కెమెరా విభాగంలో Realme 16 Pro+ మరింత శక్తివంతంగా కనిపిస్తోంది. ఇందులో క్వాడ్ కెమెరా సెటప్ ఉండనుందని TENAA లిస్టింగ్ చెబుతోంది. ఇందులో ప్రధానంగా 200 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, అదనంగా 50 మెగాపిక్సెల్ సెన్సార్ ఉండగా, 3.5x ఆప్టికల్ జూమ్కు కూడా సపోర్ట్ ఉంటుందని సమాచారం.
రియల్‌మి 16 ప్రో ఇటీవలే కనిపించింది, ఇప్పుడు దృష్టి హై-ఎండ్ రియల్‌మి 16 ప్రో+ వైపు మళ్లింది.
ఇటీవల Realme 16 Pro వివరాలు బయటకు వచ్చిన తర్వాత, ఇప్పుడు అందరి దృష్టి హైఎండ్ మోడల్ అయిన Realme 16 Pro+ పైకి మళ్లింది. Pro+ మోడల్‌కు సంబంధించిన చైనా వేరియంట్‌గా భావిస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ RMX5130 అనే మోడల్ నంబర్‌తో TENAA సర్టిఫికేషన్ ప్లాట్‌ఫామ్‌లో కనిపించడం గమనార్హం. అధికారిక లాంచ్ తేదీలను Realme ఇప్పటివరకు వెల్లడించకపోయినా, TENAA లిస్టింగ్ ద్వారా ఈ ఫోన్‌లో ఉండబోయే ప్రధాన హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్లు దాదాపుగా స్పష్టమయ్యాయి. TENAA డేటాబేస్ ప్రకారం, Realme 16 Pro+ ఫోన్ పరిమాణం 162.45 x 76.27 x 8.49 మిల్లీమీటర్లు కాగా, బరువు సుమారు 203 గ్రాములుగా ఉంది. ఇది స్టాండర్డ్ Pro మోడల్‌తో పోలిస్తే కొంచెం బల్కీ డిజైన్‌ను సూచిస్తోంది. ఈ డివైస్‌లో 6.8 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఇవ్వనున్నట్లు సమాచారం. దీనికి 2800 x 1280 పిక్సెల్స్ రిజల్యూషన్తో పాటు, ఒక బిలియన్‌కు పైగా కలర్ డెప్త్ సపోర్ట్ ఉండడం విశేషం. రిఫ్రెష్ రేట్ వివరాలు TENAAలో ప్రస్తావించకపోయినా, Pro+ బ్రాండింగ్‌ను బట్టి ఇది హై రిఫ్రెష్ రేట్ ప్యానెల్‌గా ఉండే అవకాశం ఉంది.
కెమెరా విభాగంలో Realme 16 Pro+ మరింత శక్తివంతంగా కనిపిస్తోంది. ఇందులో క్వాడ్ కెమెరా సెటప్ ఉండనుందని TENAA లిస్టింగ్ చెబుతోంది. ఇందులో ప్రధానంగా 200 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, అదనంగా 50 మెగాపిక్సెల్ సెన్సార్ ఉండగా, 3.5x ఆప్టికల్ జూమ్కు కూడా సపోర్ట్ ఉంటుందని సమాచారం. సెల్ఫీ మరియు వీడియో కాలింగ్ కోసం ముందువైపు 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించనున్నారు.
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్‌ఫోన్‌లో 2.8GHz క్లాక్ స్పీడ్ కలిగిన ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగిస్తున్నట్లు లిస్టింగ్ సూచిస్తోంది. చిప్‌సెట్ పేరు స్పష్టంగా పేర్కొనకపోయినా, ఇటీవల Geekbenchలో కనిపించిన వివరాల ప్రకారం, ఇది Snapdragon 7 Gen 4కు కొద్దిగా మార్పులు చేసిన వెర్షన్‌పై పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
సాఫ్ట్‌వేర్ పరంగా, Realme 16 Pro+ Android 16 ఆధారిత Realme UI 7తో రన్ అవుతుంది. గ్లోబల్ మార్కెట్లలో ఈ డివైస్‌కు మూడు Android OS అప్‌డేట్లు, అలాగే నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లు అందే అవకాశం ఉందని అంచనా. మెమరీ ఆప్షన్ల విషయంలో కూడా Realme పెద్ద ఎత్తున ఎంపికలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 8GB, 12GB, 16GB, 24GB RAM వేరియంట్లతో పాటు, 128GB నుంచి 1TB వరకు స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉండనున్నాయి.
బ్యాటరీ విభాగంలో ఈ ఫోన్ మరో కీలక ఆకర్షణగా నిలవనుంది. TENAA లిస్టింగ్ ప్రకారం, దీనిలో 6,850mAh రేటెడ్ బ్యాటరీ ఉంది, ఇది సాధారణంగా చూస్తే దాదాపు 7,000mAh టిపికల్ కెపాసిటీకి సమానం కావచ్చు. ఇతర నివేదికల ప్రకారం, ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ ఇవ్వనుంది. అదనంగా, భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, అలాగే రిమోట్ కంట్రోల్ ఫీచర్ల కోసం IR బ్లాస్టర్ కూడా ఇందులో ఉండనున్నాయి.
ప్రకటన
ప్రకటన