నవంబర్ 25 చైనా మార్కెట్‌లోకి గ్రాండ్‌గా Oppo Reno 13 సిరీస్ లాంచ్ కాబోతోంది.. కాన్ఫిగరేషన్స్‌ ఇవే..

రాబోయే Oppo Reno 13 హ్యాండ్‌సెట్‌లలో ఒకటి బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్‌లో దాని చిప్‌సెట్‌తో స‌హా ప్ర‌త్య‌క్ష‌మ‌య్యింది. ఈ లైనప్ గ్లోబల్ లాంచ్ టైమ్‌లైన్ కూడా టిప్‌స్టర్ ద్వారా లీక్ అయ్యింది.

నవంబర్ 25 చైనా మార్కెట్‌లోకి గ్రాండ్‌గా Oppo Reno 13 సిరీస్ లాంచ్ కాబోతోంది.. కాన్ఫిగరేషన్స్‌ ఇవే..

Photo Credit: Oppo

Oppo Reno 13 బటర్‌ఫ్లై పర్పుల్ కలర్‌వేలో వస్తుందని నిర్ధారించబడింది

ముఖ్యాంశాలు
  • Oppo Reno 13 సిరీస్ బేస్, ప్రో వేరియంట్‌ల‌లో రావచ్చు
  • Oppo Reno 13 16GB RAM వరకు స‌పోర్ట్ చేస్తుంది
  • Oppo Pad 3, Oppo Enco R3 Pro TWS ఇయర్‌ఫోన్స్‌ ఈ ఫోన్‌లతో పాటు విడుద‌ల‌
ప్రకటన

త్వ‌ర‌లోనే Oppo Reno 13 సిరీస్ చైనాలో లాంచ్ చేసేందుకు కంపెనీ స‌న్నాహాలు చేస్తోంది. అక్క‌డి దేశీయ మార్కెట్‌లో ఈ లైనప్ లాంచ్‌ తేదీని కంపెనీ ప్ర‌క‌టించింది. స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన‌ డిజైన్, RAM, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లతోపాటు సింగిల్ కలర్‌వేని కూడా వెల్ల‌డించింది. ఈ సిరీస్ బేస్ మోడల్, ప్రో వేరియంట్‌ను కలిగి ఉంటుందని మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఈ సిరీస్ ఇప్ప‌టికే విజ‌య‌వంతంగా విడుద‌లైన Oppo Reno 12, Reno 12 Pro స్మార్ట్ ఫోన్‌ల కంటే అప్‌డేటెడ్‌గా వ‌స్తోంది. అలాగే, రాబోయే హ్యాండ్‌సెట్‌లలో ఒకటి బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్‌లో దాని చిప్‌సెట్‌తో స‌హా ప్ర‌త్య‌క్ష‌మ‌య్యింది. ఈ లైనప్ గ్లోబల్ లాంచ్ టైమ్‌లైన్ కూడా టిప్‌స్టర్ ద్వారా లీక్ అయ్యింది. మ‌రెందుకు ఆల‌స్యం.. ఈ Oppo Reno 13 సిరీస్‌కు సంబంధించిన కీల‌క‌మైన విష‌యాల‌ను చూసేద్దామా..

చైనాలో నవంబర్ 25న..

Oppo తన‌ కంపెనీ Weibo పోస్ట్‌లో వెల్ల‌డించిన దాని ప్రకారం.. Oppo Reno 13 సిరీస్ చైనాలో నవంబర్ 25న సాయంత్రం 7 గంటలకు (సాయంత్రం 4:30 IST) బటర్‌ఫ్లై పర్పుల్ కలర్‌వేలో అందుబాటులోకి రానున్నాయి. అయితే, లాంచ్‌కు ముందు ఈ సిరిస్‌లోని ఇత‌ర రంగులు బ‌య‌ట‌కు తెలిసే అవ‌కాశం ఉంది. అంతేకాదు, Oppo Pad 3, Oppo Enco R3 Pro TWS ఇయర్‌ఫోన్‌లు ఈ స్మార్ట్ ఫోన్‌లతో పాటు విడుద‌ల కానున్నాయి. ఇది క‌చ్చితంగా ఈ సిరీస్‌కు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని కంపెనీ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

భార‌త్‌లో సిరీస్‌ విడుద‌ల ఎప్పుడంటే..

