Photo Credit: OnePlus
చైనాలో OnePlus 12కి కొనసాగింపుగా OnePlus 13ని త్వరలోనే లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ గతంలోనే ఈ రాబోయే హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన డిస్‌ప్లే వివరాలను అధికారికంగా వెల్లడించింది. తాజాగా, OnePlus సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఈ ఫోన్‌కు చెందిన ఛార్జింగ్ ఫీచర్‌ను వెల్లడించారు. అలాగే, బ్యాటరీ పరిమాణంతో సహా స్మార్ట్‌ఫోన్ ఇతర స్పెసిఫికేషన్‌లు కూడా లీక్ అయ్యాయి. OnePlus 13 Qualcomm స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ ద్వారా ద్వారా శక్తిని పొందుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్ వేదికగా ఈ మోడల్‌కు సంబంధించిన పలు ఆసక్తిరమైన విషయాలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ వివరాలను చూసేద్దామా?!
OnePlus 13 వినియోగదారులు magnetic suction సపోర్ట్‌తో వుడ్ గ్రెయిన్ ఫోన్ కేస్‌లను కొనుగోలు చేసుకోవచ్చని OnePlus చైనా హెడ్ లూయిస్ లీకి చెందిన Weibo పోస్ట్ తెలిపింది. ఈ పోస్ట్‌లో మరొక Weibo వినియోగదారుతో లీ సంభాషించారు. దాని ప్రకారం.. మాగ్నెటిక్ సక్షన్ ఫంక్షన్ మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను సూచిస్తుంది. ఇది Apple MagSafe కేసుల మాదిరిగానే కార్ మౌంట్‌లు, వాలెట్ కేసుల వంటి ఇతర ఉపకరణాలకు సపోర్ట్ చేసే అవకాశం ఉండవచ్చు. ముఖ్యంగా, రాబోయే Oppo Find X8 సిరీస్ 50W వైర్‌లెస్ మాగ్నెటిక్ ఛార్జింగ్‌తోపాటు రివర్స్ ఛార్జింగ్ సామర్థ్యాలకు సపోర్ట్ చేస్తుందని Oppo సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇటీవల స్పష్టం చేశారు.
ఈ OnePlus 13 స్మార్ట్‌ఫోన్ 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని పొందవచ్చని గతంలో వచ్చిన లీక్‌ల ఆధారంగా తెలుస్తోంది. అలాగే, OnePlus 12 హ్యాండ్‌సెట్ 100W వైర్డు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,400mAh బ్యారటీ సెల్‌తో రూపొందించారు. తాజా OnePlus 13 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.82-అంగుళాల 2K 10-బిట్ LTPO BOE X2 మైక్రో క్వాడ్ కర్వ్డ్ OLED డిస్‌ప్లేతో వస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ రాబోయే హ్యాండ్‌సెట్ కోసం లీ గతంలోనే BOE X2 స్క్రీన్ వస్తుందని ధృవీకరించారు. ఇప్పుడు దాని మీదే పెద్ద చర్చ నడుస్తోంది.
అలాగే, OnePlus స్మార్ట్‌ఫోన్ 13 Qualcomm స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్‌తో పాటు గరిష్టంగా 24GB RAM, 1TB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజీతో అందించబడుతుందని గతంలో వచ్చిన లీక్‌లు పేర్కొన్నాయి. ఇక కెమెరా విషయానికి వస్తే.. ఇది 50-మెగాపిక్సెల్ Sony LYT-808 ప్రైమరీ సెన్సార్, అల్ట్రా-వైడ్ లెన్స్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో షూటర్‌తో సహా ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌తో వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇది ముమ్మాటికీ, వినియోగదారులకు మంచి వార్తనే చెప్పొచ్చు. ఈ మోడల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మత్రం కంపెనీ అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే!
ప్రకటన
ప్రకటన