సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన టీజర్ వీడియోలో, రాబోయే మోడల్‌లో ఒకటి బ్లూ మరియు వైట్ కలర్ ఆప్షన్లలో కనిపించి ఆసక్తిని రేపుతోంది. ఒక టిప్‌స్టర్ సమాచారం ప్రకారం, ఈసారి భారత్‌లో ఏకంగా నాలుగు Reno 15 సిరీస్ 5G మోడళ్లను ఒప్పో లాంచ్ చేయనుంది.
Photo Credit: Oppo
Oppo సంస్థ తన అధికారిక X ఖాతాలో “Coming Soon” అనే క్యాప్షన్‌తో Reno 15 Series 5G భారత్ లాంచ్‌ను ధృవీకరించింది. అయితే, ఖచ్చితమైన లాంచ్ తేదీని మాత్రం ఇంకా వెల్లడించలేదు.
చైనాలో నవంబర్ నెలలో లాంచ్ అయిన Oppo Reno 15 సిరీస్ 5G త్వరలోనే గ్లోబల్ మార్కెట్లలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే భారత్‌లో కూడా ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను విడుదల చేయనున్నట్లు ఒప్పో అధికారికంగా నిర్ధారించింది. సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన టీజర్ వీడియోలో, రాబోయే మోడల్‌లో ఒకటి బ్లూ మరియు వైట్ కలర్ ఆప్షన్లలో కనిపించి ఆసక్తిని రేపుతోంది. ఒక టిప్‌స్టర్ సమాచారం ప్రకారం, ఈసారి భారత్‌లో ఏకంగా నాలుగు Reno 15 సిరీస్ 5G మోడళ్లను ఒప్పో లాంచ్ చేయనుంది.
Oppo సంస్థ తన అధికారిక X ఖాతాలో “Coming Soon” అనే క్యాప్షన్‌తో Reno 15 Series 5G భారత్ లాంచ్‌ను ధృవీకరించింది. అయితే, ఖచ్చితమైన లాంచ్ తేదీని మాత్రం ఇంకా వెల్లడించలేదు. టీజర్ పోస్టులో చూపిన బ్లూ, వైట్ కలర్ వేరియంట్లు ప్రత్యేకమైన డిజైన్‌తో ఆకట్టుకుంటున్నాయి.
బ్లూ కలర్ వేరియంట్‌లో ఆరొరా (Northern Lights)ను తలపించే గ్రాడియెంట్ ఫినిషర్ కనిపిస్తుండగా, వైట్ కలర్ మోడల్ వెనుక భాగంలో రిబ్బన్‌లా ఉండే ప్రత్యేక డిజైన్ ఎలిమెంట్ ఉంది. గత నివేదికల ప్రకారం, ఇది కొత్తగా రాబోతున్న Reno 15 Pro mini కావొచ్చని సమాచారం. ఈ మోడల్ Glacier White కలర్ ఆప్షన్‌లో, ప్రత్యేకమైన రిబ్బన్-స్టైల్ బ్యాక్ ఫినిష్‌తో పరిచయం అయ్యే అవకాశం ఉంది. ఈ రెండు మోడళ్లలోనూ కెమెరా మాడ్యూల్ డిజైన్‌ను కొంతవరకు మార్చారు. గతంలో వచ్చిన Pro iPhone మోడళ్లను గుర్తు చేసే విధంగా లెన్స్ ప్లేస్‌మెంట్ ఉంది. కెమెరా డెకోలో మూడు వేర్వేరు లెన్స్ రింగ్స్‌తో పాటు ఒక LED ఫ్లాష్ కూడా ఉండటం గమనార్హం.
ప్రముఖ టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ వెల్లడించిన వివరాల ప్రకారం, భారత్‌లో లాంచ్ కానున్న Oppo Reno 15 Series 5Gలో నాలుగు మోడళ్లు ఉండనున్నాయి. అవి Reno 15, Reno 15 Pro, Reno 15c మరియు Reno 15 Pro mini.
ఈ నాలుగు స్మార్ట్‌ఫోన్లలోనూ AI Portrait Camera ఫీచర్ ఉండనుందని సమాచారం. ఇందులో Reno 15 Pro mini వేరియంట్‌లో 200 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ఉండే అవకాశం ఉంది. ఇక స్టాండర్డ్ Oppo Reno 15 మోడల్‌లో 120x పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉండొచ్చని, దీని ధర భారత మార్కెట్లో రూ. 50,000 లోపే ఉండే అవకాశముందని టిప్‌స్టర్ పేర్కొన్నారు.
అదే విధంగా, Reno 15c మోడల్‌లో భారీ 7,000mAh బ్యాటరీ ఉండొచ్చని, దీని ధర రూ. 40,000 లోపే ఉండే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు, Oppo Reno 15 Pro మోడల్‌లో వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వనున్నట్లు కూడా తెలుస్తోంది. మొత్తంగా చూస్తే, Oppo Reno 15 Series 5G భారత మార్కెట్లో డిజైన్, కెమెరా మరియు బ్యాటరీ పరంగా గట్టి పోటీ ఇవ్వబోతుందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రకటన
ప్రకటన