భారతీయ మొబైల్ మార్కెట్‌లో Qualcomm నుండి స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వచ్చిన రెండవ స్మార్ట్ ఫోన్‌గా iQOO 13 లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ మూడు 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరాలతో రూపొందించబడి ఉంటుంది. అలాగే, 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.82-అంగుళాల AMOLED స్క్రీన్‌తో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇది Vivo Funtouch OS 15 స్కిన్‌తో పాటు Android 15పై రన్ అవుతోంది. కంపెనీ 120W వద్ద ఛార్జ్ చేయగల 6,000mAh బ్యాటరీని అందిస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ దుమ్ము, నీటిని నియంత్రించేందుకు IP68, IP69 రేటింగ్‌లను కలిగి ఉంది.
భారతీయ మార్కెట్‌లో iQOO 13 స్మార్ట్‌ఫోన్ 12GB RAM, 256GB స్టోరేజీ వేరియంట్ ధర 54,999గా ఉంది. అలాగే, హ్యాండ్‌సెట్ 16GB+512GB వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంది. దీని ధర రూ. 59,999గా నిర్ణయించారు. ఇది లెజెండ్, నార్డో గ్రే రంగులలో వస్తుంది. కొనుగోలుదారులకు అమెజాన్‌తోపాటు iQOO ఈ-స్టోర్ ద్వారా డిసెంబర్ 11న మధ్యాహ్నం 12 గంటలకు iQOO 13 అందుబాటులో ఉంటుంది. అలాగే, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులు రూ.3000 తగ్గింపును పొందొచ్చు. Vivo, iQOO మొబైల్ వినియోగదారులు తమ పాత హ్యాండ్‌సెట్‌ని అందించి ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో రూ. 5000 వరకూ తగ్గింపును సొంతం చేసుకోవచ్చు.
ఈ ఫోన్‌లో డ్యూయల్ సిమ్ (నానో+నానో), Android 15-ఆధారిత Funtouch OS 15పై రన్ అవుతుంది. అలాగే, ఫోన్‌కు నాలుగు Android సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లతోపాటు ఐదు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లు అందించనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఈ హ్యాండ్‌సెట్ 6.82-అంగుళాల 2K (1,440x3,186 పిక్సెల్‌లు) LTPO AMOLED స్క్రీన్‌తో 144Hz రిఫ్రెష్ రేట్, 510ppi పిక్సెల్ డెన్సిటీ, 1,800నిట్స్ హై బ్రైట్‌నెస్ మోడ్‌తో వస్తుంది.
దీనిలో 12GB వరకు LPDDR5X అల్ట్రా RAM, 512GB వరకు UFS 4.1 స్టోరేజీని అందించారు. ఈ iQOO 13 కూడా iQOO Q2 చిప్‌ని కలిగి ఉంటుంది. ఇది గేమింగ్ పనితీరును మరింత మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. అలాగే, వేడిని నియంత్రించేందుకు 7,000 sq mm స్టీమ్ ఛాంబర్ ఉంటుంది. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో సోనీ IMX921 సెన్సార్ (f/1.88), OIS, EIS, శామ్‌సంగ్ JN1 సెన్సార్ (f/2.0)తో 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ షూటర్‌ను అందించారు. దీంతోపాటు, ఫ్రంట్ సైడ్ 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.
కనెక్టివిటీ చూస్తే.. 5G, 4G LTE, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC, GPS, USB 3.2 Gen 1 టైప్-సి పోర్టులు వస్తాయి. బోర్డ్‌లోని సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్‌తో పాటు పలు కీలక సెన్సార్‌లను అందించారు. ఇన్‌ఫ్రారెడ్ ట్రాన్స్‌మిటర్ కూడా ఉంటుంది. ఇది పలు ఉపకరణాలను కంట్రోల్ చేసేందుకు సహాయపడుతుంది. అలాగే, 163.37x76.71x8.13mm పరిమాణంతో 213గ్రాముల బరువుతో వస్తుంది.
ప్రకటన
ప్రకటన