ఇది Redmi K90 Pro Max ఫోన్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఉండే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తోంది.

ఇంతలో Poco F8 Ultra గీక్‌బెంచ్‌లో దర్శనమిచ్చింది. సాధారణంగా గీక్‌బెంచ్ పరీక్షల్లో కనిపించిన ఫలితాలు ఫోన్‌లో ఉన్న అసలు చిప్‌సెట్, ర్యామ్ వివరాలను ముందుగానే బయటపెడుతుంటాయి. ఈసారి కూడా అదే జరిగింది. F8 Ultraలో Qualcomm యొక్క తాజా, శక్తివంతమైన Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్ ఉపయోగించినట్లు తేలింది.

ఇది Redmi K90 Pro Max ఫోన్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఉండే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తోంది.

Photo Credit: Poco

పోకో ఎఫ్ 8 అల్ట్రా మరియు పోకో ఎఫ్ 8 ప్రో త్వరలో లాంచ్ కావచ్చు.

ముఖ్యాంశాలు
  • Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్, 16GB RAMతో అగ్రశ్రేణి పనితీరు
  • 6.9 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 120Hz రీఫ్రెష్ రేట్, 3,500 నిట్స్ బ్రైట్‌నె
  • 7,560mAh బ్యాటరీ, 100W వైర్డ్ & 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్
ప్రకటన

Poco అభిమానులకు శుభవార్త. Poco F8 Ultra మరియు Poco F8 Pro త్వరలోనే మార్కెట్లోకి అడుగుపెట్టనున్నట్లుగా తాజా సంకేతాలు చెబుతున్నాయి. గత ఏడాది విడుదలైన మోడళ్ల‌కు ఒక సంవత్సరం కాకుండానే ఇవి రావడం ఆసక్తికర అంశంగా మారింది. అధికారికంగా కంపెనీ ఎలాంటి ప్రకటన చేయకపోయినా, ఈ రెండు ఫోన్లు పలు అంతర్జాతీయ సర్టిఫికేషన్లు పూర్తిచేసుకోవడం, అలాగే F8 Pro బాక్స్‌లో “Sound by Bose” అనే బ్రాండింగ్ కనిపించడం వల్ల ఈ సమాచారం మరింత బలపడింది. ఇంతలో Poco F8 Ultra గీక్‌బెంచ్‌లో దర్శనమిచ్చింది. సాధారణంగా గీక్‌బెంచ్ పరీక్షల్లో కనిపించిన ఫలితాలు ఫోన్‌లో ఉన్న అసలు చిప్‌సెట్, ర్యామ్ వివరాలను ముందుగానే బయటపెడుతుంటాయి. ఈసారి కూడా అదే జరిగింది. F8 Ultraలో Qualcomm యొక్క తాజా, శక్తివంతమైన Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్ ఉపయోగించినట్లు తేలింది. టెస్ట్‌లో కనిపించిన యూనిట్‌లో 16GB RAM ఉండగా, డివైస్ Android 16 పై నడుస్తోంది. లాంచ్ సమయానికి Xiaomi యొక్క HyperOS 3 ఈ ఫోన్‌లో ఉండటం ఖాయం.

ఇవి చూస్తుంటే Poco F8 Ultra పనితీరు విషయంలో అగ్రశ్రేణి మోడళ్ల సరసన నిలబడేందుకు సిద్ధంగా ఉందని స్పష్టమవుతోంది. అయితే, మిగతా పూర్తి స్పెసిఫికేషన్లు ఇంకా బయటకు రాలేదు. కానీ లీకులు చెబుతున్న దాని ప్రకారం ఇది Redmi K90 Pro Max ఫోన్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఉండే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తోంది.

అది నిజమైతే, F8 Ultraలో 6.9 ఇంచుల భారీ AMOLED డిస్‌ప్లే, 1200x2608 రిజల్యూషన్, 120Hz రీఫ్రెష్ రేట్, 3,500-నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి ఫీచర్లు రావచ్చు. అలాగే 2,560Hz PWM డిమ్మింగ్ వల్ల కళ్ళకు మరింత సౌకర్యవంతమైన విజువల్ అనుభవం లభిస్తుందని ఊహిస్తున్నారు. స్టోరేజ్ విషయానికి వస్తే 1TB వరకు అవకాశం ఉండొచ్చు.

కెమెరా విభాగంలో కూడాను పూర్-ఫ్లాగ్‌షిప్ లెవెల్ సెటప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వెనుక వైపున 50MP OISతో మెయిన్ కెమెరా, 50MP 5x ఆప్టికల్ జూమ్ పెరిస్కోప్ టెలిఫోటో, 50MP అల్ట్రావైడ్ మొత్తం మూడు కెమెరాలు ఉండవచ్చు. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా అందించే అవకాశం ఉంది.

ఆడియో విషయంలో Poco F8 Ultra మరింత ప్రత్యేకంగా నిలబడనుంది. Bose బ్రాండెడ్ సౌండ్ సిస్టమ్, రెండు స్టీరియో స్పీకర్లు, అదనంగా వెనుక భాగంలో ఒక ప్రత్యేక వూఫర్ ఇవ్వబోతున్నట్లు లీకులు సూచిస్తున్నాయి. బ్యాటరీ పరంగా 7,560mAh భారీ సామర్థ్యం, 100W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా అందే అవకాశం ఉంది.

మొత్తంగా చూస్తే, Poco F8 Ultra పూర్తి స్థాయి ప్రీమియం ఫోన్‌గా మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బయటపడిన వివరాలన్ని చూస్తే పనితీరు, డిస్‌ప్లే, కెమెరాలు, బ్యాటరీ అన్నీ ఫ్లాగ్‌షిప్ స్టాండర్డ్‌లో ఉన్నాయి. Xiaomi నుండి అధికారిక ప్రకటన వచ్చేవరకు ఇవన్నీ లీకులు మాత్రమే అయినా, Poco అభిమానులలో భారీ ఆసక్తిని రేకిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. ఇది Redmi K90 Pro Max ఫోన్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఉండే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తోంది.
  2. కళ్లు చెదిరే ధరతో వన్ ప్లస్ 15 .. కొత్త మోడల్ ప్రత్యేకతలివే
  3. సామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 26 ఎప్పుడు రానుందంటే?.. మార్కెట్లోకి రాకముందే ఈ అప్డేట్ తెలుసుకోండి
  4. చైనాలో Reno 15 మోడల్ స్టార్ లైట్ బౌ, అరోరా బ్లూ, కానెలె బ్రౌన్ అనే మూడు రంగులలో అమ్మకానికి రానుందని సమాచారం
  5. itel A90 Limited Edition (128GB) ను కంపెనీ రూ. 7,299 ధరకు అందుబాటులోకి తెచ్చింది.
  6. 200MP కెమెరాతో రానున్న వివో ఎక్స్ 300.. ఈ ఫీచర్ గురించి తెలుసా?
  7. ఆ పోస్ట్‌పై వచ్చిన కామెంట్లలో చాలా మంది యూజర్లు “240Hz రిఫ్రెష్ రేట్ అవసరమేనా?” అనే ప్రశ్నలతో స్పందించారు.
  8. అదిరే ఫీచర్స్‌తో రియల్ మీ నియో 8.. ధర ఎంతో తెలుసా?
  9. iQOO 15 భారత్‌లో సుమారు రూ.60,000 ధరతో లాంచ్ కానుంది. అయితే ఈ ధర ప్రారంభ ఆఫర్లతో మాత్రమే వర్తిస్తుంది.
  10. ప్రస్తుతం Apple తన Dynamic Island ద్వారా ఫ్రంట్ కెమెరా కట్‌అవుట్‌ను దాచిపెడుతోంది.
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »