Photo Credit: Oppo
భారీ బ్యాటరీ సామర్థ్యం కలిగిన మూడు స్మార్ట్ ఫోన్ మోడళ్లపై Oppo కంపెనీ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు తెలుస్తోంది. 2024లో తాము 6,000mAh బ్యాటరీలతో కూడిన హ్యాండ్‌సెట్‌లను పరిచయం చేయడంతోపాటు సిలికాన్ కార్బన్ బ్యాటరీలవైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిపింది. ఈ చైనీస్ ఫోన్ తయారీ కంపెనీ ఇప్పటికే 7,000mAh బ్యాటరీలతో రూపొందించిన రెండు స్మార్ట్ ఫోన్‌లను డెవలప్ చేస్తున్నట్లు టిప్‌స్టర్ పేర్కొంది. అంతేకాదు, వచ్చే నెలలోగా మరో కంపెనీ కూడా 7,000mAh బ్యాటరీతో రూపొందించిన ఫోన్‌ను విడుదల చేసే అవకావం ఉన్నట్లు ఇటీవలి నివేదికలు చెబుతున్నాయి.
Weibo పోస్ట్‌లో టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ షేర్ చేసిన వివరాలను పరిశీలిస్తే.. Oppo నెక్ట్స్ హై ఫెర్ఫామెన్స్ న్యూ ఫోన్ భారీ బ్యాటరీతో రూపొందించబడి ఉంటుందని తెలిసింది. డెవలప్‌మెంట్‌లో ఉన్న మూడు హ్యాండ్‌సెట్‌ల గురించి లీక్ అయ్యింది. అలాగే, మూడు మోడల్స్ కూడా ప్రస్తుత ఫ్లాగ్‌షిప్ లైనప్ కంటే ఎక్కువ సామర్థ్యంతో కూడిన బ్యాటరీలతో వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పటికే టిప్‌స్టర్ వెల్లడించింది.
టిప్‌స్టర్ లిస్టవుట్ చేసిన జాబితాలో మూడు స్మార్ట్ ఫోన్‌లలో మొదటిది 6,285mAh బ్యాటరీ (లేదా 6,400mAh టిపికల్)తో రూపొందించబడి ఉండొచ్చు. అలాగే, కంపెనీ భారీ బ్యాటరీగా 6,850mAh (7,000mAh టిపికల్)తో మరొక స్మార్ట్ ఫోన్‌పై కూడా పనిచేస్తున్నట్లు స్పష్టమైంది. అంతేకాదు, ఈ రెండు మోడళ్లు కూడా 80W ఛార్జింగ్‌కు సపోర్ట్‌ను అందిస్తాయని వెల్లడైంది.
అలాగే, డ్యూయల్ సెల్ 6,140mAh బ్యాటరీ (6,300mAh టిపికల్) కలిగిన మూడవ స్మార్ట్ ఫోన్ కూడా డెవలప్‌మెంట్ దశలో ఉన్నట్లు ఉందని టిప్‌స్టర్ తెలిపింది. ఈ మోడల్ ఇతర రెండు హ్యాండ్‌సెట్‌ల కంటే చిన్నదయినప్పటికీ, ఇది 100W ఛార్జింగ్ సపోర్ట్‌తో వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
ఈ డిసెంబర్‌లోనే 7,000mAh బ్యాటరీతో కూడిన స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయవచ్చని తాజా నివేదిక ప్రకారం తెలుస్తోంది. Realme నుంచి రాబోయే Realme Neo 7 హ్యాండ్‌సెట్ డిసెంబర్ 11న లాంచ్ తేదీని ఫిక్స్ చేసింది. అలాగే, ఇటీవలి ఓ లీక్‌లో ఫోన్ MediaTek డైమెన్సిటీ 9300+ చిప్, 7,000mAH బ్యాటరీని కలిగి ఉంటుందని వెల్లడైంది. దీని స్పెసిఫికేషన్స్ కూడా బహిర్గతమయ్యాయి.
భారీ బ్యాటరీలతో కూడిన రాబోయే ఈ స్మార్ట్ ఫోన్‌ల గురించి Oppo నుండి ఎలాంటి ప్రకటనా రాలేదు. ఆన్‌లైన్ వేదికగా అందుతున్న సమాచారం మేరకు ఇవి ఊహాగానాలుగానే ప్రచారం అవుతున్నాయి. అయితే, స్మార్ట్ ఫోన్‌ల వివరాలను అందించే విషయంలో టిప్‌స్టర్‌కు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఈ కారణంగా రాబోయే నెలల్లో టిప్‌స్టర్ చెప్పినట్లు భారీ బ్యాటరీ ఫోన్‌లను చూడొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఈ హ్యాండ్‌సెట్‌లకు సంబంధించి స్పష్టత రావాలంటే మాత్రం Oppo నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.
ప్రకటన
ప్రకటన