Photo Credit: 91Mobiles
Realme 14T, Realme 14 సిరీస్‌కి కొత్త అదనంగా ఉంటుందని భావిస్తున్నారు.
Realme 14T అతి త్వరలోనే ఇండియా లాంఛ్ జరగొచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, Realme ఇంకా దీనిని అధికారికంగా ధృవీకరించలేదు. కానీ, ఓ కొత్త లీక్.. ఇండియాలో ఫోన్ ధరను సూచిస్తోంది. 8GB RAM తోపాటు 128GB, 256GB రెండు స్టోరేజ్ ఆప్షన్‌లలో రాబోయే Realme 14T స్మార్ట్ ఫోన్ విడుదల కానున్నట్లు తెలుపుతోంది. అలాగే, ఇది మీడియాటెక్ Dimensity 6300 ప్రాసెసర్‌తో రూపొందిచబడినట్లు సమాచారం. ఈ Realme హ్యాండ్‌సెట్‌కు 6,000mAh భారీ బ్యాటరీని అందించే అకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది నీరు, ధూళి నియంత్రణకు IP69 - రేటెడ్ బిల్డ్ కలిగి ఉండొచ్చు.మార్కెట్ ధర ఇలా,తాజాగా, 91మొబైల్స్ అనధికారిక సమాచారాన్ని క్రోడీకరించి, ఈ Realme 14T ఫోన్ ధరకు సంబంధించిన వివరాలను లీక్ చేసింది. 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 17,999 కు ఈ కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రానున్నట్లు తెలిపింది. అంతే కాదు, ఇందులోనే 256GB స్టోరేజీ ఆప్షన్ వేరియంట్ ధర రూ. 18,999 గా ఉండే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, పూర్తి స్థాయిలో దీనిపై స్పష్టత ఇంకా రాలేదు.
Realme 14T మోడల్ గా చెప్పబడుతోన్న ప్రోమో ఇమేజ్ బయటకు వచ్చింది. అంతే కాదు, ఫోన్ కొనుగోలుపై స్పాట్ డిస్కౌంట్‌గా కంపెనీ రూ. 1,000 తగ్గింపును ఇస్తుందని ఇది సూచిస్తోంది. ఈ తాజా పోస్టర్ 2,100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, IP69 - రేటెడ్ బిల్డ్, ఫోన్‌లో 6,000mAh భారీ బ్యాటరీతో కూడిన AMOLED డిస్‌ప్లేను సూచిస్తోంది. అలాగే, ఈ ఫోన్ మౌంటైన్ గ్రీన్, లైటింగ్ పర్పుల్ కలర్ ఆప్షన్‌లలో రానున్నట్లు నివేదికలో వెల్లడైంది.
Realme 14 సిరీస్‌కు ఈ రాబోయే Realme 14T ఫోన్ కొత్తగా జత చేసే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. నిజానికి, ఈ హ్యాండ్‌సెట్ మోడల్ ముందుగా AliExpress లో ప్రత్యక్షమైంది. అంతే కాదు, ఇది కీలకమైన స్పెసిఫికేషన్‌లను కూడా బహిర్గతం చేసింది. దీని ప్రకారం.. రాబోయే మోడల్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,340 పిక్సెల్స్) డిస్‌ప్లేతో రావొచ్చు.
Realme 14T స్మార్ట్ ఫోన 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్, 32-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌ను అమర్చడంతోపాటు ఈ ఫోన్ 100W ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించనున్నట్లు అంచనా వేసింది. ఈ రాబోయే కొత్త మోడల్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంటుందని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అలాగే, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 తో ఇది రావొచ్చని అంచనాలు ఉన్నాయి. 5G, NFC కనెక్టివిటీని కూడా అందించవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇది 163.1 x 75.6 x 7.9mm పరిమాణం, 196 గ్రాముల బరువుతో రావొచ్చు.
ప్రకటన
ప్రకటన