ఇటీవలి కాలంలో పెద్ద స్క్రీన్ ఫోన్లకు భిన్నంగా, సులభంగా చేతిలో పట్టుకునే చిన్న సైజ్ స్మార్ట్‌ఫోన్లపై వినియోగదారుల్లో మళ్లీ ఆసక్తి పెరుగుతోంది. ఈ ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకునే OPPO, Reno15 Pro Miniని మార్కెట్‌లోకి తీసుకురానుంది
OPPO త్వరలో భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా దాని మధ్య-శ్రేణి రెనో లైనప్‌ను రిఫ్రెష్ చేయనుంది.
భారత మార్కెట్ తో పాటు గ్లోబల్ స్థాయిలో తన Reno సిరీస్‌ను రిఫ్రెష్ చేయడానికి OPPO సిద్ధమవుతోంది. అయితే ఈసారి Reno లైనప్‌లో ఒక కీలకమైన మార్పు ఉండబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం సూచిస్తోంది. తొలిసారి Reno సిరీస్‌లో కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేయాలని OPPO ప్లాన్ చేస్తోంది. ఈ కొత్త మోడల్‌కు OPPO Reno15 Pro Mini అనే పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో పెద్ద స్క్రీన్ ఫోన్లకు భిన్నంగా, సులభంగా చేతిలో పట్టుకునే చిన్న సైజ్ స్మార్ట్‌ఫోన్లపై వినియోగదారుల్లో మళ్లీ ఆసక్తి పెరుగుతోంది. ఈ ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకునే OPPO, Reno15 Pro Miniని మార్కెట్‌లోకి తీసుకురానుంది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం, ఈ ఫోన్ కాంపాక్ట్ డిజైన్‌తో పాటు Reno సిరీస్‌కు ప్రత్యేకమైన ప్రీమియమ్ ఫీలింగ్‌ను తగ్గించకుండా రూపొందించబడుతోంది.
OPPO Reno15 Pro Miniలో 6.32 అంగుళాల AMOLED డిస్ప్లే ఇవ్వనున్నారు. ప్రస్తుతం ప్రమాణాల ప్రకారం ఇది కాంపాక్ట్ కేటగిరీకి చెందుతుంది. ఫోన్ బరువు సుమారు 187 గ్రాములు, మందం 7.99 మిల్లీమీటర్లు మాత్రమే ఉండనుంది. అంతేకాకుండా, 1.6 మిల్లీమీటర్ల పలుచని బెజెల్స్తో స్లీక్ లుక్‌ను అందించనుంది.
డిజైన్ పరంగా ఈ ఫోన్ ప్రత్యేకత ఏమిటంటే, గ్లేసియర్ వైట్ కలర్ వేరియంట్‌లో రిబ్బన్ డిజైన్ ఉండనుంది. ఈ డిజైన్ ప్రత్యేకంగా ఈ కలర్ మోడల్‌కే పరిమితం కానుంది. వెనుక భాగంలో గ్లాస్ ఫినిష్ ఉండటం ద్వారా Reno సిరీస్‌కు తెలిసిన ప్రీమియమ్ లుక్ కొనసాగనుంది. డిజైన్ విషయంలో Reno సిరీస్‌లో కొత్త ప్రయోగాలు చేయడంలో OPPOకి మంచి పేరు ఉంది.
దృఢత్వం విషయానికి వస్తే, Reno15 Pro Miniలో IP66, IP67, IP69 సర్టిఫికేషన్లు ఉండనున్నాయి. అంటే దుమ్ము, నీటిలో పడిన కూడా ఇది అత్యంత రక్షణ కలిగిన ఫోన్‌గా నిలవనుంది.
ఇంతకుముందు వచ్చిన నివేదికల్లో ఈ కాంపాక్ట్ ఫోన్‌కు OPPO Reno15 Mini అనే పేరు ఉండొచ్చని ప్రచారం జరిగింది. తరువాత లీకుల్లో సాధారణ Reno15నే కాంపాక్ట్ మోడల్ అవుతుందని వార్తలు వచ్చాయి. తాజా సమాచారం వీటన్నింటికీ స్పష్టత ఇస్తోంది. ఇప్పటికే Reno15 మరియు Reno15 Pro మోడళ్లను OPPO చైనాలో విడుదల చేసింది. అయితే అక్కడ Pro Mini మోడల్‌ను పరిచయం చేయలేదు, దీన్ని బట్టి ఈ కాంపాక్ట్ ఫోన్ కొన్ని ఎంపిక చేసిన మార్కెట్ల కోసమే రూపొందించబడినట్లు తెలుస్తోంది.
Reno15 Pro Miniకి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. అయితే గత లీకుల ఆధారంగా చూస్తే, OPPO ఈ సిరీస్‌ను ప్రాంతాల వారీగా భిన్నమైన హార్డ్‌వేర్‌తో విడుదల చేసే అవకాశం ఉంది. గ్లోబల్ మార్కెట్లలో Reno15 సిరీస్‌ను Snapdragon 7 Gen 4 ప్రాసెసర్‌తో తీసుకురావచ్చని సమాచారం. ఇది చైనాలో లభిస్తున్న MediaTek Dimensity 8450 చిప్‌సెట్‌కు భిన్నం.
ఇంకా, ఈ సిరీస్‌లోని ఒక మోడల్‌లో 6,500mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, అలాగే 50MP టెలిఫోటో లెన్స్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారత్‌లో ఈ Reno15 సిరీస్ డిసెంబర్‌లోనే లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని గత నివేదికలు సూచించాయి.
ప్రకటన
ప్రకటన