Photo Credit: Vivo
వివో Y300 GT నలుపు మరియు షాంపైన్ బంగారు రంగులలో రానుంది
చైనాలో గత సంవత్సరం సెప్టెంబర్, డిసెంబర్ వరుస నెలల్లో Vivo Y300, Vivo Y300 ప్రో కంపెనీ లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే Vivo Y300 ప్రో+, Vivo Y300t మోడల్స్‌ను కూడా కంపెనీ పరిచయం చేసింది. ఇప్పుడు తాజాగా, Vivo Y300 GT పేరుతో కొంత మోడల్‌ను లాంఛ్ చేసేందుకు సిద్ధమైంది. రాబోయే మొబైల్ లాంఛ్ తేదీతోపాటు కీలకమైన ఫీచర్స్‌ను కూడా కంపెనీ వెల్లడించింది. ఆ వివరాలను బట్టీ.. రాబోయే వేరియంట్ iQOO Z10 టర్బో రీబ్రాండెడ్ వెర్షన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మోడల్ ఇటీవలే ప్రో వెరియంట్‌తోపాటు లాంఛ్ అయ్యింది.మే 9న ఉదయం 10 గంటలకు,చైనాలో Vivo Y300 GT స్మార్ట్ ఫోన్ మే 9న ఉదయం 10 గంటలకు విడుదల కానున్నట్లు వీబో పోస్ట్‌లో కంపెనీ వెల్లడించింది. క్వాలిటీ ఆడియో విజువల్ మోడల్‌గా దీనిని చూడొచ్చని స్పష్టం చేసింది. దీని ప్రమోషన్‌లో ఇమేజ్‌తోపాటు ఈ ఫోన్ నలుపు, షాంపైన్ గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో కనిపించింది. అలాగే, Vivo Y300 GT ఫోన్ చైనాలో లాంఛ్ అయిన iQOO Z10 హ్యాండ్‌సెట్‌ను పోలీ ఉంది. లాంఛ్‌కు ముందు ఈ మోడల్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు బహిర్గతం అయ్యే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రమోషన్ ఇమేజ్‌తో రెండు కెమెరా సెన్సార్‌లతోపాటు రింగ్‌లా కనిపిస్తోన్న ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌తో ఆకర్షణీయంగా ఉంది. అలాగే, దీంతోపాటు కుడిపైపు అంచున పవర్ బటన్, వాల్యూమ్ రాకర్‌లను అందించారు. తాజాగా, టీమాల్ ప్రొడక్ట్ పేజీలో కనిపిస్తోన్న టీజర్ ఇమేజీలో రాబోయే Vivo Y300 GT స్మార్ట్ ఫోన్ డిస్‌ప్లే చూసేందుకు చాలా స్లిమ్ బెజెల్స్‌తో ఫ్లాట్ డిస్‌ప్లే, కొంచెం మందమైన చిన్, టాప్‌లో సెంటర్ అలైన్డ్ హోల్ పంచ్ కటౌట్‌తో సందడి చేస్తోంది.
ఈ మొబైల్ 90 W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7620 mAh భారీ బ్యాటరీ సామర్థ్యంతోపాటు మీడియాటెక్ డైమెన్సిటీ 8400 ప్రాసెసర్‌తో రానున్నట్లు స్పష్టం అయ్యింది. కొత్త Vivo Y300 GT స్మార్ట్ ఫోన్ బేస్ QOO Z10 టర్బో మోడల్ హ్యాండ్‌సెట్ మాదిరిగా ఉన్నట్లు కొన్ని కీలకమైన స్పెషిఫికేషన్స్ సూచిస్తున్నాయి. అయితే, ఇందుకు సంబంధించిన నిర్థారణ లేనప్పటికీ, చర్చ మాత్రం పెద్ద ఎత్తున జరుగుతోంది.
అదే నిజమైతే మాత్రం.. రాబోయే Vivo Y300 GT స్మార్ట్ ఫోన్ 50- మెగాపిక్సెల్ సోనీ ఎల్‌వైటీ 600 ప్రైమరీ వెనుక సెన్సార్‌తోపాటు 2- మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 16- మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌తో వచ్చే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే, ఈ మొబైల్ ఎస్‌జీఎస్‌తో బ్లూలైట్, లో ప్లికర్ సర్టిఫికేషన్‌లతో 6.78 అంగుళాల 144 హెచ్‌జెడ్ 1.5కే AMOLED స్క్రీన్‌తో వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన