రియల్ మీ 16 ప్రో, ప్రో ప్లస్ 8/12/16/24GB RAM, 128GB/256GB/512GB/1TB స్టోరేజ్ వేరియెంట్లతో రాబోతోందని సమాచారం.
Realme 16 Pro+ చైనాలో అమ్మకానికి అధికారికంగా TENAA ద్వారా ధృవీకరించబడింది.
రియల్ మీ నుంచి మార్కెట్లోకి అదిరిపోయే ఫీచర్స్‌తో కొత్త మోడల్స్ రాబోతోన్నాయి. Realme 16 Pro+ చైనాలో అమ్మకానికి రానుందని అధికారికంగా TENAA ద్వారా కన్ఫామ్ అయింది. అంతే కాకుండా ఈ మోడల్ మార్కెట్లోకి రాక ముందే కొన్ని కీ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్‌ను లీక్ చేశారు. ఇది 1280x2800 రిజల్యూషన్‌తో 6.8-అంగుళాల AMOLED స్క్రీన్‌తో రానుందట. 200MP ప్రధాన కెమెరా, 3.5x ఆప్టికల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 8MP అల్ట్రావైడ్, 50MP సెల్ఫీ స్నాపర్‌తో అదరగొట్టబోతోందట. 6,850 mAh రేటింగ్ ఉన్న బ్యాటరీతో వస్తుందట. అయితే ఇది 7,000 mAh సాధారణ సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు చెబుతున్నారు. RMX5130 మోడల్ నంబర్‌తో ఉన్న Realme ఫోన్ చైనాలోని TENAA సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో లిస్ట్ చేసినట్టుగా కనిపిస్తోంది. చిప్‌సెట్, బ్యాటరీ, డిస్‌ప్లే, కెమెరా కాన్ఫిగరేషన్‌తో సహా దాని కీలక స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లను వెల్లడించారు. టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ (@yabhishekhd) ఈ మోడల్ నంబర్ Realme 16 Pro+ 5Gకి చెందినదని, ఇది త్వరలో భారతదేశంలో కూడా లాంచ్ కానుందని పేర్కొన్నారు. అయితే ఇది హ్యాండ్‌సెట్ చైనీస్ వెర్షన్ కావచ్చు, అంటే దీని స్పెసిఫికేషన్లు దాని భారతీయ ప్రతిరూపానికి భిన్నంగా ఉండవచ్చని తెలుస్తోంది.
ఈ పరికరం Qualcomm Snapdragon 7 Gen 4 SoC ద్వారా శక్తిని పొందుతుందని తెలుస్తోంది. ఇది 8/12/16/24GB RAM, 128GB/256GB/512GB/1TB స్టోరేజ్ వేరియెంట్లతో రాబోతోందని సమాచారం. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, IR బ్లాస్టర్,అన్ని సాధారణ కనెక్టివిటీ ఎంపికలకు మద్దతు కూడా ఉంది. రియల్ మీ 16 ప్రో+ కొలతలు 162.45 x 76.27 x 8.49 మిమీగా, బరువు 203 గ్రా. ఉంటుందని తెలుస్తోంది.
ఇంకా Realme 16 Pro+ 5G చైనీస్ వేరియంట్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని చెబుతున్నారు. ఇందులో 200-మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 3.5x ఆప్టికల్ జూమ్ సామర్థ్యంతో 50-మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో ఇది హోల్ పంచ్ డిస్ప్లే కటౌట్ లోపల ఉంచబడిన 50-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉండవచ్చు.
రియల్‌మీ ఇప్పటికే నాలుగు రంగులలో రాబోతోందని లీక్ చేశారు: నవోటో ఫుకాసావా రూపొందించిన మాస్టర్ గోల్డ్, మాస్టర్ గ్రే, అలాగే కామెల్లియా పింక్, ఆర్చిడ్ పర్పుల్ వంటి రంగుల్లో రానుందట. ఇవి భారతదేశానికి ప్రత్యేకంగా ఉంటాయని అంటున్నారు. భారతదేశంలో రియల్‌మీ 16 ప్రో+ లాంచ్ డేట్ మీద మాత్రం ఇంకా క్లారిటీ లేదు. త్వరలోనే భారతదేశంలో ప్రారంభించబడుతుందని ధృవీకరించబడిన ఈ లైనప్ దేశంలో ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ ఇండియా ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. చైనాలో మాత్రం రియల్‌మీ 16 ప్రో, 16 ప్రో+ జనవరి 6న అధికారికంగా విడుదల కానున్నాయి.
ప్రకటన
ప్రకటన
Truecaller Voicemail Feature Launched for Android Users in India With Transcription in 12 Regional Languages