Photo Credit: Poco
Poco X7 5G సిరీస్‌ను భారత్ మొబైల్ మార్కెట్‌లోకి ఈ జనవరి 9న లాంచ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ లైనప్‌లో బేస్ Poco X7 5Gతో పాటు Poco X7 Pro 5G వేరియంట్ ఉంది. మన దేశంలో ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్‌లు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. తాజాగా, రాబోయే రెండు స్మార్ట్ ఫోన్‌ల డిజైన్‌లను కంపెనీ అధికారికంగా టీజ్ చేసింది. అంతేకాదు, ప్రో మోడల్ ప్రాసెసర్ వివరాలను కూడా వెల్లడించింది. Poco X7 5G సిరీస్ హ్యాండ్‌సెట్‌ల ఫీచర్స్‌కు సంబంధించి గతంలోనే అనేక లీక్‌లు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. Poco X7 5G సిరీస్‌కు సంబంధించిన పలు కీలక విషయాలను తెలుసుకుందాం రండి!
తాజాగా కంపెనీ X పోస్ట్ ద్వారా Poco X7 5G, Poco X7 Pro 5G డిజైన్‌ను టీజ్ చేసింది. అంతేకాదు, సంబంధిత ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్‌లలో కూడా హ్యాండ్‌సెట్‌లు లిస్ట్‌వుట్ చేయబడ్డాయి. వీటిలో బేస్ వేరియంట్ సెంటర్డ్, స్క్విర్కిల్ వెనుక కెమెరా మాడ్యూల్‌తో కనిపిస్తోంది. అలాగే, ప్రో మోడల్ వెనుక ప్యానెల్ ఎగువ ఎడమవైపున వృత్తాకార కెమెరా స్లాట్‌లతో పిల్-షేపుడ్ డిజైన్‌తో ఉంది. ఈ రెండు ఫోన్‌లు కూడా బ్రాండ్ సిగ్నేచర్‌తో నలుపు, పసుపు రంగుల్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ మోడల్స్ వెలుపల ప్యానెల్ ఫినిషింగ్ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
మీడియాటెక్ డైమెన్సిటీ 8400-అల్ట్రా ప్రాసెసర్ ద్వారా Poco X7 Pro 5G స్మార్ట్ ఫోన్ అందించబడుతుందని కంపెనీ మరొక పోస్ట్‌ను విడుదల చేసింది. అలాగే, వనిల్లా మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300-అల్ట్రా ప్రాసెసర్‌తో వస్తున్నట్లు గతంలో పలు లీక్‌లు ద్వారా ప్రచారం అయ్యింది. ఈ లీక్‌లు బేస్ Poco X7 5G సిల్వర్, ఆకుపచ్చ కలర్ ఆప్షన్స్‌తో రావచ్చని కూడా వెల్లడించాయి. అలాగే, ప్రో వేరియంట్ డ్యూయల్-టోన్ బ్లాక్, గ్రీన్ కలర్‌వేలో వస్తున్నట్లు తెలిపాయి.
50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కొత్త Poco X7 5G సిరీస్ హ్యాండ్‌సెట్‌లకు అందిస్తున్నట్లు డిజైన్ టీజర్ ద్వారా స్పష్టమైంది. అలాగే, ప్రో వెర్షన్ సోనీ IMX882 సెన్సార్‌తో వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక వనిల్లా విషయానికి వస్తే.. ఇవి 20-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌తో రావచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌లు IP68-రేటెడ్ బిల్డ్‌లను కూడా పొందే అవకాశం ఉన్నట్లు అంచనా.
బేస్ Poco X7 5G కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటక్షన్‌తో 6.67-అంగుళాల 120Hz AMOLED 1.5K డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. పొందుతుంది. అలాగే, ప్రో మోడల్ 6.67-అంగుళాల CrystalRez 1.5K AMOLED స్క్రీన్‌తో వస్తుంది. Poco X7, X7 Proలకు వరుసగా 45W, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,110mAh, 6,000mAh బ్యాటరీలను అందించే అవకాశం ఉంది.
ప్రకటన
ప్రకటన