సెక్యూరిటీ కెమెరాను తెచ్చిన షియోమీ!
  10. Apple Back to School Sale 2026: విద్యార్థులు, ఉపాధ్యాయులకు యాపిల్ బంపర్ ఆఫర్.. దేశంలో బ్యాక్ టు స్కూల్ సేల్ షురూ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »