భారతదేశంలో Oppo Reno 15 5G ధరలు 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌కు రూ.45,999 నుంచి ప్రారంభమవుతున్నాయి.
Photo Credit: Oppo
ఒప్పో రెనో 15 ప్రో మినీ 5G అనేది భారతదేశంలో కంపెనీ రెనో లైనప్‌లో ఒక సరికొత్త మోడల్.
భారత మార్కెట్‌లో Oppo తన తాజా Reno 15 సిరీస్ 5G స్మార్ట్‌ఫోన్‌లను గురువారం అధికారికంగా విడుదల చేసింది. గతంలో వచ్చిన Reno 14 సిరీస్‌కు వారసులుగా వచ్చిన ఈ లైనప్‌లో Oppo Reno 15, Reno 15 Pro, Reno 15 Pro Mini మరియు Reno 15C అనే నాలుగు మోడళ్లను పరిచయం చేసింది. ఇందులో Reno 15, Reno 15 Pro మోడళ్లు అప్‌గ్రేడ్ ఫీచర్లతో రాగా, Reno 15 Pro Mini 5G మోడల్‌ను భారత్‌లో తొలిసారిగా ప్రవేశపెట్టింది. ఈ సిరీస్ మొత్తం Android 16 ఆధారిత ColorOS 16 పై పనిచేస్తుంది. ధరల విషయానికి వస్తే, Oppo Reno 15 5G 8GB + 256GB వేరియంట్ ధర రూ.45,999 నుంచి ప్రారంభమవుతుంది. 12GB + 256GB వేరియంట్ ధర రూ.48,999 కాగా, 12GB + 512GB వేరియంట్ ధర రూ.53,999. ఇక Oppo Reno 15 Pro 5G ప్రారంభ ధర రూ.67,999 కాగా, Reno 15 Pro Mini 5G ధర రూ.59,999గా ఉంది. ఈ ఫోన్లు ఫిబ్రవరి 13 నుంచి Flipkart, Amazon, Oppo India ఆన్‌లైన్ స్టోర్‌లలో అమ్మకాలకు అందుబాటులోకి రానున్నాయి.
Reno 15 Pro మరియు Reno 15 Pro Mini ఫోన్లు డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో వస్తాయి. Reno 15 Pro లో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ LTPO AMOLED డిస్‌ప్లే ఉంది. దీనికి 120Hz రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, Gorilla Glass Victus 2 రక్షణ ఉన్నాయి. Reno 15 Pro Mini లో 6.32 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేను అందించారు. దీనికీ 120Hz రిఫ్రెష్ రేట్, Gorilla Glass 7 ప్రొటెక్షన్ ఉన్నాయి.
ఈ రెండు మోడళ్లలో MediaTek Dimensity 8450 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. Mali-G720 MC7 GPUతో కలిసి ఇవి 12GB RAM, గరిష్టంగా 512GB స్టోరేజ్‌తో వస్తాయి. కెమెరా విభాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో OIS తో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్, 3.5x ఆప్టికల్ జూమ్ ఉన్న 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. అన్ని కెమెరాలు 4K 60fps HDR వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తాయి.
కనెక్టివిటీకి Wi-Fi 6, Bluetooth 5.4, GPS, NFC, USB Type-C ఉన్నాయి. భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, X-Axis లీనియర్ మోటర్ అందించారు. ఈ ఫోన్లు IP68 + IP69 రేటింగ్‌తో నీరు, ధూళి నిరోధకతను కలిగి ఉంటాయి. Reno 15 Pro లో 6,500mAh, Pro Mini లో 6,200mAh బ్యాటరీలు ఉన్నాయి. రెండింటిలోనూ 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ ఉండగా, Pro మోడల్‌లో 50W వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంది.
ఇక Oppo Reno 15 5G లో 6.59 అంగుళాల LTPS AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ బ్రైట్‌నెస్, Gorilla Glass 7i ప్రొటెక్షన్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో Snapdragon 7 Gen 4 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 12GB LPDDR5X RAM, 512GB UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుంది. కెమెరా సెటప్‌లో OIS తో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ 3.5x పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇందులో 6,500mAh బ్యాటరీతో పాటు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించారు.
ces_story_below_text
ప్రకటన
ప్రకటన
YouTube Updates Search Filters With New Shorts Option and Simplified Sorting