Photo Credit: Realme
రియల్‌మే జిటి 7 గ్రాఫేన్ ఐస్, గ్రాఫేన్ స్నో మరియు గ్రాఫేన్ నైట్ షేడ్స్‌లో వస్తుంది
Realme GT 7 ఫోన్ చైనాలో మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ ప్రాసెసర్‌తో విడుదలైంది. ఇది 100W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7200 mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అలాగే, 50- మెగాపిక్సెల్ డ్యూయల్ రియల్ కెమెరా యూనిట్‌ను ఈ మొబైల్‌కు అందించారు. వీటిలో అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 16- మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్ ఉన్నాయి. సెక్యూరిటీ నిమిత్తం, అల్ట్రా సోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను, దుమ్ము- నీటి నియంత్రణకు ఐపీ69 రేటింగ్‌ను కలిగి ఉంటుంది. గ్రాఫేస్ ఐస్ సెన్సింగ్ డబుల్ లేయర్ కూలంగ్ టెక్నాలజీతో 7700 mm² వీసీ కూలింగ్ చాంబర్‌తో రూపొందించారు.చైనాలో దీని ధర,కొత్త Realme GT 7 ఫోన్ ధర చైనాలో 12జీబీ+256జీబీ వేరియంట్ CNY 2599(సుమారు రూ.30400), 16జీబీ+256జీబీ వేరియంట్ CNY 2899 (సుమారు రూ.34000)గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ గ్రాఫేన్ ఐస్, గ్రాఫేన్ స్నో, గ్రాఫేన్ నైట్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. అలాగే, ప్రస్తుతం చైనాలో Realme వెబ్‌సైట్‌తోపాటు ఆన్‌లైన రిటైల్ స్టోర్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉన్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.
Realme GT 7 హ్యాండ్‌సెట్ 3ఎన్ఎం ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 94+ ప్రాసెసర్, 16జీబీ వరకూ LPDDR5X RAM, ఒక టీబీ వరకూ యూఎఫ్ఎస్ 4.0 ఆన్‌బోర్డ్ స్టోరేజీతో అటాచ్ చేయబడి ఉంటుంది. ఇది 6.78- అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ OLED డిస్‌ప్లేను 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 6500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌తో వస్తుంది. అలాగే, దీని డిస్‌ప్లే వంద శాతం కలర్ గామట్, 4608 హెచ్‌జెడ్ పిడబ్ల్యూఎం డిమ్మింగ్ రేట్‌తో ఉంటుంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 15- ఆధారిత రియల్‌మీ యూఐ 6.0 తో వస్తోంది.
ఈ హ్యాండ్‌సెట్ కెమెరా విషయానికి వస్తే.. దీనికి డ్యూయ్ రియల్ కెమెరా యూనిట్‌ను అందించారు. ఈ యూనిట్‌లో 50- మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్896 ప్రైమరీ సెన్సార్‌ను అందించారు. అలాగే, 8- మెగాపిక్సెల్ 112- డిగ్రీల అల్ట్రా- వైడ్ షూటర్ దీని ప్రత్యేకత. సెల్ఫీలు, వీడియో కాల్స్ మాట్లాడడం కోసం ముందు భాగంలో 16- మెగాపిక్సల్ సోనీ ఐఎంఎక్స్480 కెమెరా సెన్సార్‌ను అమర్చారు. ఇది లైవ్ ఫోటోల ఫీచర్‌కు సపోర్ట్ చేయడంతోపాటు 4కే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు.
కొత్త Realme GT 7 ఫోన్ గ్రాఫేన్- కోటెడ్ ఫైబర్ గ్లాస్ ప్యానెల్‌తో రూపొందించబడింది. అంతేకాదు, ఏఐ రికార్డింగ్ సమరీ, ఎఐ ఎలిమినేషన్ 2.0 వంటి పలు కీలక ఏఐ ఆధారిత ఫీచర్స్‌ను ఇందులో జోడించారు. దీనికి ఐఆర్ సెన్సార్ కూడా ఉంటుంది. కనెక్టివిటీ ఆప్షన్‌లలో యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్, Wi-Fi 7, డ్యూయల్ 4జీ వోల్ట్‌తోపాటు 5జీ, బ్లూటూత్ 5.4 లాంటివి ఉన్నాయి. అలాగే, 162.42x75.97x8.25ఎంఎం పరిమాణంతో 203 గ్రాముల బరువు ఉంటుంది.
ప్రకటన
ప్రకటన