భారతదేశంలో ప్రారంభించబడిన Poco F7 5G స్మార్ట్‌ఫోన్: స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 SoC, 7,550mAh బ్యాటరీ

ప్రముఖ చైనా మొబైల్ బ్రాండ్ పోకో తాజాగా భారత మార్కెట్‌తో పాటు ఇతర గ్లోబల్ మార్కెట్లలోకి తన కొత్త ఫ్లాగ్‌ షిప్ స్మార్ట్‌ఫోన్ పోకో F7 5G ను రివీల్ చేసింది.

భారతదేశంలో ప్రారంభించబడిన Poco F7 5G స్మార్ట్‌ఫోన్: స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 SoC, 7,550mAh బ్యాటరీ

Photo Credit: Poco

పోకో F7 5G IP66+IP68+IP69 దుమ్ము మరియు నీటి నిరోధక రేటింగ్‌లను కలుస్తుందని పేర్కొన్నారు

ముఖ్యాంశాలు
  • ఈ మొబైల్ 7550mAh బ్యాటరీ బ్యాకప్, 90W ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది
  • డిఫరెంట్ కలర్స్ లో అందుబాటులో ఉండనుంది
  • IP66, IP68, IP69 రేటింగ్ తో వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్
ప్రకటన

ప్రముఖ చైనా మొబైల్ బ్రాండ్ పోకో తాజాగా భారత మార్కెట్‌తో పాటు ఇతర గ్లోబల్ మార్కెట్లలోకి తన కొత్త ఫ్లాగ్‌ షిప్ స్మార్ట్‌ఫోన్ పోకో F7 5G ను రివీల్ చేసింది. ఈ ఫోన్ మామూలు ప్రీమియం ఫోన్‌ లతో పోలిస్తే తక్కువ ధరకే అత్యాధునిక ఫీచర్లను అందిస్తోంది. అల్యూమినియం మిడ్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్ తో స్టైలిష్ లుక్‌ను కలిగి ఉంది.పోకో F7 5G మొబైల్ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ ధర ఇండియాలో రూ.31,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇక 12GB RAM + 512GB వేరియంట్‌ ను రూ.33,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ జూలై 1 నుంచి ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంటుంది.ఈ మొబైల్ మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో దొరుకుతుంది. సైబర్ సిల్వర్ ఎడిషన్, ఫ్రాస్ట్ వైట్, ఫాంటమ్ బ్లాక్ రంగులలో ఇది లభించనుంది. పోకో ఎఫ్7 5G ఫోన్‌ డిస్ప్లే చేస్తే 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 2,560Hz టచ్ శాంప్లింగ్ రేట్, 3,840Hz PWM డిమ్మింగ్ 3,200 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఈ మొబైల్ డిస్‌ప్లే HDR10+ సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ కలిగి ఉంది. ఈ ఫోన్‌లో ఫ్లాగ్‌షిప్ లెవెల్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్ ఉంది. ఇది 12GB వరకు LPDDR5X RAM, 512GB వరకు UFS 4.1 స్టోరేజ్‌తో వస్తుంది.

ఇక ఆపరేటింగ్ సిస్టం విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 15 బేస్డ్ HyperOS 2.0తో ఈ ఫోన్ పనిచేస్తుంది. నాలుగేళ్ల పాటు కీ os అప్‌డేట్స్, ఆరు ఇయర్స్ సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను ఇస్తామని పోకో పేర్కొంది. ఇందులో గూగుల్ జెమిని, సర్కిల్ టూ సెర్చ్ వంటి ఆధునిక AI ఫీచర్లు ఉన్నాయి. దీనివల్ల ఏదైనా సెర్చ్ చేయాలంటే చాలా సులభంగా చేయవచ్చు. అదేవిధంగా, AI నోట్స్, AI ఇంటర్ప్రిటర్, AI ఇమేజ్ ఇన్హాన్స్ మెంట్, AI ఇమేజ్ ఎక్స్పెషన్ వంటి టూల్స్ కూడా సపోర్ట్ చేస్తుంది.

