మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెస‌ర్‌తో భార‌త్‌లో అడుగుపెట్టిన‌ Oppo Reno 13 5G, Reno 13 Pro 5G

Oppo Reno 13 Pro 5Gలో సోనీ IMX890 ప్రైమరీ కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. అయితే, వెనిల్లా మోడల్‌లో మాత్రం డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది

మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెస‌ర్‌తో భార‌త్‌లో అడుగుపెట్టిన‌ Oppo Reno 13 5G, Reno 13 Pro 5G

Photo Credit: Oppo

Oppo Reno 13 5G సిరీస్ ఫ్లిప్‌కార్ట్ మరియు Oppo యొక్క ఆన్‌లైన్ స్టోర్ ద్వారా విక్రయించబడుతుంది

ముఖ్యాంశాలు
  • Oppo Reno 13 సిరీస్ Android 15 ఆధారంగా ColorOS 15పై ర‌న్ అవుతుంది
  • ఈ రెండు మోడళ్లలోనూ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు
  • Oppo Reno 13 5Gలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది
ప్రకటన

చైనాలో అరంగేట్రం చేసిన రెండు నెలల తర్వాత ఇండియా మార్కెట్‌లోకి Oppo Reno 13 5G, Reno 13 Pro 5Gలు విడుదల అయ్యాయి. ఈ కొత్త Reno సిరీస్ హ్యాండ్‌సెట్‌లు మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెస‌ర‌పై ర‌న్ అవుతాయి. అలాగే, 50-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌లను కలిగి ఉన్నాయి. Oppo Reno 13 Pro 5Gలో సోనీ IMX890 ప్రైమరీ కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. అయితే, వెనిల్లా మోడల్‌లో మాత్రం డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. ఇవి రెండూ 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు స‌పోర్ట్ చేస్తాయి.

రెండు మోడళ్లు జనవరి 11న‌

Oppo Reno 13 Pro 5G స్మార్ట్ ఫోన్‌ 12GB RAM + 256GB స్టోరేజ్ వెర్షన్ ధ‌ర‌ రూ. 49,999, 12GB + 512GB వేరియంట్ ధర రూ. 54,999గా ఉంది. గ్రాఫైట్ గ్రే, మిస్ట్ లావెండర్ కలర్ ఆప్షన్‌ల‌లో లభిస్తోంది. Oppo Reno 13 5G బేస్ మోడ‌ల్‌ 8GB + 128GB వేరియంట్ ధర రూ. 37,999, 8GB + 256GB ఆప్షన్ ధర రూ. 39,999గా నిర్ణ‌యించారు. ఇవి జనవరి 11, మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్‌తోపాటు Oppo ఆన్‌లైన్ స్టోర్ ద్వారా అమ్మకానికి అందుబాటులోకి వస్తున్నాయి.

120Hz వరకు రిఫ్రెష్ రేట్

డ్యూయల్ సిమ్ (నానో)తో Oppo Reno 13 5G సిరీస్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా కలర్‌ఓఎస్ 15పై ర‌న్ అవుతోంది. ప్రో మోడల్ 6.83-అంగుళాల 1.5K (1,272×2,800 పిక్సెల్స్) డిస్‌ప్లేను 120Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్‌తో 450ppi పిక్సెల్ డెన్సిటీ, 1200nits గరిష్ట బ్రైట్‌నెస్‌తో ఉంటుంది. స్టాండర్డ్ మోడల్ 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 460ppi పిక్సెల్ డెన్సిటీ, 1,200nits గరిష్ట బ్రైట్‌నెస్‌తో 6.59-అంగుళాల ఫుల్‌-HD+(1,256×2,760 పిక్సెల్స్) AMOLED స్క్రీన్‌తో వ‌స్తుంది.

ట్రిపుల్ కెమెరా యూనిట్‌తో

Oppo Reno 13 5G డ్యూయో 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్‌తో ప‌ని చేస్తుంది. ఇది 12GB LPPDR5X RAM, 512GB వరకు UFS 3 స్టోరేజ్‌తో అటాచ్ చేయ‌బ‌డింది. ప్రో మోడల్‌లో ట్రిపుల్ కెమెరా యూనిట్‌తో వ‌స్తుంది. ఇందులో 50-మెగాపిక్సెల్ సోనీ IMX890 1/1.56-అంగుళాల ప్రధాన కెమెరా OISతో, 50-మెగాపిక్సెల్ JN5 టెలిఫోటో సెన్సార్‌తో 3.5x ఆప్టికల్ జూమ్, 120x డిజిటల్ జూమ్, 8-మెగాపిక్సెల్ OV08D సెన్సార్ ఉన్నాయి.

మెరుగైన సిగ్నల్ కవరేజీ

Oppo Reno 13 5G సిరీస్‌ కనెక్టివిటీ ఆప్ష‌న్‌ల‌ను చూస్తే.. 5G, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, GPS, USB టైప్-C పోర్ట్‌లు ఉన్నాయి. రెండింటికీ దుమ్ము, నీటి నియంత్ర‌ణ కోసం వ‌రుస‌గా IP66+IP68+IP69 రేటింగ్‌లు క‌లిగి ఉన్నాయి. వీటిలో Oppo కస్టమ్-డెవలప్డ్ X1 నెట్‌వర్క్ చిప్ మెరుగైన సిగ్నల్ కవరేజీని అందిస్తోంది. Oppo Reno 13 Pro 5,800mAh బ్యాటరీ, వెనిల్లా మోడల్‌ 5,600mAh బ్యాటరీ క‌లిగి ఉంటుంది.

Comments

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. ఈ రెండు ఫోన్‌లు Android 16 బేస్డ్ HyperOS 3 పై నడుస్తాయి
  2. ఈ ఫోన్ కూడా అదే Dimensity 9500 చిప్‌సెట్ మరియు Android 16 OSపై నడుస్తుంది
  3. ఇది ప్రస్తుతం మిడ్‌నైట్ బ్లాక్ అనే ఒక్క కలర్ ఆప్షన్‌లో మాత్రమే కనిపిస్తుంది
  4. వాట్సప్‌లో కొత్త అప్డేట్ ఇదే.. ఈ విషయాలు తెలుసుకోండి
  5. మార్కెట్లోకి రెడ్ మీ వాచ్ 6.. అదిరే ఫీచర్స్
  6. వాట్సప్‌లో కొత్త అప్డేట్.. ఈ ఫీచర్ గురించి తెలుసా?
  7. జియో సావన్‌లో యాడ్ ఫ్రీ మ్యూజిక్.. ఈ వివరాలు తెలుసుకోండి
  8. స్క్రీన్-టు-బాడీ రేషియో 94.37%గా ఉంది, అంటే బెజెల్‌లు చాలా సన్నగా ఉంటాయి.
  9. అయితే, వైర్‌లెస్ చార్జింగ్ పై వివరాలు ఇంకా వెల్లడించలేదు.
  10. అదనంగా, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందించనున్నారు.
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »