Xiaomi 17 ధర €1,100గా ఉండే అవకాశం ఉంది.

ఇక Xiaomi 17 Ultra మూడు ఆకర్షణీయ రంగుల్లో రానుంది... స్టారీ గ్రీన్, వైట్ మరియు బ్లాక్. చైనా మార్కెట్‌లో ఇప్పటికే గ్రీన్ మరియు పర్పుల్ కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉండగా, గ్లోబల్ వేరియంట్‌లో పర్పుల్ కలర్ కనిపించదని లీకులు చెబుతున్నాయి.

Xiaomi 17 ధర €1,100గా ఉండే అవకాశం ఉంది.

Photo Credit: Xiaomi

Xiaomi 17 సిరీస్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.

ముఖ్యాంశాలు
  • గ్లోబల్ మార్కెట్‌లో Xiaomi 17 మరియు 17 Ultra మాత్రమే లాంచ్
  • Xiaomi 17 Ultra గ్లోబల్ వేరియంట్‌లో 6,000mAh బ్యాటరీ
  • లీకుల ప్రకారం Xiaomi 17 ధర €1,000 నుంచి, 17 Ultra ధర €1,500 వరకు ఉండే అవక
ప్రకటన

ప్రముఖ లీక్‌స్టర్ యోగేష్ బ్రార్ వెల్లడించిన సమాచారం ప్రకారం, షియోమీ తన 17 సిరీస్‌లోని రెండు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లను గ్లోబల్ మార్కెట్‌లో త్వరలోనే విడుదల చేయనుంది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) సమయం దగ్గరగా, అంటే మార్చి 2 నుంచి 5 మధ్యలో, ఈ ఫోన్లు అంతర్జాతీయంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. యూరప్ మార్కెట్‌లో ఇవి MWC కంటే కొద్దిరోజుల ముందే లాంచ్ అయ్యే సూచనలు ఉండగా, భారత్‌లో మాత్రం మార్చి ప్రారంభంలోనే ఆవిష్కరణ జరగవచ్చని సమాచారం. గ్లోబల్ మార్కెట్‌లో అందుబాటులోకి రానున్న మోడల్స్ విషయానికి వస్తే, Xiaomi 17 మరియు ఫ్లాగ్‌షిప్ Xiaomi 17 Ultra (Leica Edition సహా) మాత్రమే అంతర్జాతీయంగా లాంచ్ కానున్నాయి. ఇక Xiaomi 17 Pro మరియు 17 Pro Max మోడల్స్ మాత్రం చైనా మార్కెట్‌కే పరిమితం కానున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే లీక్ అయిన కొన్ని ఫోటోలు టెక్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో గ్లోబల్ మార్కెట్‌కు వచ్చే Xiaomi 17 మరియు Xiaomi 17 Ultra డిజైన్లు మాత్రమే కాకుండా, వాటికి అందుబాటులో ఉండే కలర్ ఆప్షన్లు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. Xiaomi 17 విషయానికి వస్తే, ఈ కాంపాక్ట్ ఫోన్ బ్లూ, గ్రీన్ మరియు బ్లాక్ రంగుల్లో అందుబాటులోకి రానుంది. ఇందులో గ్రీన్ కలర్ కొత్తగా గ్లోబల్ మార్కెట్ కోసం తీసుకొస్తుండటం విశేషం. చైనాలో విడుదలైన పింక్ కలర్ వేరియంట్ మాత్రం గ్లోబల్ లాంచ్‌కు దూరంగా ఉండనుందని తెలుస్తోంది.