యూజర్ కి బెస్ట్ కెమెరా ఫీచర్స్ అందించేలా ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్ ఉన్న డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ చేసేవారికి ప్రత్యేకంగా ముందు భాగంలో 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ పోకో మొబైల్లో ప్రత్యేకంగా 3D ఐస్ లూప్ సిస్టమ్, 6,000mm² వేపర్ కూలింగ్ చాంబర్, AI-బ్యాక్డ్ టెంపరేచర్ కంట్రోల్ ఫీచర్లు ఉన్నాయి. దీనివల్ల ఫోన్ ఎక్కువసేపు యూస్ చేసిన హిట్ అవుతుంది అనే భయం లేదు. గేమింగ్ అభిమానుల కోసం ఇందులో వైల్డ్ బూస్ట్ ఆప్టిమైజేషన్ 3.0 ఫీచర్ ఉంది. ఇది గేమ్ ఆడేటప్పుడు లాగ్ లేకుండా చేస్తుంది.

ఇండియన్ వేరియంట్ కి ప్రత్యేకించి 7,550mAh బ్యాటరీ బ్యాకప్ ఇస్తున్నారు. ఇది 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, అలాగే 22.5W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. వీటితో ఫోన్ ఎక్కువసేపు ఉపయోగించుకోవచ్చు అలాగే వెంటనే ఛార్జింగ్ ర చేయవచ్చు. పోకో IP66, IP68, IP69 రైటింగ్స్ కలిగి ఉంది. వీటి వల్ల ఫోన్ నీటిలో పడిన దుమ్ము ధూళిలో పడిన ఎటువంటి టెన్షన్ పడవలసిన పని లేదు.

ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఇది 5G, 4G, వైఫై 7, బ్లూటూత్ 6.0, GPS, NFC USB Type-C పోర్ట్ వంటి ఆప్షన్లను అందిస్తుంది. ఈ ఫోన్ 222 గ్రాముల బరువుతో, 7.98mm డెన్సిటీతో వస్తుంది

మీరు గేమింగ్‌ లవర్స్ అయిన, మంచి కెమెరా కోసం చూస్తున POCO F7 5G మొబైల్ మీ కోసం బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

Comments
Facebookలో షేర్‌ Gadgets360 Twitter Shareట్వీట్ షేర్ Snapchat రెడ్డిట్ వ్యాఖ్యానించండి

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. దయచేసి మీ ఫోన్లను రీస్టార్ట్‌ చేయండి అని ఎయిర్‌టెల్ వినియోగదారులకు సూచించింది
  2. లీకైన ఒప్పో ఎఫ్ 31 సిరీస్.. అదిరే లుక్స్‌తో రానున్న న్యూ మోడల్స్
  3. హానర్ మ్యాజిక్ వి ఫ్లిప్ 2 న్యూ మోడల్.. సేల్ ఎప్పటి నుంచంటే
  4. ఇప్పుడు బెంగళూరులోని హెబ్బాళ్ స్టోర్ ఈ అనుభవాన్ని మరింత విస్తృతం చేయనుంది
  5. రత మార్కెట్‌లోకి గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఫోన్లు, అద్బుతమైన ఫీచర్లు, ఎక్కడ కొనుగోలు చేయవచ్చంటే?
  6. జెమినీ కెమెరా కోచ్, ఫేస్ అన్‌బ్లర్, మ్యాజిక్ ఈరేసర్ ఫీచర్లు ఫోటోలు అందంగా చేస్తాయి
  7. రూ. 249 ప్లాన్‌ను నిలిపి వేసిన ఎయిర్ టెల్
  8. ఇక కెమెరా విషయానికి వస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను సెట్ చేశారు
  9. అదిరే ఫీచర్స్, ధరతో హానర్ X7c 5G కొత్త మోడల్
  10. Apple IDని లింక్ చేయడం ద్వారా ఆపిల్ మ్యూజిక్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »