Photo Credit: Poco
పోకో M7 5G మింట్ గ్రీన్, ఓషన్ బ్లూ మరియు శాటిన్ బ్లాక్ షేడ్స్‌లో వస్తుంది.
ఇండియాలో Poco M7 5G హ్యాండ్‌సెట్ లాంఛ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్, దుమ్ము- స్ప్లాష్ నియంత్రణకు IP52-రేటెడ్ బిల్డ్, 5,160mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తోంది. దీనికి 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్, 8-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌ను అందించారు. అలాగే, ఈ ఫోన్ సెగ్మెంట్‌లో అతిపెద్ద డిస్‌ప్లేతో వస్తుందని, ట్రిపుల్ TÜV రీన్‌ల్యాండ్ సర్టిఫికేషన్‌లను కలిగి ఉందని కంపెనీ వెల్లడించింది. ఇది గత ఏడాది డిసెంబర్‌లో మన దేశంలో విడుదలైన Poco M7 Pro 5G ఫోన్ వేరియంట్‌లో చేరింది.
Poco M7 5G ఫోన్ భారత్‌లో 6GB + 128GB ఆప్షన్ ధర రూ. 9,999 నుండి ప్రారంభమవుతుంది. అలాగే, 8GB వేరియంట్ ధర రూ. 10,999గా ఉంది. ఈ ధరలు మొదటి రోజు సేల్‌కు మాత్రమే వర్తిస్తాయి. Poco M7 5G మార్చి 7 మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ మింట్ గ్రీన్, ఓషన్ బ్లూ, శాటిన్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుందని కంపెనీ ప్రకటించింది.
కొత్త Poco M7 5G హ్యాండ్‌సెట్ 6.88-అంగుళాల HD+ (720 x 1,640 పిక్సెల్స్) డిస్‌ప్లేతో వస్తుంది. అలాగే, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 600 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ లెవల్, TÜV రీన్‌ల్యాండ్ లో బ్లూ లైట్, ఫ్లికర్ ఫ్రీ, సిర్కాడియన్ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. ఇది 8GB వరకు RAM, 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో అటాచ్ చేయబడిన ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ ద్వారా శక్తిని గ్రహిస్తుంది. అలాగే, ఈ ఫోన్ Android 14-ఆధారిత HyperOS తో వస్తోంది.
ఈ మోడల్ కెమెరా విషయానికి వస్తే.. Poco M7 5G ఫోన్ 50-మెగాపిక్సెల్ సోనీ IMX852 ప్రైమరీ సెన్సార్, సెకండరీ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు. ఫోన్ వెనుక, ముందు రెండు కెమెరాలు 30fps వద్ద 1080p వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.
Poco M7 5G ఫోన్ 18W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,160mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అయితే, ఫోన్ బాక్స్‌లో 33W ఛార్జర్‌తో వస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్స్‌ను చూస్తే.. 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5.0, GPS, GLONASS, 3.5mm ఆడియో జాక్, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. సెక్యూరిటీ కోసం హ్యాండ్‌సెట్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అందించారు. దుమ్ము- స్ప్లాష్ నియంత్రణకు IP52 రేటింగ్‌ను కలిగి ఉంది. అలాగే, ఈ ఫోన్ 171.88x77.8x8.22mm పరిమాణంతో 205.39 గ్రాములు బరువు ఉంటుంది.
ప్రకటన
ప్రకటన