Photo Credit: Xiaomi
Xiaomi 15 series will launch on October 28 as the successor to the Xiaomi 14 series
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం Xiaomi 15 సిరీస్ నుంచి కంపెనీ నెక్ట్స్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ Xiaomi 15, Xiaomi 15 Pro ఫోన్‌లు ఈ వారమే చైనాలో ప్రారంభించనున్నట్లు భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ లైనప్ Qualcomm న్యూ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ద్వారా వస్తోన్న ప్రపంచంలోని మొట్టమొదటి హ్యాండ్‌సెట్‌గా నిర్ధారించబడింది. దీని లాంచింగ్ ముందే Xiaomi 15 Proలో 5X టెలిఫోటో కెమెరా, 6,100mAh సమార్థ్యం కలిగిన భారీ బ్యాటరీని అందించినట్లు దీనికి సంబంధించిన అనేక స్పెసిఫికేషన్‌లను కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఈ Xiaomi 15 సిరీస్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్స్‌తోపాటు అదనపు ఫీచర్స్ గురించి కూడా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం..
చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Weiboలో అనేక పోస్ట్‌లలో Xiaomi 850Wh/L శక్తితోపాటు 6,100mAh బ్యాటరీతో Xiaomi 15 Pro అధిక సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని హైలైట్ చేస్తూ కనిపిస్తున్నాయి. అలాగే, Xiaomi 14 Proలో వచ్చిన 4,880mAh బ్యాటరీ కంటే 38 శాతం మెరుగైన బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని ప్రచారంలో ఉంది. అదనంగా.. ఈ హ్యాండ్‌సెట్‌కు 2K మైక్రో-కర్వ్డ్ స్క్రీన్‌తో అమర్చబడి ఉంటుంది. అంతేకాదు, ఈ మోడల్ కలర్ ఆప్షన్‌లు కూడా గత సిరీస్ మాదిరిగానే ఉండనున్నాయి.
ఇది కస్టమైజ్డ్ లుమినియస్ M9 మెటీరియల్‌ని ఉపయోగించడంతోపాటు 1.38mm బెజెల్స్, 3,200 nits గరిష్ట బ్రైట్‌నెస్‌తో ఉంటుంది. అలాగే, పవర్ వినియోగాన్ని 10 శాతం తగ్గిస్తుంది. Xiaomi 15 Pro మోడల్ 5X పెరిస్కోప్ కెమెరా సహకారంతో 10X లాస్‌లెస్ జూమ్ ఫీచర్‌ని కూడా పొందవచ్చు. అంతేకాదు, ఈ రెండు ఫోన్‌లలోని కెమెరా యూనిట్ మళ్లీ లైకా బ్రాండింగ్‌ని కలిగి ఉన్నట్లు టీజర్ ద్వారా స్పష్టమైంది.
Xiaomi 15, Xiaomi 15 Pro రెండూ కూడా కంపెనీ హైపర్‌కోర్ టెక్నాలజీతో అటాచ్ చేయబడిన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతాయి. ఈ కారణంగా దీని ముందు వచ్చిన మోడల్స్ కంటే ఇవి 45 శాతం పనితీరులో మెరుగుదలను చూపించడంతోపాటు పవర్ వినియోగాన్ని 52 శాతం వరకూ తగ్గిస్తుందని కంపెనీ వెల్లడించింది. ప్రత్యేకంగా వీటి వినియోగంతో వినియోగదారులకు అదనపు లాభం చేకూరుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
2K రిజల్యూషన్‌లో 11 గంటల పాటు పెద్ద ఎత్తున టర్న్-బేస్డ్ 3D గేమ్‌ను ఆడే సమయంలో కంపెనీ పవర్ ఫిగర్‌లను కూడా టీజ్ చేసింది. అలాగే, అధికారిక సమాచారం ప్రకారం, Xiaomi 15 సిరీస్ 42.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలోనూ సెకనుకు 59.4 ఫ్రేమ్‌ల (fps) ఫ్రేమ్ రేట్‌ను నిర్వహించగలదని నిర్థారించబడింది. ఈ కారణంగా కూడా ఇది మునుపటి సిరీస్‌తో పోల్చితే మెరుగైన పనితీరుగానే అంచనా వేయవచ్చు. Xiaomi 15 Pro స్మార్ట్ ఫోన్ 8.35 mm మందంతో 213 గ్రాముల బరువు ఉంటుంది.
ప్రకటన
ప్రకటన