ఇక ధర విషయానికి వస్తే, కంపెనీ అధికారికంగా ఇంకా ఏమీ వెల్లడించలేదు

ఇటీవల రియల్‌మీ, జపాన్‌లోని ప్రముఖ కెమెరా బ్రాండ్ రికో ఇమేజింగ్ తో భాగస్వామ్యం ప్రకటించింది.

ఇక ధర విషయానికి వస్తే, కంపెనీ అధికారికంగా ఇంకా ఏమీ వెల్లడించలేదు

Photo Credit: Realme

రియల్‌మీ GT 8 ప్రోలో Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్ ఉంది

ముఖ్యాంశాలు
  • రియల్‌మీ GT 8 సిరీస్ అక్టోబర్ 21న చైనాలో విడుదల కానుంది
  • కొత్త రికో GR ఇమేజింగ్ టెక్నాలజీతో ప్రొఫెషనల్ లెవెల్ ఫోటోగ్రఫీ అనుభవం
  • 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ వంటి శక్తివంతమైన ఫీచర్లు
ప్రకటన

రియల్‌మీ తన తదుపరి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్... రియల్‌మీ GT 8 సిరీస్ ను అక్టోబర్ 21న చైనాలో విడుదల చేయబోతోంది. ఈ సిరీస్‌లో రియల్‌మీ GT 8 మరియు రియల్‌మీ GT 8 ప్రో మోడల్స్ ఉండనున్నాయి. ఈ ఫోన్లలో ముఖ్యంగా కెమెరా టెక్నాలజీలో పెద్ద మార్పులు తీసుకురాబోతున్నట్టు కంపెనీ ప్రకటించింది. కొత్తగా వీటిలో స్వపబ్లుల్ రియర్ కెమెరా మాడ్యూల్స్ ఉండబోతున్నాయి.ఇటీవల రియల్‌మీ, జపాన్‌లోని ప్రముఖ కెమెరా బ్రాండ్ రికో ఇమేజింగ్ తో భాగస్వామ్యం ప్రకటించింది. రికో యొక్క GR ఇమేజింగ్ టెక్నాలజీని ఉపయోగించి రియల్‌మీ తన ఫోన్ల కెమెరా క్వాలిటీని మరింత మెరుగుపరచనుంది. ఈ టెక్నాలజీని తొలిసారిగా ఉపయోగించబోయే ఫోన్లు రియల్‌మీ GT 8 మరియు GT 8 ప్రో.

కంపెనీ షేర్ చేసిన సమాచారం ప్రకారం, రియల్‌మీ GT 8 ప్రోలో 28mm మరియు 40mm ఫోకల్ లెంగ్త్ కెమెరా లెన్సులు ఉండనున్నాయి. వీటితో యూజర్లు వెడల్పైన లేదా లోతైన ఫోటోలు తీయగలరు. అదనంగా, ఈ ఫోన్‌లో “Immersive Framing Mode” అనే ఫీచర్ ఉంటుంది. దీని ద్వారా ఫోటో తీసేటప్పుడు స్క్రీన్‌పై ఉండే ఇతర UI ఎలిమెంట్స్ ఆటోమేటిక్‌గా తొలగించబడతాయి, తద్వారా ఫోటో మరింత క్లియర్‌గా కనిపిస్తుంది.

ఇంకా “Quick Focus Mode” అనే మరో ఫీచర్ కూడా అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా యూజర్లు ముందుగానే ఫోకస్ దూరాన్ని సెట్ చేసి, చేతి జెస్టర్‌తోనే ఫోటోలు తీసుకోవచ్చు. అంతేకాదు, “Hidden Focal Length” అనే ప్రత్యేక ఫీచర్ ద్వారా 28mm లేదా 40mm ఫోకల్ లెంగ్త్‌లను 35mm లేదా 50mm గా మార్చుకోవచ్చు.

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, రియల్‌మీ GT 8 ప్రోలో తాజా Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్ ఉండనుంది. 2K 10-bit LTPO BOE ఫ్లాట్ OLED డిస్‌ప్లేతో పాటు 144Hz రిఫ్రెష్ రేట్ అందిస్తుంది. కెమెరా సెటప్‌లో 200MP Samsung HP5 పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ కూడా ఇవ్వబడింది.

ఒక ప్రముఖ టిప్‌స్టర్ సమాచారం ప్రకారం, ఈ ఫోన్‌లో 50MP Sony LYT-808 మెయిన్ కెమెరా (OIS తో), అలాగే 50MP Samsung JN5 అల్ట్రావైడ్ లెన్స్ ఉండనున్నాయి. బ్యాటరీ పరంగా 7,000mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీని 120W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్తో అందించనున్నారు. ఇక ధర విషయానికి వస్తే, కంపెనీ అధికారికంగా ఇంకా ఏమీ వెల్లడించలేదు. అయితే గత మోడల్స్ ధరలను బట్టి చూస్తే, రియల్‌మీ GT 8 ప్రో ధర సుమారు రూ.59,999, అలాగే రియల్‌మీ GT 8 రూ.39,999 పరిధిలో ఉండే అవకాశం ఉంది.

కొత్త కెమెరా టెక్నాలజీ, రికో భాగస్వామ్యం, శక్తివంతమైన చిప్‌సెట్, మరియు భారీ బ్యాటరీ వంటి ఫీచర్లతో రియల్‌మీ GT 8 సిరీస్, ఈ సంవత్సరం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ ఇవ్వడం ఖాయం.

Comments

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. హువావే నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్, 5500mAh బ్యాటరీ, డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌
  2. Huawei ఇప్పటివరకు Nova Flip S ప్రాసెసర్ లేదా RAM వివరాలను అధికారికంగా వెల్లడించలేదు
  3. అదనంగా, Vivo కంపెనీ Vivo Sans అనే కొత్త ఫాంట్‌ను ప్రవేశపెట్టింది
  4. అక్టోబర్ చివర్లో లేదా నవంబర్ ప్రారంభంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది
  5. వాట్సప్‌లో అదిరే అప్డేట్.. త్వరలోనే ప్రారంభం
  6. ఆపిల్ నుంచి కొత్త మ్యాక్ బుక్ ప్రో.. అదిరే ఫీచర్స్
  7. ఇన్ స్టాగ్రాంలో దీపావళి స్పెషల్.. ఈ ఎడిట్ గురించి మీకు తెలుసా?
  8. సామ్ సంగ్ గెలాక్సీ ఎస్26 ఎడ్జ్ మోడల్‌కి గుడ్ బై.. దాని స్థానంలో రానున్నది ఇదే
  9. ఒప్పో వాచ్ ఎస్ ప్రారంభం.. కళ్లు చెదిరే ధర, ఫీచర్స్
  10. ఈ రెండు ఫోన్లూ 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »