Realme GT 7T త్వరలో లాంచ్.. లీకైన కలర్, డిజైన్ ఫీచర్లు

Realme GT 7T స్మార్ట్‌ఫోన్ మే 27న భారత మార్కెట్లో విడుదల కానుంది. ఈ ఫోన్ శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 8400 చిప్‌సెట్‌, 120హెడ్జ్ రిఫ్రెష్ రేటింగ్ డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో రానుంది.

Realme GT 7T  త్వరలో లాంచ్.. లీకైన కలర్, డిజైన్ ఫీచర్లు

Photo Credit: Realme

Realme GT 7తో పాటు Realme GT 7T కూడా ఆవిష్కరించబడుతుంది

ముఖ్యాంశాలు
  • ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8400 చిప్‌సెట్‌తో అందుబాటులో ఉంది
  • 50MP కెమెరా, 120Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే అందుబాటులో ఉంది
  • 7,000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది
ప్రకటన

రియల్‌ మీ బ్రాండ్ నుంచి మరో ప్రీమియం స్మార్ట్‌ ఫోన్ త్వరలో విడుదల కానుంది. భారత్‌తో పాటు ప్రపంచ మార్కెట్‌లోకి మే 27న రియల్‌మీ GT 7T స్మార్ట్‌ ఫోన్ లాంచ్ కానుంది. ఈ గ్యాడ్జెట్ విడుదల వేళ.. దీనికి సంబంధించిన స్పెసిఫికెషన్లు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.రియల్‌మీ GT 7T (Realme GT 7T) 6.8 అంగుళాల డిస్‌ప్లేతో రానుందని సమాచారం. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ డివైస్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8400 మ్యాక్ చిప్‌సెట్‌ను ఉపయోగించారని వార్తలు వస్తున్నాయి. ఈ ఫోన్‌లో 7,0ా00mAh బ్యాటరీ అమర్చినట్లు టాక్. ఇది 120W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుందని సమాచారం.రియల్‌మీ GT 7T డిజైన్ (లీకైన),టిప్‌స్టర్ సుధాన్షు అంబోర్ (@Sudhanshu1414) Xలో రియల్‌మీ GT 7T గురించి కొన్ని ఫోటోలు పంచుకున్నారు. వీటిని బట్టి ఈ స్మార్ట్ ఫోన్.. నలుపు, నీలం, పసుపు రంగుల్లో లభించనున్నట్లు తెలుస్తోంది. పసుపు రంగులోని వెరియంట్‌ వెనుక వైపు నల్లటి చారలు కలిగి స్పోర్టీ లుక్‌లో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ స్కేర్ షేప్‌లో కెమెరా మాడ్యుల్ కలిగి ఉంది. ఈ సెటప్‌లో రెండు సెన్సార్లతో పాటు LED ఫ్లాష్ ఉంటుంది.

ఈ ఎక్స్‌ పోస్ట్‌.. గతంలో Realme GT 7T స్పెసిఫికేషన్స్‌పై వచ్చిన పుకార్లను ధృవీకరించింది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రియల్‌మీ యూఐ 6.0పై పనిచేయనుంది. అలాగే 6.8 అంగుళాల పోడవైన ఆమోల్డ్ డిస్‌ప్లే(1,280x2,800 పిక్సెల్‌లు) 120Hz రిఫ్రెష్ రేట్‌ కలిగి ఉంటుందని తెలిసింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8400 చిప్‌ సెట్‌తో రన్‌ అవుతుందని గతంలో వార్తలు వచ్చాయి.

50 మెగాపిక్సెల్ కెమెరా

ఇక రియల్‌మీ GT 7T కెమెరా విషయానికొస్తే..ఆకర్షనీయమైన ఫీచర్లను కలిగి ఉన్నట్లు టాక్. వెనుక భాగంలో డ్యుయల్ రియర్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్‌తో (f/1.8 అపర్చర్) ఆఫ్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ను(OIS) సపోర్ట్ చేస్తుంది. దీంతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా(f/2.4 అపర్చెర్) కూడా ఉన్నట్లు టాక్. సెల్ఫీల కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ అమర్చబడి ఉంటుందని సమాచారం. అలాగే ఇది డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్ కలిగి ఉన్నట్లు తెలిసింది.కనెక్టివిటీ,రియల్‌మీ GT 7Tలో ఆధునిక ఫీచర్లు ఉన్నట్లు భావిస్తున్నారు. బ్లూటూత్ 6.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్‌-సీ పోర్ట్, వైఫై-6 ఇందులో ఉన్నాయి.బిగ్ బ్యాటరీ,ఇక బ్యాటరీ పరంగా ఇందులో 7000mAh కెపాసిటీ బ్యాటరీని వాడినట్లు తెలిసింది. ఇది 120W వైర్డ్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీంతో ఈ డివైస్ పూర్తిగా ఛార్జింగ్ అయ్యేందుకు చాలా తక్కువ సమయం పట్టనుంది.

స్లిమ్ డిజైన్

Realme GT 7T స్లిమ్‌ డిజైన్‌లో రానున్నట్లు ఇప్పటికే విడుదలైన చిత్రాల ద్వారా అర్థం అవుతోంది. 162.42 x 75.97 x 8.25mm కొలతలతో స్లిమ్‌గా ఉండనుంది. ఇది కేవలం 202 గ్రాముల బరువు ఉండటంతో చేతిలో తేలికగా ఉంటుంది.

కొనాల్సింది ఇక్కడే

రియల్‌మీ GT 7T మే 27న భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో పాటు Realme GT 7 స్మార్ట్ ఫోన్ కూడా లాంచ్‌ అవుతోంది. ఈ రెండు స్మార్ట్‌ ఫోన్లు అమెజాన్‌తో పాటు రియల్‌మీ ఇండియా సైట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంటాయి.

Comments

సంబంధిత వార్తలు

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. AI ఫీచర్లతో గూగుల్ ఫిక్సల్ 10 ప్రో ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది, ధర ఎంతో తెలుసా
  2. రెడ్మీ 15 5G భారత మార్కెట్లో విడుదల... ధర, ఫీచర్స్, ఇతర స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్ మీకోసం
  3. తక్కువ ధరకు 4GB RAMతో Poco M7 Plus 5G కొత్త వేరియంట్ ఫోన్, త్వరలో ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్ ప్రారంభం
  4. iQOO 15 హ్యాండ్‌సెట్ ఫోటోలు లీక్, వేర్వేరు కలర్స్‌లో సరికొత్త లుక్‌లో హ్యాండ్‌సెట్
  5. సెప్టెంబర్ 19 నుంచి ఇవ్వాల్సిన డెలివరీలు వాయిదా పడుతున్నాయి
  6. రియల్ మీ P3 Lite 5G ధరను రియల్‌ మీ చాలా ఆకర్షణీయంగా నిర్ణయించింది.
  7. నథింగ్ ఇయర్ 3 లో మార్పులివే
  8. ఐఫోన్ లవర్స్‌కి ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆఫర్
  9. ఇటీవల ఐఫోన్ 17 సిరీస్ భారత్‌లో విడుదల కావడంతో, ఐఫోన్ 16 ధరను తగ్గించారు
  10. ఈ సిరీస్ ముఖ్యంగా ఫ్లాగ్‌షిప్ ఫోన్ల మార్కెట్‌లో పోటీని మరింత పెంచే అవకాశం ఉంది
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »