దేశీయ మార్కెట్‌నందు realme ఈ సంవత్సరం ప్రారంభంలో C65 5Gని ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా realme కంపెనీ తన C సిరీస్ నుంచి 5G బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ realme C63 5Gని పరిచయం చేసింది. ఇది 6.67 అంగుళాల HD+ 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో రూపొందించబడి, డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్టార్రి గోల్డ్ అలాగే ఫారెస్ట్ గ్రీన్ రెండు రంగులలో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మొత్తం మూడు వేరియంట్‌లలో కొనుగోలుదారులకు లభిస్తుంది. 4GB RAM + 128GB స్టోరేజీ ఉన్న ఫోన్ ధర రూ.10,999గా, 6GB RAM + 128GB స్టోరేజీ సమార్థ్యం ఉన్న ఫోన్ ధర రూ. 11,999 అలాగే, 8GB RAM + 128GB స్టోరేజీ సామర్థ్యం ఉన్న వేరియంట్
ధరను రూ. 12,999గానూ కంపెనీ ప్రకటించింది.
ఇక మన దేశంలో ఈ realme C63 5G స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 20 నుండి realme అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రారంభ ఆఫర్‌లలో భాగంగా కొనుగోలుదారులు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై రూ.1,000 డిస్కౌంట్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ప్రకారం.. 4GB RAM + 128GB స్టోరేజీ వేరియంట్ మొబైల్ ధర రూ.9,999, 6GB RAM + 128GB స్టోరేజీ సామర్థ్యం ఉన్న ఫోన్ ధర రూ. 10,999 అలాగే, 8GB RAM + 128GB స్టోరేజీ సామర్థ్యం ఉన్న వేరియంట్ ఫోన్ ధర రూ. 11,999కు పొందవచ్చు. ఫోన్ భద్రత దృష్ట్యా సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందిస్తున్నారు.
realme C63 5G స్పెసిఫికేషన్స్ ఇలా..
realme C63 5G స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. ఈ 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల డిస్‌ప్లేతో ఆకర్షవంతంగా కనిపిస్తోంది. అంతేకాదు, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 625 nits పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. వినియోగదారుల ఆహ్లాదకరమైన అనుభాన్ని పొందేందుకు స్మార్ట్‌ఫోన్ TUV SUD 48-నెలల ఫ్లూయెన్సీ సర్టిఫికేషన్‌ను పొందిందినట్లు కంపెనీ వెల్లడించింది. మీడియా టెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో శక్తిని పొందుతుంది. ఇది గరిష్టంగా 8GB RAM, 128GB స్టోరేజ్ సామర్థ్యంతో అందుబాటులోకి వస్తోంది. ఇందులోని మైక్రో SDతో 2TB వరకు మెమరీ
సామర్థ్యాన్ని పెంచుకునేలా హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ (నానో + నానో / మైక్రో SD)ని అందిస్తున్నారు. మరీ ముఖ్యంగా 5000mAh బ్యాటరీతో పని చేస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్ 40 గంటల వరకు కాలింగ్, 17.3 గంటల వీడియో ప్లేబ్యాక్ ఉంటుందని realme ప్రకటించింది. అలాగే, 29 రోజుల స్టాండ్‌బై సమయాన్ని ఆఫర్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ 10W వైర్ ఛార్జింగ్‌కు సైతం మద్దతిస్తుంది.
ప్రత్యేకంగా ఫోటోగ్రఫీ కోసం..
realme C63 5G స్మార్ట్ ఫోన్ కెమెరా విషయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కెమెరా ఇమేజింగ్ విభాగంలో వెనుక 32MP ప్రైమరీ కెమెరాను అందించారు. ఈ 32MP ప్రైమరీ కెమెరాలో ఫోటో, వీడియో, ప్రో, పానో, పోర్ట్రెయిట్, నైట్, స్ట్రీట్, టైమ్-లాప్స్, స్లో-మోషన్, టెక్స్ట్ స్కానర్‌తోపాటు మూవీ-డ్యూయల్ వీడియో లాంటి అనేక ఫోటోగ్రఫీ మోడ్‌లను కలిగి ఉంటోంది. అలాగే, ముందు భాగంలో ఉన్న కెమెరా విషయానికి వస్తే.. realme C63 5G స్మార్ట్ ఫోన్‌కు వీడియో కాల్, సెల్ఫీలకు అనుగుణంగా 8MP కెమెరాలను అందించారు. అంతేకాదు, సెల్ఫీలను మరింత క్వాలిటీగా చూసుకునేందుకు AI బ్యూటీ మోడ్‌ను అదనంగా కేటాయించడం ఈ మోడల్‌కు అదనపు ఆకర్షణగా చెప్పొచ్చు. మొబైల్ పరిమాణం చూస్తే.. 165.6×76.1×7.94mmతో 192 గ్రాముల బరువు ఉంటుంది.