ఇక Xiaomi 17 Ultra మూడు ఆకర్షణీయ రంగుల్లో రానుంది... స్టారీ గ్రీన్, వైట్ మరియు బ్లాక్. చైనా మార్కెట్‌లో ఇప్పటికే గ్రీన్ మరియు పర్పుల్ కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉండగా, గ్లోబల్ వేరియంట్‌లో పర్పుల్ కలర్ కనిపించదని లీకులు చెబుతున్నాయి. Leica Editionకు ప్రత్యేకంగా బ్లాక్ మరియు ఆఫ్-వైట్ అనే ఎక్స్‌క్లూజివ్ కలర్స్ ఉంటాయని సమాచారం, అయితే వాటి చిత్రాలు ఇప్పటివరకు బయటకు రాలేదు. గ్లోబల్ Xiaomi 17 Ultraలో ఒక కీలక మార్పు ఉండబోతుందన్న విషయం కూడా లీకుల ద్వారా వెలుగులోకి వచ్చింది. చైనా వేరియంట్‌లో ఉన్న 6,800mAh బ్యాటరీకు బదులుగా, గ్లోబల్ మోడల్‌లో 6,000mAh బ్యాటరీ మాత్రమే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే బ్యాటరీ సామర్థ్యం తగ్గినా, ఫోన్ డిజైన్‌లో ఎలాంటి మార్పు ఉండదని సమాచారం. గ్లోబల్ వేరియంట్ కూడా చైనా మోడల్‌లాగే 8.29mm మందంతో ఉండే అవకాశం ఉంది. బరువు కూడా దాదాపుగా అదే స్థాయిలో, అంటే 223 గ్రాములు ఉండొచ్చని అంచనా. Leica Edition మాత్రం కొంచెం మందంగా 8.46mmతో పాటు, బరువుగా 230 గ్రాములు ఉండనుందని సమాచారం.

ధరల విషయానికి వస్తే, గత లీకుల ప్రకారం 512GB స్టోరేజ్‌తో Xiaomi 17 ధర €1,100గా ఉండే అవకాశం ఉంది. దీని ఆధారంగా చూస్తే, 256GB బేస్ వేరియంట్ ధర సుమారు €1,000గా ఉండవచ్చని అంచనా. ఇక Xiaomi 17 Ultra 512GB వేరియంట్ ధర €1,500గా ఉండనుందని సమాచారం. ఇవే ధరలు గతంలో గ్లోబల్‌గా MWC 2025లో విడుదలైన Xiaomi 15 మరియు Xiaomi 15 Ultraలకు కూడా ఉండటం గమనార్హం.

సంబంధిత వార్తలు

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. వాట్సాప్ అదిరిపోయే అప్‌డేట్.. ఎమోజీ టైప్ చేస్తే చాలు.. దానికి తగ్గ స్టిక్కర్ ప్రత్యక్షం..!
  2. ఈ వారం ఓటీటీ సందడి: విజయ్ సేతుపతి 'గాంధీ టాక్స్' నుంచి అనిల్ కపూర్ 'సుబేదార్' వరకు.. ముచ్చటగా 10 సినిమాలు!
  3. యాపిల్ నుంచి చౌకైన ల్యాప్‌టాప్.. మ్యాక్‌బుక్ నియో వర్సెస్ ఎయిర్ M5.. మీ అవసరానికి ఏది సరిపోతుంది..?
  4. వాట్సాప్, టెలిగ్రామ్ యూజర్లకు షాక్.. నేటి నుంచే 'సిమ్ బైండింగ్' రూల్.. ఇకపై సిమ్ లేకపోతే యాప్ బంద్..!
  5. పోకో నుంచి పవర్‌ఫుల్ 5G ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజులు గడిచిపోవాల్సిందే..!
  6. ఫోన్ బ్యాటరీని మింగేసే యాప్స్‌పై గూగుల్ సర్జికల్ స్ట్రైక్.. కొత్త వార్నింగ్ ఫీచర్ వచ్చేసింది..!
  7. రియల్‌మీ సంచలనం.. రూ.13,499కే 144Hz డిస్‌ప్లే.. భారీ బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే ఫిదా..!
  8. గూగుల్ నుంచి పవర్‌ఫుల్ ఫోన్.. Pixel 10a సేల్ మొదలైంది.. ఆఫర్లలో భారీ తగ్గింపు..!
  9. లీకైన శామ్‌సంగ్ గెలాక్సీ A37, A57 5G ఫీచర్లు.. ఈ ఫోన్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తాయా..?
  10. చూడగానే ఫిదా అయిపోవాల్సిందే.. సరికొత్త గ్లిఫ్ లైటింగ్, అదిరిపోయే ఫీచర్లతో నథింగ్ ఫోన్ 4a సిరీస్..!
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »