Photo Credit: Realme
ఈ నవంబర్ 26న లాంచ్ అయిన Realme GT 7 Pro హ్యాండ్‌సెట్ విక్రయాలు భారత్‌లో ప్రారంభమయ్యాయి. తాజాగా కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కీలకమైన స్పెసిషికేసన్స్‌తోపాటు లాంచ్ ఆఫర్‌లను వెల్లడించింది. ఈ స్మార్ట్ ఫోన్ Qualcomm లేటెస్ట్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో 16GB వరకు RAM, 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే, 5,800mAh బ్యాటరీని అటాచ్ చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ మొదటిగా చైనాలో నవంబర్ 4న 6,500mAh సామర్థ్యం కలిగిన భారీ బ్యాటరీతో విడుదల అయ్యింది.
మన భారత్ మొబైల్ మార్కెట్‌లో Realme GT 7 ప్రో 12GB + 256GB వేరియంట్ ప్రారంభ ధర రూ. 59,999గా నిర్ణయించారు. 16GB + 512GB వేరియంట్ కొనుగోలు చేయదలచినవారు రూ. 65,999లు చెల్లించాల్సి ఉంటుంది. Amazon, Realme India వెబ్‌సైట్‌లతోపాటు ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా కూడా కొనుగోలు చేసేందుకు తీసుకువచ్చింది. Realme GT 7 Proని బ్యాంక్ ఆఫర్లతో రూ. 56,999లకు సొంతం చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ కొనుగోలుదారులు 12 నెలల వరకు నో-కాస్ట్ EMI ఎంపికతోపాటు ఒక సంవత్సరం ఉచిత బ్రోకెన్ స్క్రీన్ ఇన్సూరెన్స్‌ను పొందొచ్చు. అలాగే, ఈ మోడల్‌పై కంపెనీ మరో ఆఫర్‌ను కూడా ప్రకటించింది. ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసే వారు గరిష్టంగా 24 నెలల వాయిదా ఎంపికలతోపాటు రెండు సంవత్సరాల వారంటీని కూడా పొందే అవకాశం కల్పించారు. ఈ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ గ్రే, మార్స్ ఆరెంజ్ షేడ్స్‌లో లభిస్తుంది.
ఈ Realme GT 7 Pro హ్యాండ్‌సెట్ 120Hz వరకు రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, HDR10+ సపోర్ట్‌తో 6.78-అంగుళాల ఫుల్-HD+ LTPO AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఫోన్ 16GB వరకు LPDDR5X RAM, 512GB వరకు UFS 4.0 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో అటాచ్ చేయబడిన Snapdragon 8 Elite ప్రాసెసర్‌తో రూపొందించారు. అలాగే, ఇది ఆండ్రాయిడ్ 15-ఆధారిత Realme UI 6.0 స్కిన్‌తో రన్ అవుతోంది. Realme GT 7 Pro స్మార్ట్ ఫోన్ 50-మెగాపిక్సెల్ Sony IMX906 ప్రైమరీ సెన్సార్, 50-మెగాపిక్సెల్ Sony IMX882 టెలిఫోటో షూటర్‌తోపాటు వెనుకవైపు 8-మెగాపిక్సెల్ Sony IMX355 అల్ట్రా-వైడ్ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16-మెగాపిక్సెల్ సెన్సార్‌తో వస్తోంది.
సరికొత్త Realme GT 7 Pro హ్యాండ్‌సెట్ 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,800mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కేవలం 30 నిమిషాల్లోనే ఫోన్‌ను జీరో నుంచి 100 శాతానికి ఛార్జ్ చేస్తుందని కంపెనీ వెల్లడించింది. భద్రత కోసం ఇన్-డిస్ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇందులో అందించారు. ఇది 162.45 x 76.89 x 8.55mm పరిమాణంతో 222గ్రాముల బరువు ఉంటుంది.
ప్రకటన
ప్రకటన