ఈ సిరీస్‌లో మూడు మోడల్స్ ఉండనున్నాయి...Poco F8, Poco F8 Pro, మరియు Poco F8 Ultra. అయితే, ప్రారంభ కార్యక్రమంలో పూర్తి స్థాయి లాంచ్ అయ్యేది కేవలం F8 Pro మరియు F8 Ultra మాత్రమే అన్న సమాచారముంది.
పోకో చివరకు పోకో F8 సిరీస్ లాంచ్ తేదీని నిర్ధారించింది.
Poco అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న F8 సిరీస్ చివరకు అధికారికంగా లాంచ్‌కు సిద్ధమైంది. కంపెనీ విడుదల చేసిన తాజా పోస్టర్ ప్రకారం, నవంబర్ 26న బాలి (ఇండోనేషియా)లో జరిగే గ్లోబల్ ఈవెంట్‌లో ఈ కొత్త సిరీస్‌ను పరోక్షంగా ఆవిష్కరించబోతోంది. ఈ ఈవెంట్‌పై ఇప్పటికే టెక్ వర్గాల్లో ఆసక్తి వెల్లువెత్తుతోంది. ఈ సిరీస్‌లో మూడు మోడల్స్ ఉండనున్నాయి...Poco F8, Poco F8 Pro, మరియు Poco F8 Ultra. అయితే, ప్రారంభ కార్యక్రమంలో పూర్తి స్థాయి లాంచ్ అయ్యేది కేవలం F8 Pro మరియు F8 Ultra మాత్రమే అన్న సమాచారముంది. సాధారణ Poco F8 వేరియంట్‌ను కంపెనీ మరొక తేదీకి వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయి.ఇటీవల చైనాలో విడుదలైన Redmi K90 మరియు K90 Pro Max మోడల్స్‌కు Poco F8 Pro, F8 Ultra లు ట్వీక్ చేసిన గ్లోబల్ వెర్షన్లు అని రిపోర్ట్స్ చెబుతున్నాయి. డిజైన్, ప్రాసెసర్, కెమెరాల పరంగా చూస్తే దాదాపు ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. అయితే బ్యాటరీ విషయంలో మాత్రం Poco మోడల్స్ కొంచెం చిన్న సైజ్‌తో రావచ్చని లీకులు సూచిస్తున్నాయి.
Poco F8 మోడల్‌లో 6.59 అంగుళాల OLED స్క్రీన్, F8 Ultraలో మరింత పెద్దదైన 6.9 అంగుళాల OLED డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. రెండు మోడల్స్ కూడా 1.5K రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌ని అందిస్తాయని సమాచారం.
ఇక సాఫ్ట్వేర్ విషయానికి వస్తే... HyperOS 3 ఆధారంగా పనిచేసే Android 16తో ఈ రెండు ఫోన్లు బాక్స్ నుంచే రానున్నాయి. యూజర్ ఇంటర్‌ఫేస్ మరింత సాఫ్ట్‌గా, ఫ్లూయిడ్‌గా ఉండేలా షియోమి పెద్ద ఎత్తున ఆప్టిమైజేషన్లు చేసిందని తెలుస్తోంది.
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, Poco F8లో Snapdragon 8 Elite, అల్ట్రా వేరియంట్‌లో అయితే మరింత శక్తివంతమైన Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌ను ఉపయోగిస్తున్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. గేమింగ్, మల్టీటాస్కింగ్, హెవీ యూజ్ ఏ విషయంలోనైనా టాప్-క్లాస్ పనితీరు అందించగల సామర్థ్యం వీటికి ఉంది.
ఈ ఫోన్లో కెమెరాలు చూస్తే...సెల్ఫీ కోసం రెండు మోడల్స్‌లో 20MP ఫ్రంట్ కెమెరా ఉండనుంది. Poco F8 Pro వెనుక వైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి...అవి 50MP మెయిన్ కెమెరా (OISతో), 8MP అల్ట్రా-వైడ్, 50MP 2x టెలిఫోటో కెమెరా ఏర్పాటు చేయనున్నారు.
F8 Ultraలో మాత్రం మూడు కెమెరాలూ 50MP సెన్సర్లుతోనే వస్తాయి. మెయిన్, అల్ట్రా-వైడ్ మరియు పెరిస్కోప్ టెలిఫోటో. ఇది జూమ్ ఫోటోగ్రఫీని మరింత నెక్స్ట్-లెవల్‌కి తీసుకెళ్లే అవకాశం ఉంది. అదనంగా, సాధారణ స్పీకర్లతో పాటు మరొక ప్రత్యేక రియర్ స్పీకర్‌ను కూడా Ultra వేరియంట్‌లో అందించబోతున్నారు.
ఇక బ్యాటరీ బ్యాకప్ చూస్తే..రెండు మోడల్స్ కూడా 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి. Ultra వేరియంట్‌లో అదనంగా 50W వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా లభించనుంది. ఈసారి Poco F8 Pro మరియు F8 Ultra మోడల్స్ గ్లోబల్ మార్కెట్‌లో మంచి హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఇండియాలో ఇవి ఎప్పుడు లాంచ్ అవుతాయన్నది మాత్రం అధికారికంగా వెల్లడించలేదు.
ప్రకటన
ప్రకటన