Oppo Reno 13 సిరీస్‌లో Oppo చైనా ఈ-స్టోర్ లిస్టింగ్ జాబితాలో RAM, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో వ‌రుస‌గా 12GB + 256GB, 12GB + 512GB, 16GB + 256GB, 16GB + 512GB, 16GB + 1TB మొత్తం ఐదు వేరియంట్‌ల‌లో అందుబాటులో ఉండ‌నుంది. అంతేకాదు, X వినియోగ‌దారుడు @chunvn8888 పోస్ట్ ద్వారా Oppo Reno 13 సిరీస్ 2025 జనవరిలో గ్లోబ‌ల్ మార్కెట్‌లో లాంచ్ అవుతుందని వెల్ల‌డించారు. అలాగే, Oppo Reno 13 హ్యాండ్‌సెట్‌లు అదే సమయంలో భార‌త్‌లోనూ విడుద‌ల కావ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఆ కాన్ఫిగరేషన్‌ల బ‌ట్టీ చూస్తే..

Oppo Reno 13 సిరీస్‌లోని vanilla, ప్రో రెండు వేరియంట్‌లు కూడా MediaTek డైమెన్సిటీ 8300 ప్రాసెస‌ర్‌ అమర్చబడి ఉండ‌నున్నాయి. అలాగే, ప్రత్యేకించి Oppo Reno 13 Pro స్మార్ట్ ఫోన్‌ MediaTek డైమెన్సిటీ 8350 ప్రాసెస‌ర్‌ కలిగి ఉండొచ్చ‌ని గ‌తంలో వ‌చ్చిన లీక్‌ల ఆధారంగా అంచ‌నా వేస్తున్నారు. ఇంతలో, Oppo Reno 13 Pro చైనీస్ వెర్షన్‌గా భావించే PKK110 మోడల్ నంబర్‌తో Oppo హ్యాండ్‌సెట్ గీక్‌బెంచ్‌లో ప్ర‌త్య‌క్ష‌మైంది. CPU, GPU కాన్ఫిగరేషన్‌ల బ‌ట్టీ ఇది MediaTek డైమెన్సిటీ 8300 ప్రాసెస‌ర్‌ను కలిగి ఉండవచ్చని సూచిస్తున్నాయి. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్‌ 16GB RAMకి సపోర్ట్ చేస్తుందని, ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతుందని ప్ర‌చారంలో ఉంది.

Retrieving data. Wait a few seconds and try to cut or copy again.

ces_story_below_text

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. లెనోవా లెజియన్ గో ధర ఎంతంటే?.. కళ్లు చెదిరే ఫీచర్స్ ఇవే
  2. ఈ పెద్ద స్క్రీన్ మల్టీటాస్కింగ్, కంటెంట్ క్రియేషన్, డాక్యుమెంట్ వర్క్ వంటి పనులకు అనువుగా ఉంటుంది.
  3. Samsung Galaxy Z Flip 6 భారత్‌లో రూ.1,09,999 ధరతో విడుదలైంది.
  4. ఐకూ 15ఆర్ కాస్తా ఐకూ జెడ్11 టర్బోగా వస్తుందా?.. కీ ఫీచర్స్ ఇవే
  5. ఈ డిస్‌ప్లే విషయానికి వస్తే, 6.55 అంగుళాల LTPO AMOLED స్క్రీన్ను అందించారు.
  6. ధరల విషయానికి వస్తే, Realme 16 Pro 5G రూ.31,999 నుంచి ప్రారంభమవుతుంది.
  7. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.77 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది
  8. మార్కెట్లోకి హయర్ ఫ్రోస్ట్ ఫ్రీ 5252.. కీ ఫీచర్స్, ధర ఇతర వివరాలివే
  9. ఇంత భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ బరువు కేవలం 216 గ్రాములే ఉండటం విశేషం.
  10. ఇండియాలోకి సీఎంఎఫ్ హెడ్ ఫోన్ ప్రో, వాచ్ 3 ప్రో.. కీ ఫీచర్స్ ఇవే
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »